Jump to content

దర్పణాలలో పరావర్తనం

వికీపీడియా నుండి
(దర్పణాలు లో పరావర్తన నుండి దారిమార్పు చెందింది)


గురుకుతలం గల కాగితం వంటి వస్తువుల మీద పడే కాంతి కిరణాలు విసరణ పరావర్తనం (diffuse reflection) చెంది, కంటిని చేరడం వల్ల ఆ వస్తువులను చూడగలుగుతాము.మెరుగు పెట్టిన నునుపైన తలాల పై పడినప్పుడు కాంతి పరావర్తనం చెందుతుంది.పరావర్తన కిరణాల వలన పరావర్తనతలం కనిపించదు, మనకు కనిపించేది వస్తువు యొక్క పరావర్తన ప్రతిబింబం. పరావర్తన కిరణాలతో తెర మీద వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడితే ఆ ప్రతిబింబాన్ని యధార్ధ ప్రతిబింబం అని, తెర మీద ప్రతిబింబాన్ని ఏర్పరచలేనప్పుడు దానిని మిధ్యా ప్రతిబింబం అని అంటారు.[1]

వివరణ

[మార్చు]

పరావర్తన తలానికి పతన బిందువు వద్ద గీసిన లంబానికి, పతన కిరణానికి మధ్య గల కోణాన్ని పతన కోణమని, లంబానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణాన్ని పరావర్తన కోణమని అంటారు.

కాంతి పరావర్తనం చెందినప్పుడు పతన, పరావర్తన కిరణాలు, పతన బిందువు వద్ద పరావర్తన తలానికి గీసిన లంబము ఒకే సమతలంలో ఉంటాయి. పరావర్తన కోణం పతన కోణానికి సమానంగా ఉంటుంది.పై రెండు సూత్రాలను పరావర్తన సూత్రాలు అంటారు. వీటి సహాయంతోప్రతిబింబం స్థానాన్ని, స్వభావాన్ని, పరిమాణాన్ని తెలుసుకొవచ్చు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం- భౌతిక శాస్త్రం పాఠ్య పుస్తకం

బయట లింకులు

[మార్చు]