Jump to content

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్

వికీపీడియా నుండి
(తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ నుండి దారిమార్పు చెందింది)

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ (ఆంగ్లం: Telangana Brahmin Samkshema Parishad) ఇది తెలంగాణ ప్రభుత్వం చొరవతో 2017 జనవరి 28న స్థాపించబడింది. తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 కింద నమోదైన ఈ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది.[1] రాష్ట్రంలోని బ్రాహ్మణుల అభ్యున్నతికి బలమైన ఆర్థిక మద్దతు ఇవ్వడం దీని ముఖ్యోద్దేశం. దీనికి ప్రస్తుత అధ్యక్షుడు కె.వి. రమణాచారి.[2]

విదేశాల్లో చదువుకోవాలనుకునే పేద బ్రాహ్మణ విద్యార్థులు ఆర్థిక సాయం పొందేందుకు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొరకు, అలాగే పారిశ్రామిక ప్రోత్సాహానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అఫీషియల్ వెబ్సైట్ https://brahminparishad.telangana.gov.in/ Archived 2022-02-03 at the Wayback Machine. లేదంటే బొగ్గులకుంట, హైదరాబాదులో ధార్మిక భవన్ లోని కార్యాలయంలో సంప్రదించాలి.

మూలాలు

[మార్చు]
  1. "పేద బ్రాహ్మణులకు అండగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్". 2021-02-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "బ్రాహ్మణ విద్యార్థులకు నెలాఖరు వరకు గడువు". andhrajyothy. Retrieved 2022-02-03.