Jump to content

చాపేకర్ సోదరులు

వికీపీడియా నుండి
(చాపే సోద్దరులు నుండి దారిమార్పు చెందింది)
దామోదర్ హరి చాపేకర్
బాలకృష్ణ హరి చాపేకర్
వాసుదేవ హరి చాపేకర్

చాపేకర్ సోదరులు - దామోదర్ హరి చాపేకర్ (1870-1898), బాలకృష్ణ హరి చాపేకర్ (1873-1899, బాపూరావుగా సుప్రసిద్ధుడు), వాసుదేవ్ హరి చాపేకర్ (1879-1899, వాసుదేవగా ప్రసిద్ధులు) - భారతీయ స్వాతంత్ర్యోద్యమకారులు. వారు పూణె లోని బ్రిటిష్ ప్లేగు కమీషనర్ డబ్ల్యూ.సి.రాండ్ హత్యోదంతంలో పాలుపంచుకున్నవారు.[1]

భారతదేశం ఆంగ్లేయుల పాలనలో వున్నప్పుడు బ్రిటిష్ అధికారుల నిర్లక్ష్యానికి ఎదురొడ్డి అసువులు బాసిన ఎందరో యువకుల కథలు మనకు తెలుసు. వారిలో భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్ వంటివారి గురించి చాల మందికి తెలుసు. ఆ కోవకు చెందిన వారే చాపే సోదరులు.

ర్యాండ్ హత్యోదంతం

[మార్చు]

1896-97 సంవత్సరాలల్లో మహారాష్ట్రలోని పూనే నగరంలో భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రభలి వేల మంది ప్రజలు చనిపోగా చాలామంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళి పోయారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్లేగు వ్యాధిని అదుపులోనికి తెచ్చేందుకు 'ర్యాండ్ ' అనే అధికారిని అతనికి మద్దతుగా కొంత సైన్యాన్ని పూనేకు పంపింది. కొంత కాలానికి పూనేలో పరిస్థితి మామూలు అయింది. కానీ 'ర్యాండ్ ' అతని సైన్యం పూనే ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించేవారు. ఈ విషయాన్ని బాలగంగాధర్ తిలక్ తన పత్రికలో వ్రాశారు. ఈ వార్తను చదివిన పూనే యువకులు బ్రిటిష్ వాళ్లవల్లే మనకు కష్టాలు కలుగుతున్నాయని వారిపై కోపం పెంచుకున్నారు. వారిలో దామోదర చాపేకర్, బాలకృష్ణ చాపేకర్ సోదరులు ముఖ్యులు. బ్రిటిష్ ప్రభుత్వం పై పగతో 'ర్యాండే ' ను కాల్చి చంపాలని నిర్ణయించుకొని దానికి ఒక పథకం వేశారు. అదే సమయములో ఇంగ్లాండును పాలించే విక్టోరియా రాణీకి 60 ఏండ్లు నిండాయి. ఆ సందర్భంగా భారతదేశం అంతటా ఉత్సవాలు జరిగాయి. పూనేలో 1897 జూన్ 22 లో ఆ ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంలో రాండెను కాల్చి చంపాలని పథకం వేశారు. ఉత్సవాలకు హాజరై తిరుగు ప్రయాణమైన ర్యాండ్ ను, అతని వెంటనున్న లెప్టినెంటు 'అయరెస్ట్' కాల్చి వేశారు చాపే సోద్దరులు. అయరెస్ట్ ' అక్కడికక్కడే చనిపోగా ర్యాండే కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు.

ప్రభుత్వ విచారణలో చాపేకర్ సోధరులే ఈ హత్యలు చేశారని తేలింది. దామోదర్ చాపేకర్ పోలీసులకు దొరికిపోయాడు. ఆతర్వాత బాలకృష్ణ కూడా పట్టుబడ్డాడు. దామోదర్ ను దోషిగా నిర్దరించినకోర్టు ఉరి శిక్షను విధించింది.1898 ఏప్రిల్ 18 న దామోదర్ ను ఉరి తీశారు. అప్పటికి అతని వయస్సు 27 సంవత్సరాలు. తమ గురించి ప్రభుత్వా నికి చెప్పిన వాళ్లను దామోదర్ మరో తమ్ముడు వాసుదేవ చాపేకర్ చంపేశాడు. దీనికి మహాదేవ రెనడే, ఖండో విష్ణు సాఠే సహకరించారు. కాని అదే రోజు సాయంత్రం ఒక కానిస్టేబుల్ ను చంపే ప్రయత్నంలో వీళ్ళందరు పోలీసులకు పట్టు బడ్డారు. ప్రభుత్వం వీరందిరిపైకేసు పెట్టి విచారించింది.1899 మే 8 న వాసుదేవచాపేకర్ ను మే 10 న మహాదేవ చాపేకర్ ను, మే 12 న బాలకృష్ణ చాపేకర్ లను ఉరి తీశారు. అప్పుడు వాసుదేవ చాపేకర్ వయసు కేవలం 18 సంవత్సరాలు, బాలకృష్ణ చాపేకర్ వయస్సు 24 ఎళ్లు. అప్పట్లో ఈ వార్త అంతర్జాతీయ పత్రికల్లో వచ్చింది. ఒకే కుటుంబం నుండి ముగ్గురు అన్నదమ్ములు భరత మాత సంకెళ్లు తెంచడానికి ఉరి శిక్షను కూడా చిరునవ్వుతో స్వీకరించారు. ఈ సోదరులు ప్రాణ త్యాగం దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్వతిరేకంగా విప్లవ కార్య కలాపాలకు స్ఫూర్తినిచ్చింది.

మూలం

[మార్చు]
  1. Echenberg, Myron J. (2007). Plague Ports: The Global Urban Impact of Bubonic Plague, 1894–1901. New York: New York University Press. pp. 66–68. ISBN 0-8147-2232-6.

వెలుపలి లంకెలు

[మార్చు]
  • బాల భారతం పత్రిక ఆగస్టు 2015.