నరేష్ అయ్యర్

వికీపీడియా నుండి
(నరేష్ అయ్యర్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నరేష్ అయ్యర్‌
నరేష్ అయ్యర్‌
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంనరేష్ అయ్యర్‌
జననం (1981-01-03) 1981 జనవరి 3 (వయసు 43)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
క్రియాశీల కాలం2005 – ప్రస్తుతం

నరేష్ అయ్యర్‌ (1981, జనవరి 3న జన్మించారు) భారతదేశంలోని ముంబైకి చెందిన నేపథ్య గాయకుడు[1]. నరేష్ అయ్యర్‌ అనేక భారతీయ భాషల్లో సినీ గీతాలు పాడారు, ఆయన ఖాతాలో, జాబితాలో విజయవంతమైన అనేక గీతాలు ఉన్నాయి. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించిన రంగ్‌ దే బసంతి చిత్రంలో ఆయన పాడిన రూబరూ పాట అనేక వారాలపాటు సంగీత జాబితాలలో అగ్రస్థానంలో నిలిచింది, అతనికి 2006 ఏడాదికిగాను, పురుషుల విభాగంలో ఉత్తమ నేపథ్యగాయకుడిగా జాతీయ అవార్డు లభించింది. . ఆర్.డి.బర్మన్ మ్యూజికల్ టాలెంట్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. గాయకుడిగా వృత్తిపరమైన జీవితంలో అరంగేట్రం చేసిన తొలి ఏడాదే జాతీయ అవార్డు, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు గెలుచుకున్న కొద్దిమంది గాయకుల్లో నరేష్‌ ఒకరు.సంగీత రియాలిటీ షో, టాప్ సింగర్‌లో ప్రముఖ న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు.[2]

జీవితచరిత్ర[మార్చు]

నరేష్ అయ్యర్ 1981 జనవరి 3న శంకర్ అయ్యర్, రాధలకు జన్మించి ముంబైలోనిమటుంగాలో పెరిగాడు. అతనికి నిషా అయ్యర్ అనే చెల్లెలు ఉంది,, ముంబైలోని మాతుంగలో పెరిగారు. SIES కళాశాలకు హాజరై, మేనేజ్‌మెంట్‌ విద్యలో, కామర్స్‌ డిగ్రీని పొందారు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ కావాలనేది ఆయన ఉద్దేశం. కానీ, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ క్లాసికల్‌ సంగీతంలో విద్యను అభ్యసించాలని నిర్ణయించారు.

వృత్తి[మార్చు]

చానెల్‌ V యొక్క సూపర్‌ సింగర్‌ టాలెంట్‌ షోలో ఈ ప్రదర్శనలో అతను గెలవకపోయినా అయ్యర్‌లోని నైపుణ్యాన్ని సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ గుర్తించి అతడితో అన్బె అరువైర్ ‌ అనే సినిమాలో "మయిలిరిగె" అనే పాటతో అవకాశం ఇచ్చాడు. అతడు తమిళ్‌, తెలుగు, హిందీల్లో అనేకమంది ఇతర సంగీత దర్శకులకు కూడా పాడారు.అతను ముంబైలో ఉన్న ధ్వని అనే ఫ్యూజన్ బ్యాండ్‌కు గాయకుడు కూడా, [3] నరేష్, అతని బృందం అనేక కార్యక్రమాలు, దాతృత్వ ప్రదర్శనలు ఇచ్చారు.

అవార్డులు[మార్చు]

  • 2005 - హబ్ అవార్డు అన్బే ఆరుయిరే చిత్రంలో "మయిలరాగే" పాట కై ఉత్తమ నేపథ్య గాయకుడు
  • 2006 - నేషనల్ ఫిలిం అవార్డు రంగ్ దే బసంతి నుంచి "రూబరూ" పాట కై ఉత్తమ నేపథ్య గాయకుడు
  • 2006 - ఫిలిం ఫేర్ అవార్డు ఉత్తమ పురుష అరంగేట్రం ( బెస్ట్ మేల్ డెబుట్) (R. D. బర్మన్ అవార్డు)
  • 2006 - కన్నడసన్ అవార్డు ఉత్తమ పురుష అరంగేట్రం
  • 2008 - హబ్ అవార్డు వారణం ఆయిరం నుంచి "ముందినం పర్తేనే" పాటకై ఉత్తమ నేపథ్య గాయకుడు
  • 2009 - ఫిలిం ఫేర్ అవార్డు (సౌత్) వారణం ఆయిరం నుంచి "ముందినం పర్తేనే" పాటకై ఉత్తమ నేపథ్య గాయకుడు
  • 2010 - ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఏంపికయ్యారు (పాట - పసంగా నుంచి ఒరు వేట్కం వరుదే )57వ సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్స్

మూలాలు[మార్చు]

  1. "All you want to know about #NareshIyer". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2022-01-03.
  2. "Naresh Iyer enjoys his time with Top Singer kids - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-01-03.
  3. Nadadhur, Srivathsan (2015-07-28). "Open to work with anyone: Naresh Iyer". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-01-03.