దస్త్రం:Lakshmi Narasimha Swamy temple IS Jagnnadhapuram, AP.JPG

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అసలు దస్త్రం(2,816 × 2,112 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 2.7 MB, MIME రకం: image/jpeg)

సారాంశం

వివరణ
తెలుగు: Sri Lakshmi Narasimha Swamy Temple on top of Hill

I.S.Jagannadhapuram, West Godavari District, AP ఆంధ్రప్రదేశ్ లోని జంగారెడ్డిగూడెం మండల కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో i.s జగన్నధపురంలో కొండపై స్వయంభూగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం...మంచి పర్యాటక ప్రదేశం...సినీ ప్రాముఖులు అగ్రహీరోలు దర్శించుకునే ప్రాంతం....ఆహ్లాదకరమైన వాతావరణం.....సుమారు 40కిలోమీటర్ల మేర కొండ ప్రాంతం....వ్యూ చాలాబావుంటుంది....చిన తిరుపతికి అతి చేరువైన ప్రాంతం...

అంతర్జాలం నుండి సేకరణ:

చుట్టూ పచ్చని చెట్లూ, ఎత్తయిన కొండల మధ్య కనిపిస్తుంది లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. స్వామి స్వయంభువుగా వెలసిన ఈ ఆలయంలో పాలపొంగలిని తప్ప మరొకటి నివేదించరు. స్వామి వల్లే ఈ ప్రాంతమంతా పచ్చగా కళకళ్లాడుతోందని నమ్మే భక్తులు... ఈ ఆలయంలో ఏడాది పొడవునా విశేష పూజల్ని చేస్తూ తరించడం విశేషం.

వివిధ ప్రాంతాల్లో లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు ఉన్నా... పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్‌. జగన్నాథపురంలో కొలువైన ఈ క్షేత్రంలో స్వామి భక్త సులభుడనీ... స్వామి వల్లే ఇక్కడ వర్షాలు పడుతున్నాయనీ భక్తుల నమ్మకం. ఇప్పటికీ మాతంగ మహర్షి ఈ ఆలయానికి సర్పం రూపంలో వచ్చి స్వామిని దర్శించుకుంటాడని అంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది మరి.

స్థలపురాణం ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవిలా ఉండేదట. దోపిడీ దొంగల వల్ల ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొనేవారట. వ్యవసాయం చేయాలనుకున్నా వర్షాలు సరిగ్గా పడేవి కావట. దాంతో తీవ్ర కరవుతో, రకరకాల వ్యాధులతో ప్రజలు నానా కష్టాలూ అనుభవించేవారు. తమ కష్టాలు పోవాలంటే మహర్షుల వల్లే సాధ్యమవుతుందని నమ్మిన ఈ ప్రజలకు ఇప్పటి రాజమహేంద్రవరం రోడ్డులోని కరిచర్ల గూడంలో తపస్సు చేసుకుంటున్న మాతంగ మహర్షి గురించి తెలిసిందట. దాంతో ఆ మహర్షి దగ్గరకు వెళ్లి తమ బాధలు చెప్పుకోవడంతో ఆయన ఈ ప్రాంతానికి వచ్చి స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేయడం ప్రారంభించాడట.

కొన్నాళ్లకు మహర్షి తపస్సుకు మెచ్చి లక్ష్మీనరసింహుడు ప్రత్యక్షమయ్యాడట. దాంతో మహర్షి స్వామిని ఇక్కడే ఉండి పొమ్మని కోరగా, అది సాధ్యం కాదనీ తన తేజస్సును అక్కడున్న శిలలో నిక్షిప్తం చేశాననీ చెప్పి స్వామి మాయమయ్యాడట. అప్పటినుంచీ స్థానికులు ఆ శిలనే స్వామిగా భావించి పూజలు చేయడం ప్రారంభించడంతో వాళ్ల కష్టాలు తీరాయట. అయితే కొంతకాలానికి వీళ్లు పూజలు చేయడం ఆపేశారు. కొన్నాళ్ల తరువాత లక్కవరానికి చెందిన కొచ్చర్లకోట రామారావు అనే భక్తుడు తన ఉద్యోగులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లాడట. అక్కడున్న పశువుల కాపరులు కొండపైన ఏదో ఉందనీ ఎవరైనా గట్టిగా అరిస్తే తిరిగి అంతే గట్టిగా అరుపు వినిపిస్తోందనీ చెప్పడంతో అక్కడికి వెళ్లి పరిశీలించాడట. తీరా చూస్తే రాళ్లు పరిచిన ద్వారం, మొండి గోడలతో ఉన్న ఆలయం కనిపించింది. అందులోకి వెళ్లి చూస్తే స్వామి విగ్రహం ఉందట. దాంతో అప్పటి కప్పుడు పూజలు నిర్వహించి పాల పొంగలిని నైవేద్యంగా పెట్టాడట. ఆ వెంటనే ఎవరూ ఊహించని విధంగా కుండపోతగా వర్షం పడింది. అప్పటినుంచీ నిరంతరంగా పూజలు కొనసాగిస్తున్నారనీ, వర్షాభావం సమస్యే ఎదురుకాలేదనీ చెబుతారు స్థానికులు. అంతేకాదు... ఆ రోజునుంచీ ఈ ఆలయంలో పాలపొంగలిని నివేదించే ఆచారం మొదలయ్యింది.
మూలం స్వంత కృతి
కర్త కాసుబాబు

లైసెన్సింగ్

నేను, ఈ కృతి యొక్క కాపీహక్కుదారుని, దీన్ని ఇందుమూలముగా ఈ లైసెన్సుల క్రింద ప్రచురిస్తున్నాను:
GNU head ఈ కృతి యొక్క కర్తనైన నేను, ఇక నుండీ ఈ కృతిని కాపీ చేసుకోవడానికి, పంచి పెట్టడానికి మరియు/లేదా మార్పులు-చేర్పులు చేసుకోవడానికి GFDL, లైసెన్సు వెర్షను 1.2 లేదా దాని తరువాత స్వేచ్చా సాఫ్టువేరు ఫౌండేషను విడుదలచేసే ఏ GFDL లైసెన్సు ద్వారా నయినా అనుమతి ఇస్తున్నాను; ఈ కృతిలో మార్చకూడని బాగాలు లేవు, Front-Cover పాఠం లేదు, Back-Cover పాఠం లేదు. ఈ లైసెన్సు యొక్క పత్రం నకలును "జిఎన్‌యూ ఉచిత డాక్యుమెంటేషను లైసెన్సు" అని పిలుస్తున్న విభాగంలో ఉంది.
w:en:Creative Commons
ఆపాదింపు share alike
ఈ దస్త్రం క్రియేటివ్ కామన్స్ Attribution-Share Alike 3.0 Unported లైసెన్సు క్రింద లభ్యం.
ఇలా చేసేందుకు మీకు స్వేచ్ఛ ఉంది:
  • పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
  • రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
  • ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
  • share alike – మీరు ఈ కృతిని అనుకరిస్తే, మారిస్తే, లేదా మెరుగుపరిస్తే తత్ఫలిత కృతిని ఇదే లైసెన్సు లేదా దీనికి అనుగుణ్యమైన లైసెన్సు క్రింద మాత్రమే పంపిణీ చేయాలి.
పైవాటిలో మీకు నచ్చిన లైసెన్సునును ఎంచుకోవచ్చు.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

చిత్రణ

copyright status ఇంగ్లీష్

copyrighted ఇంగ్లీష్

source of file ఇంగ్లీష్

original creation by uploader ఇంగ్లీష్

captured with ఇంగ్లీష్

Panasonic Lumix DMC-FX01 ఇంగ్లీష్

exposure time ఇంగ్లీష్

0.00125 సెకను

f-number ఇంగ్లీష్

5.6

focal length ఇంగ్లీష్

4.6 మిల్లీమీటరు

ISO speed ఇంగ్లీష్

80

media type ఇంగ్లీష్

image/jpeg

ఫైలు చరితం

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత09:09, 21 ఫిబ్రవరి 200809:09, 21 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు నఖచిత్రం2,816 × 2,112 (2.7 MB)కాసుబాబుSri Lakshmi Narasimha Swamy Temple on top of Hill I.S.Jagannadhapuram, West Godavari District, AP

కింది పేజీలలో ఈ ఫైలుకు లింకులు ఉన్నాయి:

మెటాడేటా