ఆక్వాకల్చర్
ఆక్వాకల్చర్ (ఆంగ్లం: Aquaculture) [1] అనగా చేపల పెంపక పరిశ్రమ. కొన్ని నిర్థిష్ట ప్రమాణాలలో, నియంత్రిత పరిస్థితులలో ఎంపిక చేసిన జీవ జాతులను పెంచడం సంవర్ధన పరిశ్రమ అంటారు. ఈ జీవులను సాగర జలాల్లో పెంచినట్లయితే సముద్రనీటి ఆక్వాకల్చర్ అంటారు. అలాగే ఉప్పునీటి కయ్యలలో అయితే ఉప్పునీటి ఆక్వాకల్చర్ అంటారు. మంచినీటిలో పెంచినట్లయితే మంచినీటి ఆక్వాకల్చర్ అంటారు.[2]
మంచినీటి చేపల, రొయ్యల పెంపకం
[మార్చు]మంచినీటిలో చేపలను, రొయ్యలను పెంచడాన్ని మంచినీటి చేపల, రొయ్యల పెంపకం అంటారు.
ఉప్పునీటి చేపల, రొయ్యల పెంపకం
[మార్చు]ఉప్పు నీటిలో చేపలను, రొయ్యలను పెంచడాన్ని ఉప్పు నీటి చేపల, రొయ్యల పెంపకం అంటారు.
ఆక్వా ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదే్‌శ్ అగ్రగామి
[మార్చు]దేశవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తుల విస్తీర్ణం, విలువ, దిగుబడిపై సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి ప్రోత్సాహకం సంస్థ (మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ-ఎంపెడా) 2021-22 నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం ఆక్వా ఉత్పత్తుల దిగుబడి, ఎగుమతుల్లో ఏపీ దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా మెరుగైన ఫలితాలు సాధించింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ Garner, Bryan A. (2016), Garner's Modern English Usage (4th ed.), ISBN 978-0190491482
- ↑ "Answers - The Most Trusted Place for Answering Life's Questions". Answers.com.
- ↑ "తగ్గేదేలే.. మీసం తిప్పిన ఆంధ్రా రొయ్య, ఆక్వాలో ఏపీ టాప్.. ఎగుమతుల్లో తొలి స్థానం". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-12. Retrieved 2022-03-13.