Jump to content

స్మోక్ డిటెక్టర్

వికీపీడియా నుండి
(ధూమ శోధని నుండి దారిమార్పు చెందింది)
స్మోక్ డిటెక్టర్

స్మోక్ డిటెక్టర్ లేదా స్మోక్ సెన్సార్ అనగా అగ్ని సూచిక అయుండగల పొగను గుర్తించగల ఎలక్ట్రానిక్ సర్క్యూట్ పరికరం.తెలుగులో ధూమశోధని అనిఅనవచ్చును. ఇక్కడ రెండు ప్రాథమిక పద్ధతులు ఉన్నాయి: సాధారణమైనది, స్టాండ్అలోన్ సెన్సార్లు సాధారణంగా పొగ గుర్తించినప్పుడు శబ్దం చేయడం లేదా కాంతి ఫ్లాష్ చేయడం చేస్తాయి. మరింత అధునాతనమైన సెన్సార్లు సాధారణంగా ఫైర్ అలారం ప్యానెల్, లేదా సిస్టమ్‌కు సిగ్నల్ పంపుతాయి. అత్యధిక స్మోక్ డిటెక్టర్లు ఆప్టికల్ సెన్సార్, లేదా అయనీకరణ అనే భౌతిక ప్రక్రియను గాని ఉపయోగించుకుంటాయి. అనేక సాధారణ పొగ సెన్సార్లకు బ్యాటరీలు ఉపయోగిస్తారు. బ్యాటరీలలో ఛార్జింగ్ అయిపోయినట్లయితే పొగ సెన్సార్లు పనిచేయవు, కావున బ్యాటరీలు మార్చుకోవాలి. బ్యాటరీలు "లో" ఛార్జింగ్ కు గురైనపుడు "కిచకిచ" శబ్దాలతో డిటెక్టర్లు మనకు సూచనలిస్తాయి, అప్పుడు మనం కొత్త బ్యాటరీలు వేసుకోవాలి. వీటిలో నేరుగా విద్యుచ్ఛక్తికి కనెక్ట్ చేయబడే విధానం కూడా ఉంటుంది కాబట్టి విద్యుచ్ఛక్తికి కనెక్ట్ చేసుకోవాలి, అయితే బ్యాటరీలు బ్యాకప్ కోసం ఉపయోగించుకోవాలి.[1]

రూపకల్పన

[మార్చు]
అయనీకరణ స్మోక్ డిటెక్టర్ పనులు ఎలా జరుగుతాయి అనే దానిపై వీడియో సారాంశం
ప్రాథమిక అయనీకరణ స్మోక్ డిటెక్టర్ లోపలవైపు. కుడివైపున నల్లటి, రౌండ్ నిర్మాణం అయనీకరణ గది. ఎగువ ఎడమవైపు తెలుపు రౌండ్ నిర్మాణంతో అలారం ధ్వని ఉత్పత్తి చేసే పియజోఎలెక్ట్రిక్ బజర్ ఉంది.
కవరు తొలగించబడిన ఆప్టికల్ స్మోక్ డిటెక్టర్

స్మోక్ డిటెక్టర్ లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌ను పొగ కమ్ముకోవటం ద్వారా జరిగిన మార్పులను గుర్తించిన దీనిలోని సెన్సార్‌లు సూచనలిస్తాయి.[2]

అగ్ని ప్రమాదాలను నివారించడంలో స్మోక్ డిటెక్టర్లు ఎంతో కీలకమైనవి. జరగబోయే ప్రమాదమును ఇవి గుర్తించి ముందుగానే తెలుపటం ద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించవచ్చు. [3]

మూలాలు

[మార్చు]
  1. "Learn About Smoke Alarms". USFA.FEMA.gov. 2014-06-03. Archived from the original on 2014-08-31. Retrieved 2014-08-22.
  2. "NRC: Fact Sheet on Smoke Detectors". NRC.gov. United States Nuclear Regulation Commission. 4 September 2013. Retrieved 9 June 2014.
  3. US 436961, Francis Robbins Upton 

ఇతర లింకులు

[మార్చు]