దస్త్రంపై చర్చ:Number System.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొమ్మను మెరుగు పరచటానికి సలహాలు[మార్చు]

వెయ్యిపదాల కంటే ఒక బొమ్మ చాలు అంటే ఇదే. ఈ రేఖాచిత్రాన్ని తయారుచేసిన కాసుబాబు గారికి అభినందనలు. ఇలాంటివే తెలుగు వికీలో మరిన్ని బొమ్మలు రావాలి. బొమ్మలో కలర్ స్కీం (రంగుల ఎంపిక) అంత బాగాలేదు. వెనుకతలం (బ్యాక్‌గ్రౌండ్)ముదురు రంగులతో, వచనం లేతరంగులతో ఉండటం వలన వచనం అంత సరిగ్గా కనిపించటంలేదు. వెనుకతలాలకి లేతరంగులు, వచనానికి ముదురు రంగులు వేస్తే ఈ బొమ్మ బాగుంటుంది --వైజాసత్య 08:08, 18 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే నాది ఇంకో కోరిక కూడా. ఈ సారి బొమ్మపై ఇంకేదయినా మార్పులు చేసినప్పిడు దానిని PNG (lossless) ఫార్మాటులో భద్రపరచి అప్లోడు చేయండి. jpgలో (lossy) భద్రపరిస్తే కొంత తరువాత ఇంకెవరయినా మార్చాలనుకున్నప్పుడు బొమ్మ నాణ్యత దెబ్బతింటుంది. మ్యాపులు ఆ తరువాత ఇలాంటి బొమ్మలు PNGలలో ఉంటేనే మంచిది. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:14, 18 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ బొమ్మలొ సంఖ్యల పేర్లు మార్చి అప్లోడ్ చేయాలి.కాసు బాబు గారు ఈ బొమ్మ ఎలా తయారు చేశారు.--మాటలబాబు 15:34, 8 సెప్టెంబర్ 2007 (UTC)
అభినందనలకు కృతజ్ఞతలు. నేను ఈ బొమ్మను OPENOFFICE (Open Draw) సాఫ్ట్‌వేర్‌లో చేశాను. PNG ఫార్మాట్‌లో చేయడానికి తెలుగు ఫాంట్లతో ఏదో ఇబ్బంది వచ్చినట్లు గుర్తు. మరోసారి చూస్తాను. --కాసుబాబు 17:03, 8 సెప్టెంబర్ 2007 (UTC)