తొగటవీర క్షత్రియులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తొగటవీర క్షత్రియులు అనేది పద్మశాలీలవలే చేనేత వృత్తిని ఎన్నుకొన్న ఒక కులము. వీరు ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, కర్నాటకలో కనిపిస్తారు. సనాతనంగా వీరు పుష్పాండజ ముని వంశస్థులు. రాయలసీమలోని కర్నూలు జిల్లా నందవరంలో వెలసిన చౌడేశ్వరీదేవి వీరి ఆరాధ్య దైవం.తొగట వీర క్షత్రియులు చౌడెశ్వరీదేవిని ఆరాధిస్తూ జ్యోతి నృత్యం చేస్తారు. చౌడమ్మ గురించి అనేక కథలున్నాయి. ఈమె ఓంకార బిందు స్వరూపిణి. రాక్షస సం హారానికి పుష్పండజుడు అనే రాజుకు చౌడెశ్వరిగ జన్మించి 360 మంది వీర క్షత్రియులను హోమం నుండి సృష్టించింది. వీరే తొగట వీర క్షత్రియులు. వీరు ఈమెను గురించి పద్య, గద్య, ఖడ్గ రూపంలో స్తుతిస్తారు.

ఒక నమ్మకం ప్రకారం చాముండేశ్వరీ దేవి వారణాసి నుండి నందవరానికి వచ్చిందని, అక్కడున్న సుమారు 500 బ్రాహ్మణ కుటుంబాలు చాముండేశ్వరీ దేవి ఆలయానికి సంరక్షకులుగా ఉన్నారు. ఇప్పటికీ తొగటవీర క్షత్రియులు, నందవరిక బ్రాహ్మణులు కలిసిమెలిసి ఉంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో వీరు పద్మశాలీ కుల విభాగంలో తొగట సాలీలుగా గుర్తించబడుచున్నారు.

లింకులు[మార్చు]