Jump to content

దుబాయ్

అక్షాంశ రేఖాంశాలు: 25°15′47″N 55°17′50″E / 25.26306°N 55.29722°E / 25.26306; 55.29722
వికీపీడియా నుండి
(దుబాయ్‌ నుండి దారిమార్పు చెందింది)
దుబాయ్
دبي
Dubayy
Nickname(s): 
DXB, దార్ అల్-హే, పర్షియన్ గల్ఫ్ యొక్క ముత్యం,[1] పెర్షియన్ గల్ఫ్ యొక్క వెనిస్,[2] ప్రపంచ నగరం,[2] గోల్డ్ నగరం[3]
పటం
Coordinates: 25°15′47″N 55°17′50″E / 25.26306°N 55.29722°E / 25.26306; 55.29722
దేశం United Arab Emirates
Emirateదుబాయ్
First settled1822
Founded byఓబీద్ బిన్ సెయిడ్ & మక్తూమ్ బిన్ బుట్టి అల్ మక్తూమ్
ప్రభుత్వం
 • రకంసంపూర్ణ రాచరికం
 • సంస్థదుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
 • దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్అబ్దుల్లా అల్ బస్తీ
 • దుబాయ్ పాలకుడుమహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్
విస్తీర్ణం
544 కి.మీ2 (210 చ. మై)
 • పట్టణపు1,507 కి.మీ2 (582 చ. మై)
జనాభా
 (2025)[7]
39,44,751
 • సాంద్రత7,300/కి.మీ2 (19,000/చ. మై.)
 • పట్టణపు49,45,000
 • Urban density3,300/కి.మీ2 (8,500/చ. మై.)
 • Metro63,59,527
DemonymDubaian
GDP
 • CityUS$ 134.6 billion (2023)
 • MetroUS$ 202.8 billion (2023)
కాల మండలంUTC+04:00 (UAE Standard Time)

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశంలోని ఏడు ఎమిరేట్స్ లలో దుబాయ్ (ఆంగ్లము - Dubai, అరబ్బీ భాష - دبيّ ), ఒకటి. మిగిలినవి అబు దాబి, షార్జా, అలైన్, రాస్ అల్ ఖైమా, పుజైరా, ఉమ్మ్ అల్ క్వయిన్ మొదలయినవి. దుబాయ్ సిటీగా పిలిచే ఇది ఆ దేశంలోని ప్రధాన అభివృద్ధి కలిగిన పట్టణం. దుబాయ్ భారతీయులకు అందునా ఆంధ్రులకు చిరపరచితమైన పట్టణం. ఇక్కడ అత్యదికంగా వలస ఆంధ్రులు కలరు. దుబాయ్ గురించిన ఏదో ఒక వార్త తెలుగు పత్రికలలో, చానెళ్లలో ప్రతిరోజూ కనిపిస్తుంటుంది.

చరిత్ర

[మార్చు]

డిసెంబరు 2 1971 న అబుధాబి, మిగిలిన ఐదు ఎమిరేట్స్ దుబాయితో కలసి యునైటెడ్ ఎమిరేట్స్ అనే సమూహ దేశంగా ఏర్పడ్డాయి.

భౌగోళికం

[మార్చు]
నం. Month అల్పం అధికం అత్యధికం అత్యల్పం సగటున వర్షం నమోదయ్యే రోజులు
1 జనవరి 14 22 32 8 3
2 ఫిబ్రవరి 15 23 31 7 1
3 మార్చి 17 27 38 11 1
4 ఏప్రిల్ 20 31 41 9 1
5 మే 24 36 45 18 0
6 జూన్ 27 38 45 22 0
7 జులై 29 39 47 25 0
8 ఆగస్టు 30 39 47.3 25 0
9 సెప్టెంబరు 27 38 44 22 0
10 అక్టోబరు 23 34 40 16 0
11 నవంబరు 19 30 41 13 1
12 డిసెంబరు 16 25 31 6 3
పట్టిక 1[9]: నెలవారిగా నమోదయిన ఉష్ణోగ్రతలు (అన్ని విలువలు °Cలో తెలుపబడ్డాయి).

దుబాయ్ పర్సియన్ గల్ఫ్ సముద్రతీరం వెంబడి ఉంది. ఈ పట్టణం సముద్రమునకు దాదాపు సమానమైన ఎత్తుకలిగి ఉంది. దుబాయ్ సరిహద్దులు దక్షణాన అబుదాభి, ఉత్తర తూర్పుగా షార్జా, దక్షణౌత్తరంగా ఒమన్, పశ్చిమాన అజమాన్, తూర్పుగా రస్ అల్ ఖైమా, దుబాయ్ పట్టణాన్ని కొంత చుట్టినట్టుగా హత్తా పర్వతశ్రేణి.

జనగణన

[మార్చు]
దుబాయ్ మిరాకిల్ గార్డెన్

2006 జనాభా లెక్కలననుసరించి దుబాయ్ జనాభా 1,422,000. పురుషులు, 1,070,000. స్త్రీలు 349,000. దుబాయ్ అధిక జనాభా ఆసియా వారు ( దాదాపు 85%. ఇందులో భారతీయులు 51%, పాకిస్తానీయులు 16%, బంగాలీలు 9%, పిలిప్పీనీయులు 3% ). మొత్తం ఎమిరేట్స్ జనాభాలో 71% ఆసియా వారే ఉన్నారు).

దుబాయ్ పట్టణంలో ప్రధాన భాష అరబిక్. అరబిక్ కాకుండా పర్షియన్, మళయాళం, ఆంగ్లం, హిందీ, తెలుగు, ఉర్దూ, బెంగాలీ అధికంగా మాట్లాడుతారు.

ఆర్థికం

[మార్చు]

దుబాయ్ ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్. ఇక్కడ ఉన్న జబెల్ అలి పోర్ట్ జబల్ అలి 1970లో నిర్మింపబడింది. ఇది ప్రపంచంలోనే మనుషులతో నిర్మింపబడిన అతిపెద్ద పోర్ట్. దుబాయ్ మీడియా, కంప్యూటర్, సమాచార రంగాలలో కూడా అభివృద్ధి కలిగిన నగరం. టెకమ్ అని పిలువబడే (TECOM Dubai Technology, Electronic Commerce and Media Free Zone Authority) లో భాగంగా ఇక్కడ కల దుబాయ్ ఇంటర్నెట్ సిటీ (దుబాయి ఇంటర్నెట్ సిటీ), దుబాయ్ మీడియా సిటీ (దుబాయ్ మీడియా సిటీ), నాలెడ్జ్ విలేజ్ (నాలెడ్జ్ విలేజ్, దుబాయ్ ఇంటర్ నేషనల్ ఫైనాన్స్ సెంటర్ (దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) మొదలగునవి ఉన్నాయి. ఇంటర్ నెట్ సిటీలో ప్రముఖ సంస్థలైన ఇ యమ్ సి కార్పోరేషన్ (EMC కార్పొరేషన్), ఒరాకిల్ కార్పొరేషన్ (ఒరాకిల్ సంస్థ), మైక్రోసాప్ట్ కార్పొరేషన్ (మైక్రోసాఫ్ట్), ఐ బి యమ్ (ఐబిఎం), వంటివి ఉన్నాయి. మీడియా సిటీలో ప్రముఖ సంస్థలైన ఎమ్ బి ఎమ్ (MBC), సి ఎన్ ఎన్ (సిఎన్ఎన్ (CNN)), రైటర్స్ (Reuters), అసోసియేటెడ్ ప్రెస్

(AP) వంటివి ఉన్నాయి.

రవాణా

[మార్చు]

దుబాయ్ ప్రధాన రవాణాలు విమానం, బస్సు. ఇక్కడ రైలు సౌకర్యం ఇంతవరకూ అంటే 2007 వరకూ లేదు. నిర్మాణములో ఉన్న ట్రాక్ 2008 సంవత్సరంలో మొదలవుతుంది.

దుబాయ్ నగరానికి ప్రధాన రహదారి షేఖ్ జాయద్ రోడ్. ఇది మొత్తం ఆరు+ఆరు పన్నెండు లైనుల రోడ్. ఈ రహదారిపై వాహనాలకు సిటీలోపల 120, సిటీ బయట 140 కిలోమీటర్ల వేగం వరకూ పరిమితి ఉంది. ఈ రహదారికి కంప్యూటరు అనుసంధానం కలిగిన టాల్ గేట్స్ (వీటిని సాలిక్ (Salik road toll అని పిలుస్తారు) రెండు చోట్ల ఉన్నాయి. డబ్బు చెల్లించే పద్ధతిలో కాక వాహనం ముందు భాగాన ఒక ట్యాగ్ అతికించి ఉంచుతారు, వారికి ఒక అకౌంటు ఉంటుంది, అందులోనుండి వాహనం టోల్ గేట్ నుండి ప్రయాణించినపుడు డబ్బు మినహాయింపబడుతుంటుంది . ఎంత వేగంలో వెళ్ళే వాహనాన్నయినా టోల్ గేట్ దగ్గర కల స్కానర్ కెమెరాలు ట్యాగులను స్కాన్ చేస్తాయి.

దేవాలయాలు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]
సరళీకరించబడిన వంశవృక్షంలో అధికార క్రమము చూడవచ్చు.
ఈ టైమ్-లాప్స్ వీడియో 2000 నుండి 2011 వరకు సంవత్సరానికి ఒక ఫ్రేమ్‌లో దుబాయ్ వృద్ధి రేటును చూపుతుంది. వీడియోను రూపొందించిన తప్పుడు-రంగు ఉపగ్రహ చిత్రాలలో, బేర్ ఎడారి లేత గోధుమరంగు, మొక్కలతో కప్పబడిన భూమి ఎరుపు, నీరు నలుపు, పట్టణం ప్రాంతాలు వెండి.

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "إمارة دبي | البوابة الرسمية لحكومة الإمارات العربية المتحدة". u.ae.
  2. 2.0 2.1 "ستبقى دبي داراً للحي". www.albayan.ae.
  3. "Dubai trying to live up to its nickname "City of Gold"". 5 January 2013.
  4. "Population Bulletin" (PDF). Dubai Statistics Center, Government of Dubai. 2015. Archived (PDF) from the original on 7 April 2019. Retrieved 5 November 2018.
  5. "Dubai 2040 Urban Master Plan | The Official Portal of the UAE Government". u.ae (in ఇంగ్లీష్). Retrieved 2025-05-24.
  6. 6.0 6.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Demographia అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. 7.0 7.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; DSC అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. "TelluBase—UAE Fact Sheet (Tellusant Public Service Series)" (PDF). Tellusant. Archived (PDF) from the original on 12 January 2024. Retrieved 2024-01-11.
  9. OnlineWeather Portal Archived 2008-01-03 at the Wayback Machine. UAEInteract.com. Retrieved 5/1/2007

బయటి లింకులు

[మార్చు]
Dubai గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

"https://te.wikipedia.org/w/index.php?title=దుబాయ్&oldid=4586884" నుండి వెలికితీశారు