నాగపంచమి (1956 సినిమా)
స్వరూపం
(నాగ పంచమి నుండి దారిమార్పు చెందింది)
నాగపంచమి (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బి.నాగభూషణం |
---|---|
తారాగణం | అంజలీదేవి, ఎస్. వరలక్ష్మి, కన్నాంబ, నాగయ్య |
నిర్మాణ సంస్థ | శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ |
భాష | తెలుగు |
'నాగపంచమి' తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది 1956 మార్చి 9 న విడుదలైనది. శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ పతాకంపై కడారు నాగభూషణం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అంజలీదేవి, కన్నాంబ, ఎస్.వరలక్ష్మి, నాగయ్య ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం ఎస్.వి.వెంకట్రామన్ అందించారు.[1]
తారాగణం
[మార్చు]- అంజలీదేవి
- పసుపులేటి కన్నాంబ
- ఎస్.వరలక్ష్మి
- చిత్తూరు నాగయ్య
- సరస్వతి
- తంగవేలు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కె.బి.నాగభూషణం
- సంగీతం: ఎస్.వి.వెంకట్రామన్
- నిర్మాణ సంస్థ: శ్రీరాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ
- విడుదల:09:03:1956.
- జగదాంబా దేవి భవానీ నన్నేలు వేగ కళ్యాణీ ఇహమైన వేల్పు-
- ఆనందం అందీయ అవనిలో జన్మించి అలరేడు కుమారుడే-
- ఓం నమః శివాయ ఓం నమః శివాయ హారతి యిదే హరవరదా-
- ఓ నాగమ్మా నాపై శోధనయా నాపతి విడిపోరాదే-
- నన్నేలు నాథా ఎందేగినావో దరియే లేదో విధి-
- నాతోడై రాగదే హే జననీ ఈ శోధన దీర్పుము వరదాయి-
- నెరవేరే నాదు కోర్కె చెలువారు వలపే మధురమై-
- మాతా నినువేడు సతినే కానవో నా నాధుని జీవన-
- మదినుల్లాసమౌ మేల్ వయసులిదే ఆనందం ఒదవగా-
- వాసనపట్టి పీల్చే ముక్కే మరచెనా వర్రని వంట రుచి తినగ-
- వినడేల మొర ఆ శూలి కనడేల దీన దశను-
- శంభో మహదేవా సదాశివా గంగాధరా శంకరాదేవా-
మూలాలు
[మార్చు]- ↑ "Naga Panchami (1956)". Indiancine.ma. Retrieved 2025-02-28.
- ↑ ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు