Jump to content

ఛెల్లో షో (గుజరాతీ సినిమా)

వికీపీడియా నుండి
(ఛెల్లో షో (గుజరాతి సినిమా) నుండి దారిమార్పు చెందింది)
ఛెల్లో షో
2019లో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఛెల్లో షో షూటింగ్‌లో పాన్ నలిన్
దర్శకత్వంపాన్ నలిన్
రచనపాన్ నలిన్
నిర్మాత
తారాగణం
  • భవిన్ రాబరి
  • భావేష్ శ్రీమాలి
  • రిచా మీనా
  • దిపెన్ రావల్
  • పరేష్ మెహతా
ఛాయాగ్రహణంస్వప్నిల్ ఎస్. సోనావానే
కూర్పుశ్రేయాస్ బెల్టాంగ్డి
పవన్ భట్
సంగీతంసిరిల్ మోరిన్
నిర్మాణ
సంస్థలు
  • ఛలో షో ఎల్.ఎల్.పి
  • మాన్సూన్ ఫిల్మ్స్
  • జుగాద్ మోషన్ పిక్చర్స్
పంపిణీదార్లుసిద్ధార్థ్ రాయ్ కపూర్(రాయ్ కపూర్ ఫిల్మ్స్)[1]
విడుదల తేదీs
10 జూన్ 2021 (2021-06-10)(ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్)
14 అక్టోబరు 2022 (భారతదేశం)
సినిమా నిడివి
110 నిమిషాలు
దేశంభారతదేశం
భాషగుజరాతీ

ఛెల్లో షో లేదా ఛెల్లో శో[గమనిక 1] (అర్థం: చివరి షో, గుజరాతీ: છેલ્લો શો) పాన్ నళిన్ దర్శకత్వం వహించిన 2021 గుజరాతీ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా చిత్రం. ఇందులో భవిన్ రాబారి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్, పరేష్ మెహతా నటించారు.[2] ఈ చిత్రం తొలిసారి 20వ ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో 2021 జూన్ 10న ప్రదర్శించారు. స్పెయిన్‌లో జరిగిన వల్లాడోలిడ్‌ చిత్రోత్సవంలో గోల్డెన్‌ స్పైక్‌ పురస్కారంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు ఇప్పటికే గెలుచుకుంది.

గుజరాత్‌లోని ఓ మూరుమూల పల్లెటూరులో జరిగే కథతో తెరకెక్కిన ఛెల్లో షో 95వ అకాడెమీ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రానికి భారతీయ ఎంట్రీగా ఎంపికైంది.[3][4] కాగా ఈ సినిమా ‘ది లాస్ట్‌ షో’ పేరుతో దేశవ్యాప్తంగా 2022 అక్టోబరు 14న ఆంగ్ల భాషలో థియేటర్‌లలో విడుదల కానుంది.

తారాగణం

[మార్చు]
  • భవిన్ రాబారి
  • భవేష్ శ్రీమాలి
  • రిచా మీనా
  • దీపేన్ రావల్
  • పరేష్ మెహతా
  • వికాస్ బాటా
  • రాహుల్ కోలీ
  • శోబన్ మక్వా
  • కిషన్ పర్మార్
  • విజయ్ మెర్
  • అల్పేష్ టాంక్
  • టియా సెబాస్టియన్
  • జాస్మిన్ జోషి

విషాదం

[మార్చు]

ఛెల్లో షో సినిమాలో నటించిన ఆరుగురు బాలనటుల్లో ఒకడైన 10 ఏళ్ళ రాహుల్ కోలీ మృతి చెందాడు. రాహుల్ కోలీ గత కొంతకాలంగా ల్యుకేమియాతో పోరాడుతూ పరిస్థితి విషమించడంతో 2022 అక్టోబరు 2న కన్నుమూశాడు. [5]

గమనికలు

[మార్చు]
  1. గుజరాతీ లిపిలో చిత్రం పేరు

మూలాలు

[మార్చు]
  1. Ramachandran, Naman (12 September 2022). "Roy Kapur Films to Distribute Pan Nalin's 'Last Film Show' in India". Variety. Retrieved 20 September 2022.
  2. "Pan Nalin's Gujarati film Chhello Show to open Tribeca Film Festival's Spotlight section". Firstpost. 2021-04-27. Archived from the original on 27 April 2021. Retrieved 2021-05-27.
  3. "Oscars: ఆస్కార్‌ బరిలో 'ఛెల్లో షో'". web.archive.org. 2022-10-11. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Gujarati movie Chhello Show is India's entry for 2023 Oscars". The Indian Express (in ఇంగ్లీష్). 2022-09-20. Retrieved 2022-09-20.
  5. "క్యాన్సర్‌తో 'ఛెల్లో షో' బాల నటుడి మృతి". web.archive.org. 2022-10-11. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)