చెంఘీజ్ ఖాన్ గుర్రపు విగ్రహం
Чингис хааны морьт хөшөө | |
ప్రదేశం | ఎర్డేన్, టోవ్ ప్రోవిన్స్, మంగోలియా |
---|---|
రూపకర్త | డి. ఎర్డెంబిలెగ్ (శిల్పి), జె. ఎన్&ఖ్‌జర్గల్ (ఆర్కిటెక్టు)[1] |
రకం | గుర్రపు విగ్రహము |
నిర్మాన పదార్థం | స్టెయిన్‌లెస్ స్టీల్[2] |
ఎత్తు | 40 మీటర్లు (130 అ.) |
పూర్తయిన సంవత్సరం | 2008 |
అంకితం చేయబడినది | చెంఘీజ్ ఖాన్ |
చెంఘీజ్ ఖాన్ గుర్రపు విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దదైన గుర్రపు విగ్రహము. ఇది మంగోలియా దేశంలో ఉన్నది.
ఇది చెంఘీజ్ ఖాన్ విగ్రహ సముదాయంలో భాగం. దీని ఎత్తు 40 మీటర్లు (131 అడుగులు). ఇది తూల్ నది ఒడ్డున, మంగోలియా రాజధాని ఉలన్ బాటర్‌కు తూర్పుగా 54 కి.మీ. దూరాన, త్సోన్జిన్ బోల్డాగ్ వద్ద ఉంది. పురాణాల ప్రకారం, అతను ఇక్కడే బంగారు కొరడాను కనుగొన్నాడు. ఈ విగ్రహం అతని జన్మస్థలం ఉన్న తూర్పు వైపు చూస్తూ ఉండేలా నిర్మించారు. ఇది సందర్శకుల కేంద్రమైన చెంఘిస్ ఖాన్ విగ్రహం కాంప్లెక్సు పైన ఉంది. ఈ కాంప్లెక్సు ఎత్తే 10 మీటర్ల (33 అడుగులు) ఉంటుంది. దీనికి ఉన్న 36 స్థంభాలు చెంఘీజ్ ఖాన్ నుండి లిగ్దాన్ ఖాన్ వరకూ ఉన్న 36 గురు ఖాన్లను సూచిస్తాయి. దీనిని శిల్పి డి. ఎర్డెనెబిలేగ్, ఆర్కిటెక్ట్ జె. ఎన్‌ఖజర్‌గల్‌లు రూపొందించారు. దీన్ని 2008 లో నిర్మించారు.[3]
సందర్శకులు గుర్రం ఛాతీ, మెడ గుండా నడిచి తలను చేరుకుంటారు. అక్కడి నుండి వారు సువిశాలమైన, విస్తృతమైన దృశ్యాన్ని చూడవచ్చు. 13 వ శతాబ్దపు మంగోల్ తెగలు ఉపయోగించిన గుర్రపు బ్రాండ్ గుర్తుల నమూనా వలె ప్రధాన విగ్రహ ప్రాంతం చుట్టూ 200 జెర్ (యుర్ట్) [నోట్స్ 1] లు ఉంటాయి. [4] కాంప్లెక్స్ ఖర్చు 30 కోట్ల రూపాయలు ఖర్చైంది. మంగోలియన్ సంస్థ ది జెన్కో టూర్ బ్యూరో ఈ ఖర్చును భరించింది.[5]
ఇక్కడున్న మ్యూజియంలో మంగోలియాలోని కాంస్య యుగం, జియాంగ్ను పురావస్తు సంస్కృతులకు సంబంధించిన ప్రదర్శనలు ఉన్నాయి. ఒక ప్రదర్శనలో రోజువారీగా వాడే పాత్రలు, బెల్టు బకిళ్ళు, కత్తులు, పవిత్ర జంతువులు మొదలైనవి ఉంటాయి. మరో ప్రదర్శనలో 13 వ, 14 వ శతాబ్దాలలో చెంఘీజ్ ఖాన్ కాలానికి చెందిన ఉపకరణాలు, స్వర్ణకారుల వస్తువులు, కొన్ని నెస్టోరియన్ శిలువలు, రోసరీలూ ఉంటాయి. మ్యూజియం ప్రక్కనే ఒక పర్యాటక వినోద కేంద్రం ఉంది, ఇది 212 హెక్టార్లలో (520 ఎకరాలు) విస్తరించి ఉంది.
విశేషాలు
[మార్చు]- ప్రపంచంలోనే అతి ఎత్తయిన 'ఈక్వెస్త్ట్రెన్ స్టాట్యూ ' ఇదే. అంటే రౌతుతోఉన్న గుర్రమని అర్థం. దీనిపై మంగోలియాను పాలించిన ప్రముఖ చక్రవర్తి చెంగిస్ ఖాన్ పేద్ద విగ్రహం ఉంటుంది. చేతిలో బంగారు కొరడా మరింత ఆకర్షణీయంగా మిరుమిట్లు గొలుపుతుంది.
- పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీలుతో తయారు చేసిన ఈ భారీ విగ్రహం నిర్మాణానికి 250 టన్నుల స్టీలు ఉపయోగించారు. అందుకే పగలు కన్నా రాత్రి విద్యుత్ దీపాలతో మరింత మెరిసిపోతూ కనిపిస్తుంది.
- నిర్మాణానికి రెండేళ్లు పట్టింది. 2006లో పనులు మొదలైతే 2008లో పూర్తయ్యాయి.
- చుట్టూ దుకాణాలతో ఎప్పుడూ పర్యాటకుల సందడితో ఈ ప్రాంతమంతా కళకళలాడుతూ ఉంటుంది.
- కొండపై విశాల స్థలంలో ఉండే ఈ విగ్రహం దగ్గరికి వెళ్లడానికి మెట్లు ఉంటాయి.
మూలాలు
[మార్చు]- ↑ The Chinggis Khan Statue Complex Archived 2012-04-25 at the Wayback Machine Mongolian National Tourism Organization
- ↑ [1] Archived 2011-04-11 at the Wayback Machine touristinfocenter
- ↑ "The Chinggis Khan Statue Complex". Mongolian National Tourism Organization. Archived from the original on 2012-04-25. Retrieved 2011-11-20.
- ↑ Chinggis khan statue complex Archived 2012-07-05 at the Wayback Machine
- ↑ Levin, Dan (August 2, 2009). "Genghis Khan Rules Mongolia Again, in a P.R. Campaign". The New York Times. Retrieved 29 December 2016.
ఉల్లేఖన లోపం: "నోట్స్" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="నోట్స్"/>
ట్యాగు కనబడలేదు