తారంగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తారంగ గుజరాత్ లో మహెసానా (Mahesana) జిల్లాలో ఉన్న ఓ పర్వత ప్రాంతం. దట్టమైన అరణ్యప్రాంతంలో ఉన్న తారంగలో ఏమంత పెద్ద పర్వతాలు లేవు కాని అన్నింటికన్నా పెద్ద పర్వతం యొక్క ఎత్తు 1200 అడుగులు. కాని మనుష్య సంచారానికి దూరంగా అరణ్యప్రాంతంలో ఉన్న తారంగలో కొండలు రకరకాల ఆకారాలలో తెల్లగా మెరిసిపోతూ ప్రకృతి రమణీయతతో మనసుని మైమరపిస్తాయి. బహుశా ఈ కారణం వల్లనేనేమో జైనుల ఐదు ముఖ్యమైన తీర్ధాంకరాలలో ఇదీ చేరింది. ఈ ప్రదేశం సబర్మతి నదికి పడమర దిశలో ఉంటుంది. అహ్మదాబాద్ నుంచి రోడ్ ద్వారా మూడు గంటల ప్రయాణం. తారంగ నుండి శక్తిపీఠాలలో ఒకటైన అంబాజి మందిరం కేవలం 50 కి.మీ. దూరంలో ఉంది.

Taranga.jpg

తారంగ చరిత్ర[మార్చు]

12వ శతాబ్ధంలో పాటన్ (గుజరాత్) ని పరిపాలించిన సోలంకి రాజైన శ్రీ కుమార్ పాల్ స్వయంగా ఒక శ్వేతాంబర జైనుడు. ఆయనే ఈ స్థలాన్ని ఎంచి ఒక సుందరమైన మందిరాన్ని భగవాన్ శ్రీ అజిత్ నాధ్ గౌరవార్ధం నిర్మింపజేశారు.

"https://te.wikipedia.org/w/index.php?title=తారంగ&oldid=810749" నుండి వెలికితీశారు