Jump to content

ధనుర్వాతము

వికీపీడియా నుండి
(ధనుర్వాతం నుండి దారిమార్పు చెందింది)
ధనుర్వాతము
వర్గీకరణ & బయటి వనరులు
సర్ చార్లెస్ బెల్ 1809లో చిత్రీకరించిన ధనుర్వాతం రోగి కండరాల సంకోచాలు.
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 2829
m:en:MedlinePlus 000615
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 

ధనుర్వాతము (ఆంగ్లం: tetanus) ప్రాణాంతకమైన వ్యాధులలో ఒకటి. ఈ వ్యాధి 'క్లాస్ట్రీడియం టెటని' (Claustridium tetani) అనే బాక్టీరియా వలన కలుగుతుంది. దవడలు బిగిసే ప్రధాన లక్షణం గల వ్యాధి కనుక దీనిని 'లాక్-జా' (lockjaw) అని వ్యవహరిస్తారు. తీవ్రస్థాయిలో వ్యాధిగ్రస్తులు ధనుస్సు లేదా విల్లు లాగా వంగిపోతారు. అందువల్లనే ఈ వ్యాధికి ధనుర్వాతము అనే పేరు వచ్చింది.

వ్యాధికారక సూక్ష్మక్రిములు గడ్డిమేసే జంతువుల పేడ ద్వారా వెలువడి, వీటి స్పోర్లు మట్టిలోను, దుమ్ములోను చాలా కాలం బ్రతికి ఉంటాయి. చర్మం పగుళ్ళు, గాయాలు, జంతువుల కాట్లద్వారా మన శరీరంలో ప్రవేశిస్తాయి. బొడ్డును కోసే పరికరాలు, కట్టే దారం అపరిశుభ్రమైనవైతే, కోసిన బొడ్డుకు బూడిద, పేడ పూయడం ద్వార పురిటి బిడ్డలలో దనుర్వాతం కలుగుతుంది.

సూక్ష్మక్రిములు శరీరంలో ప్రవేశించిన చోటనే, ఆమ్లజని రహిత పరిస్థితులలో వృద్ధిచెంది ఎక్సోటాక్సిన్ (Exotoxin) ను ఉత్పత్తి చేసి అవి రక్తంద్వారా నాడీ మండలాన్ని చేరి వ్యాధి లక్షణాలను కలుగజేస్తాయి. మొదటి సాదారణ లక్షణాలు దవడలు బిగిసి, నోరు సరిగా తెరవ లేకపోవడం, మెడ బిగియడం, శరీరం వంకరలు పోవడం. చంటిపిల్లలు పాలు త్రాగరు. కొద్దిపాటి వెలుతురు, శబ్దం లేక రోగిని ముట్టుకున్నా శరీరం వంకరలు తిరిగిపోరుంది. ఛాతీ కండరాలు దెబ్బతిని మరణం సంభవించవచ్చును. ఈ వ్యాధి అంతర్గతకాలం (Incubation period) సాధారణంగా 3 నుండి 21 రోజులు.

చికిత్స

[మార్చు]
  • గాయాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ తో శుభ్రపరచాలి.
  • రోగిని వెలుతురు, శబ్దం లేని గదిలో ఉంచాలి. అనవసంగా ముట్టుకోవద్దు.
  • వైద్యసలహాతో Anti-Tetanus Serum (ATS) వాడాలి.
  • గొట్టం ద్వారా ఆహారం, శ్వాస అవసరం.

ముందు జాగ్రత్త చర్యలు

[మార్చు]
  • గర్భవతులకు టి.టి. పిల్లలకు డి.పి.టి, డి.టి., టి.టి. టీకాలు షెడ్యూలు ప్రకారం ఇప్పించాలి.