జీరో ఎఫ్‌ఐఆర్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

’ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రప్రధమ సమాచార ఫిర్యాదు’[మార్చు]

భారతీయ ’క్రిమినల్ ప్రొసీజర్ కోడ్’ లో 154 వ విభాగము ( ఆంగ్లము: సెక్షన్) లోని మొదటి సబ్ సెక్షన్ నందు పొదుపరచబడిన దానినే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రప్రధమ సమాచార ఫిర్యాదు గా పిలుస్తున్నాము. ఒక మహిళ ఫిర్యాదు చేస్తున్నపుడు మరొక మహిళా పోలీసు ఉద్యోగి మాత్రమే లిఖించ వలసి ఉంది. ఇది భారతీయ శిక్షా సృతి లోని 326A,326 B ,354 , 354A-D,376,376A-E మరియు 509 సెక్షన్ ల లోనికి వచ్చు నేరాల విషయమై చెప్పబడీంది.ఫిర్యాదు దారుడు ఎఫ్ ఐ ఆర్ యొక్క ఒక నకలును పొందే హక్కు ఉంది.[1]

జీరో ఎఫ్‌ఐఆర్‌[మార్చు]

పోలీసు స్టేషన్‌ పరిధులతో సంబంధం లేకుండా ఎఫ్‌ఐఆర్‌ ను నమోదు చేసి ముందు దర్యాప్తు ప్రారంభిస్తారు. అనంతరం కేసును సంబంధిత స్టేషన్‌కు బదిలీ చేస్తారు. వాస్తవానికి ఇదేం కొత్త విధానం కాదు. ఇప్పటికే మనుగడలో ఉన్నదే. ప్రత్యేకించి యువతులు, బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారంటూ వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తారు.[2]

కొనసాగే నేరం (ఆంగ్లం: కంటిన్యుయింగ్ అఫెన్స్)[మార్చు]

అదే నేరం ఒక ప్రదేశం లో జరిగి అదే వ్యక్తి పై అదే నేరం వేరొక స్టేషన్ పరిధి లో జరిగితే రెండు చోట్లా నేరం నమోదు చేయవచ్చు. ఇక్కడ జీరో ఎప్ ఐ అర్ లగా బదిలి చేయాల్సిన అవసరం లేదు.[3]

ప్రస్తుత పరిస్థితి[మార్చు]

జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని చాలా ఏళ్లుగా తెలంగాణ పోలీసులు పాటిస్తున్నారు. 2018లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధుల్లో దాదాపు 1,200 కేసులు ఈ విధానంలో నమోదయ్యాయి. అనంతరం దర్యాప్తు దశలో వాటిని ఇతర స్టేషన్లకు బదిలీ చేశారు. తాజాగా వరంగల్‌లోని సుబేదారిలో నమోదైన యువతి మిస్సింగ్‌ కేసుతో జీరో ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య ఈ ఏడాదిలో 200 దాటింది. గతంలో కేసుల బదిలీ ప్రక్రియ మాన్యువల్‌గా జరిగేది. ప్రస్తుతం పోలీసులు సీసీటీఎన్‌ఎస్‌ (క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ సిస్టం) ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ఎఫ్‌ఐఆర్‌ను బదిలీ చేయడం జరుగుతుంది.. ఈ విధానం లో విషయాన్ని సంబంధిత ఎస్పీ, కమిషనర్‌ కార్యాలయాలకు వెంటనే సమాచారం చేరిపోతుంది. ఆ వెంటనే సీసీటీఎన్‌ఎస్‌ ద్వారా డీజీపీ కార్యాలయానికి కేసు వివరాలు చేరతాయి. ఇలాంటి కేసులను ఎస్పీ, కమిషనర్‌తోపాటు డీజీపీ కార్యాలయం కూడా పర్యవేక్షిస్తాయి.[4]

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండిు[మార్చు]