Jump to content

డోనాల్డ్ డక్

వికీపీడియా నుండి
(డొనాల్డ్ డక్ నుండి దారిమార్పు చెందింది)
డొనాల్డ్ డక్
మొదటి దర్శనంద వైజ్ లిటిల్ హెన్ (1934)
సృష్టికర్తవాల్ట్ డిస్నీ
Voiced byక్లారెన్స్ నాష్ (1934–85)
టోనీ ఆన్సెల్మో (1985–ప్రస్తుతం)
అభివృద్ధి చేసినవారుడిక్ లాండీ, ఫ్రెడ్ స్పెన్సర్, కార్ల్ బార్క్స్, జాక్ కింగ్, జాక్ హెన్నా
సమాచారం
Alias
  • మాయి మలార్డ్
  • ఫ్రాంక్ డక్
  • ఫ్రెడ్
  • డక్ అవెంజర్
    పేపరింక్ (ఇటలీ)
    సూపర్ డక్ (యుకె)
  • డబుల్ డక్
Nicknameడాన్
Speciesబాతు
కుటుంబండక్ కుటుంబం
బంధువులుస్క్రూజ్ మెక్ డక్ (అంకుల్)
లుడ్విగ్ వాన్ డ్రాక్ (అంకుల్)
హ్యూ, డీవె, లూయీ (మేనల్లుళ్ళు)
డక్ కుటుంబం (తండ్రివైపు బంధువులు)
క్లాన్ మెక్ డక్ (తల్లివైపు బంధువులు)

డోనాల్డ్ డక్ అన్నది 1934లో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ లో సృష్టించిన కార్టూన్ పాత్ర. డోనాల్డ్ అన్నది మానవ లక్షణాలు కలిగిన పసుపు-నారింజ రంగు ముక్కు, కాళ్ళు, పాదాలు కలిగివున్న తెల్లని బాతు. సాధారణంగా అతను నావికుల చొక్కా, టోపీ పెట్టుకుని, బో టై కట్టుకుని ఉంటాడు. తన విచిత్రమైన స్వరంతో డైలాగులకు, చిలిపిదనం, కోపంతో కూడిన లక్షణాలకు చాలా పేరొందాడు. అతని స్నేహితుడైన మిక్కీ మౌస్ తో కలిసి డొనాల్డ్ డక్ అత్యంత ప్రాచుర్యం పొందిన డిస్నీ పాత్రగానూ, టీవీ గైడ్ వారు 2002లో తయారుచేసిన 50 అతిగొప్ప కార్టూన్ పాత్రల జాబితాలోనూ చోటు దక్కించుకుంది.[1] ఏ ఇతర డిస్నీ పాత్ర కన్నా ఎక్కువ మార్లు సినిమాల్లో కనిపించాడు,[2] సూపర్ హీరో తరహాకి చెందని పాత్రల్లో ప్రపంచంలోకెల్లా ఎక్కువ కామిక్ పుస్తకాల్లో కనిపించిన పాత్ర కూడా డొనాల్డ్ డక్.[3]

యానిమేటెడ్ కార్టూన్లలో హాస్య పాత్రలతో డొనాల్డ్ డక్ ప్రాచుర్యాన్ని పొందాడు. 1934లో ద వైజ్ లిటిల్ హెన్ కార్టూన్లో మొదటిసారిగా కనిపించింది, ఐతే రెండో సారి కనిపించిన ఆర్ఫన్స్ బెనిఫిట్ తో మిక్కీ మౌస్ తో జోడీగా హాస్యం చేయడం ప్రారంభించారు. తర్వాతి రెండు దశాబ్దాల్లో 150 థియేట్రికల్ సినిమాల్లో ప్రధాన పాత్రగా వచ్చాయి. వీటిలో చాలావరకూ ఆస్కార్ అవార్డుల్లో గౌరవం పొందాయి. 1930ల్లో మిక్కీ మౌస్, గూఫీతో సహా హాస్య త్రయంలో భాగంగా సాధారణంగా సినిమాల్లో కనిపించడమే కాక 1937లో డాన్ డొనాల్డ్ పేరున్న సినిమాతో మొదలై డొనాల్డ్ డక్ సీరీస్ కొనసాగింది. ఈ సినిమాల్లో డొనాల్డ్ డక్ ప్రేమించే డైసీ డక్ ని, హ్యూ, డవె, లూయీ అన్న ముగ్గురు మేనల్లుళ్ళనీ కూడా ఈ సీరిస్ లలో పరిచయం చేశారు. 1956లో విడుదలైన చిప్స్ అహోయ్ సినిమా తర్వాత ఎడ్యుకేషనల్ ఫిల్మ్స్ లోనే కనిపించింది, మళ్ళీ థియేటర్లో విడుదలైన డొనాల్డ్ డక్ యానిమేషన్ సినిమా మికీస్ క్రిస్మస్ కారొల్ 1983లో విడుదలైంది. అత్యంత ఇటీవల ఆ పాత్ర కనిపించిన థియేట్రికల్ సినిమా ఫాంటసియా 2000 1999లో విడుదలైంది. 2004లో వచ్చిన డైరెక్ట్ టు వీడియో సినిమా మిక్కీ, డొనాల్డ్, గూఫీ:ద త్రీ మస్కెటీర్స్ లో, మిక్కీ మౌస్ క్లబ్ హౌస్ (2006-16) అన్న టెలివిజన్ సీరీస్ లోనూ, క్వాక్ షాట్ (1991) లాంటి వీడియో గేంలలోనూ కనిపించింది.[4]

యానిమేషన్లోనే కాకుండా కామిక్స్ లోనూ డొనాల్డ్ ప్రాచుర్యం పొందాడు. డొనాల్డ్ పాత్రను ఆల్ టాలిఫెర్రో, కార్ల్ బార్క్స్, డాన్ రోసాలు చేసిన చిత్రీకరణలు ప్రఖ్యాతి చెందాయి. ప్రత్యేకించి బార్క్స్ డొనాల్డ్ డక్ జీవించే ఊహాత్మక ప్రపంచాన్ని విస్తరించి అతని ప్రపంచంలోకి డొనాల్డ్ ధనవంతుడైన అంకుల్ స్క్రూజ్ మెక్ డక్ వంటి ఇతర పాత్రలను తీసుకువచ్చారు. ఐరోపాలో, అందులోనూ నార్డిక్ దేశాల్లో సుప్రసిద్ధమైన పాత్ర. నార్డిక్ దేశాల్లో డొనాల్డ్ డక్ అండ్ కో అన్న వారపత్రిక 1950ల నుంచి 2009 వరకూ వెలువడింది. డిస్నీ కామిక్స్ పట్ల అభిమానం కలిగివుండటానికి డొనాల్డిజం (Norwegian:Donaldisme


) అన్న పదం నార్వే నుంచి ప్రారంభం కావడం గమనార్హం.[5][6]

మూలాలు

[మార్చు]
  1. TV Guide's 50 greatest cartoon characters of all time Archived 2013-03-25 at the Wayback Machine.
  2. Not including television episodes but including short films, Donald has appeared in 197 films.
  3. Overall, Donald is the fifth most published comic book character in the world after Superman, Batman, Spider-Man, and Wolverine.
  4. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో డోనాల్డ్ డక్ పేజీ
  5. "DON ROSA on Carl Barks". Bpib.com. January 1, 2001. Archived from the original on 2011-02-23. Retrieved 2011-08-01.
  6. www.hardcoregaming101.net