జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్

వికీపీడియా నుండి
(జెఈఈ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఈఈ) అనేది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు, కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే అఖిల భారతదేశ సాధారణ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. అత్యంత కఠినమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఒకటిగా దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. 2012 లో, అంతకు పూర్వం ప్రభుత్వం నడుపుతున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే AIEEE, ఐఐటీ-జేఈఈ స్థానంలో ఈ సాధారణ పరీక్షను ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో జేఈఈ జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ అని రెండు భాగాలు ఉన్నాయి. కేవలం జేఈఈ మెయిన్స్ లో ఎంపికైన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ లో హాజరయ్యేందుకు అర్హులు. 200,000 లకుపైగా విద్యార్థులు ప్రతి సంవత్సరం ఎంపికవుతున్నారు.


జాయింట్ సీట్ కేటాయింపు అథారిటీ (జోసా) మొత్తం 24 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లు, 32 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లు, 18 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్యాంపస్‌లు, ప్రభుత్వ నిధులతో నడిచే 19 ఇతర సాంకేతిక సంస్థల (జిఎఫ్‌టిఐ) లలో విద్యార్థులను చేర్చుకునేందుకు సంయుక్త ప్రవేశ ప్రక్రియను నిర్వహిస్తుంది.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఇఆర్), రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్జిఐపిటి), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) వంటి కొన్ని సంస్థలు ప్రవేశానికి ప్రాతిపదికగా జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో పొందిన స్కోర్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ సంస్థలు పరీక్షానంతరంజరిగే కౌన్సెలింగ్ ప్రక్రియ‌లో పాలు పంచుకోవు. ఐఐటిలలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఇక ఆ తరువాతి సంవత్సరాల్లో జరిగే జెఇఇ-అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరు కాజాలరు. కాని ఐఐఎస్సి, ఐఐఎస్ఇఆర్, ఆర్‌జిఐపిటి వంటి ఇతర సంస్థల విషయంలో ఈ నిబంధన లేదు.

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం, ప్రైవేటు కాలేజీలతో సహా భారతదేశం లోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు, నీట్ పరీక్ష తరహాలో, ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. [1]

సంవత్సరం వారీగా అభ్యర్థుల సంఖ్య

[మార్చు]
ఇయర్ విద్యార్థుల సంఖ్య
2020 (ఏప్రిల్) వాయిదా పడింది

(COVID-19 మహమ్మారి కారణంగా)

2020 (జనవరి)    921,261 [2] Decrease
2019    929,198 [3] Decrease
2018 1,043,739 [4] Decrease
2017 1,186,454 [5] Decrease
2016 1,194,938 [6] Decrease
2015 1,304,495 [7] Decrease
2014 1,356,805 [8] Increase
2013 1,282,000 [9] Increase
2012    479,651 [10]

మూలాలు

[మార్చు]
  1. "MHRD plans single entrance exam for all engineering colleges from 2018". 10 February 2017.
  2. https://jeemain.nta.nic.in/WebInfo/Handler/FileHandler.ashx?i=File&ii=205&iii=Y
  3. "JEE Main 2019: In April, 9.35 lakh candidates registered; January was 9.29 lakh -The Indian Express".
  4. "IIT JEE Main 2018: 10.5 lakh students appeared for the examination - Times of India".
  5. "RESULT OF JEE (MAIN) 2017" (PDF). 27 April 2017.
  6. "CBSE JEE Main 2016: Check out the result analysis here!". Archived from the original on 2017-11-16. Retrieved 2020-08-15.
  7. "JEE Main Registrations Stats: 2014 vs 2015". Archived from the original on 2017-11-07. Retrieved 2020-08-15.
  8. "JEE Main 2014 Result Analysis".
  9. "JEE Main rank predictor 2022". 26 June 2022. Archived from the original on 16 మే 2022. Retrieved 26 జూన్ 2022.
  10. "JEE 2012 Report" (PDF).

11