డెసర్ట్ జాతీయ ఉద్యానవనం
(డెసర్ట్ జాతీయ ఉద్యానవనం నుండి దారిమార్పు చెందింది)
డెసర్ట్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Nearest city | జైసల్మీర్ |
Coordinates | 27°2′22″N 70°53′2″E / 27.03944°N 70.88389°E |
Area | 3,162 కి.మీ2 (1,221 చ. మై.) |
Established | 1981 |
డెసర్ట్ జాతీయ ఉద్యానవనం రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్‌మీర్ ప్రాంతంలో ఉంది. భారతదేశంలో ఉన్న అతి పెద్ద ఉద్యనవనాల్లో ఇది ఒకటి.'[1]
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యనవనాన్ని 1981 లో స్థాపించారు. ఇది 3162 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవన సంరక్షణ కేంద్రంలో బట్టమేక పక్షులు ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటాయి. దేశ విదేశాల నుంచి ఈ ఉద్యనవనానికి ఎన్నో అరుదైన పక్షులు వలసకు వస్తాయి. శీతాకాలంలో డెమోసెల్లె క్రేన్, మాక్ క్వీన్స్ బస్టర్డ్ లాంటి అరుదైన పక్షులు వలస వస్తాయి. ఇందులో ఉన్న గడిసిసర్ సాగర్ కొలను వద్దకు ఎన్నో పక్షులు వలస వస్తాయి. ఇక్కడ పక్షులే కాకుండా అంతరించిపోతున్న ఎడారిలో నివసించే భిన్న జాతులకు చెందిన రాబందులు, తోడేళ్ళు, సరీసృపాలు సంరక్షించబడుతున్నాయి.
చిత్రమాలికలు
[మార్చు]-
నక్క
మూలాలు
[మార్చు]- ↑ Hop Around India. "Desert National Park Jaisalmer views". Archived from the original on 31 మార్చి 2016. Retrieved 31 August 2019.