నా స్మృతిపథంలో

వికీపీడియా నుండి
(నా స్మృతిపధంలో నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నా స్మృతి పథంలో ఆచంట జానకిరాం స్వీయచరిత్ర.

ఇది జానకిరాం స్వీయచరిత్ర మాత్రమే కాదు. కళాహ్రుదయం ఉన్న ప్రతిమనిషి కథ అనిచెప్పవచ్చు సాగుతున్న జీవితయాత్రలో ఏదో సన్నివేశంలో మనలని మనం చూచుకొ గలుగుతాం. జానకిరాం ఆయన తిరిగిన ప్రదేశాల గురించి కాని అయనకు పరిచయమైన వ్యక్తులు గురించి కాని ఎంత విపులంగా రాశాడు. మనం ఆప్రదేశాలలో, ఆవ్యక్తులతో కలసి లీనమైన అనుభూతి కలుగుతుంది ఆయన జీవిత గమనంలో ఎన్నో మజిలిలు ఏక్కడొ ఒక చోట గాని ఏదో ఒక మజిలీలో గాని మనం కూడా కలుస్తాం మరో రకంగా ఈ పుస్తకం ఒక గైడ్ లాంటిది అని చెప్పవచ్చు ఎతొమంది పండీతులు, కవులు, కళాకారులు, గాయకులు ఆయన జీవితం గమనంలో కలసి ప్రయాణిస్తారు వారి అనుభవాలు అన్ని మనకు అనుభూతులుగా మిగిలి పొతాయి


ఈపుస్తకం చదివిన చలం రాసిన కొన్ని మాటలు

మీ అనుభవాన్ని ఎంతోభద్రంగా ఇన్నేళ్ళు ఆప్టర్ ఈవెంట్స్ వల్ల ఇన్ ప్లూయెన్సూ కాకుండా ఇసొలేట్ చేసి స్టెరిలైజ్ చేసి, దాచిఉంచి ,ఈనాడు ప్రొడ్యూస్ చేయటం ఇన్నేళ్ళ తరువాత , ఇప్పటి జానకీరాం కాక, ఆనాటి జానకిరాం, ఆనాడే వీటిని రాసి పెట్టుకున్నాడా అనిపించింది . ఆ ఒక్క గుణం చాలు, అట్లాంటి రాతల్ని ప్యూర్ అర్ట్ గా మార్చటానికి


1957లో 'నార్లవెంకటేశ్వ్రరావు 'గారు అంధ్రప్రభలో ఎడిటర్‌గా పనిచేస్తూ తన మిత్రుడు అయిన జానకిరాం గారి 'జ్ఞాపకాలు 'అన్నవ్యాసానికి 'నాస్మృతిపధంలో 'అన్న పేరుతో వారంవారం వ్రాయించింది నార్ల వారెనని చెప్పుకున్నాడు


ఆచంట వారి జీవితాంగణంలో జాలువారిన స్మృ తులలో కొన్నిటిని చూద్దాం


ఇవిగొ ఇంకా నిద్రలేవని, మంచుతడీఅరని పారిజాతాలు ఈ ధవళిమ నాభావాల స్యచ్చత, ఈ ఎరుపు నా అనురాగపు రక్తిమ ఈ పరిమళము మన స్నేహసౌరభము అందుకొవూనూ వెక్కడున్న నీవద్దకే వస్తాను నేను . భిక్షా పాత్రతొ గాని నవరత్నాలు కూర్చిన కంఠ మాలతొ గానీ'


ఇంద్రియాలవల్లకలిగే ఆనందం క్షణికం హ్రుదయానందం చివరకి దుఖ్ఖాన్నె కలిగిస్తుంది మనస్సు పొందే ఆనందం ఒక్కటే కడసారి కనుమూసేవరకూ వుంటుంది


'జాన్ బొయర్' రచియించిన 'గ్రేట్ హంగర్' నవలకు సంక్షిప్తం కథానాయకుడు మేధావంతుడు, ఆదర్సజీవి జనొపయెగం కోసం అహొరాత్రాలు శ్రమించి ఒక ఆనకట్ట నిర్మిస్తాడు ఆ ఆనకట్ట వల్ల ఎంతో మేలు జరుగు తుందని ఆశిస్తారు కొ న్నికారణాల వల్ల కొందరి కుతంత్రం వల్ల ఆ అనకట్ట బద్దలౌ తుంది బ్రహ్మరధం పట్టవలసిన అతనిని లొకం దూషిస్తుంది, హే లనచేస్తుంది యింతటి ఆశా భంగాన్ని అతడు ఒక్కడు అయితే ఒర్చుకొలేక పొయావాడేమొ ఒక్క మాటా మట్లాడకుండా ఆమే అతనికి కొండంత దైర్యన్ని యిస్తుంది ఉత్తమపత్నిగా తరువాత కొంతకాలానికి దేశంలో కరువువస్తుంది. అందరూ విత్తనాలను బద్రపరచుకుంటారు యితను కూడా తన ఒక్క ఎకరములొకి సరిపొయిన విత్తనములను దాసుకుంటాడు ఆరోజు తన ఎకరం నేలను చక్కగా దున్నుకొని విత్తనములు చల్లుటకు అనువుగా తయారు చేసికొంటాడు అరోజు రాత్రి ఆకాశం నిండా మబ్బులు కమ్ముకుటాయి ఇదె అదను, ఈసారి విత్తనాలు సరిగ్గా నాటుకుంటె మన భూమి బంగారం పండుతుంది అనుకుంటారు భర్యా భర్తలు యింతలో పక్కయింటిలోనుండి మాటలు వినబడతాయి పక్కింటీ అతను తన భార్యతో అంటాడు మంచి అదను కాని మనవద్ద విత్తనాలు లేవు ఈ సవంస్సరం మనం పస్తులు డాలి అని భాధతొ అంటాడు దానికి ఆమే పక్కింటి ఆయనను అడగరాదా అని అంటే దానికతను మండిపడతాడు ' వాడిని ప్రాణం పొయినా అడగను ' అంటూ ఎవేవొ మాటలు అంటాడు ఇవి వింటూ భాధపడతారు యిద్దరు ఆరాత్రి అతనికి నిద్ర పట్టదు 'ఈఏడాదిమనం పస్తులుండాల్చిదే' అన్న ఆ రైతు మాటలే అతనిని భాధిస్తాయి పక్కిటి రైతు అనకట్ట విషయములో అపకారం చేశడని తెలుసు అయినా అతని వేదన కలచివేస్తుంది భర్త అనుభవిస్తున్న బాధ ఆమెకు తెలుసు కాని ఏమీమాట్లాడదు ఒక రాత్రి వేళ అతను తన ఎకరం నేలకోసం దాసుకున్న విత్తనాలను తిసికొనివెల్లి పక్క రైతు పొలములో చల్లి వస్తాడు నక్షత్రపు కాంతిలో లోనికి వచ్చి భార్య పక్కనే పడుకుంటాడు ఆమె అతని చేతిని తన గుండెలపైకి తిసుకుంటుంది ఆమెకు తెలుసు అతను ఎక్కడికి వెల్లాడొ మెల్లగా అతని చేతిని తన చేతితొ రాస్తూ అంటుంది చీకట్లొ ఒక్కరె వెళ్ళారా నన్నుకుడా తిసికు వెల్లపొయారా మీమాట నేను ఎన్నడైనా కాదంటానా అంటుంది అతడు వంగి ఆమె నుదుటిపై పెదవుల నుంచుతాడు హ్రుదయపు లోతుల్ని కదలిస్తూ ఈనవల ముగుస్తుంది 2

'వద్దనినేనంటీనిగా' మరొచిన్న కథ భర్తృవియెగం లోనున్న ఒకామె తన ఇదేండ్లకూతురితొ కాలం గడుపుతూ ఉంటుంది ఆపాప ప్రేమతొ తన తండ్రికి ఉత్తరాలు వ్రాసినాన్నకుపంపుతాను అంటూ సమీపంలో నున్న పెద్దసరస్సు వద్దకు వెలతానంటుంది రొజూ వద్దని అంటుంది ఆతల్లి ఒకా నొక రోజు తల్లి ఎదొ పనిమీద నుండగా ఆపాప కొలను వద్దకు వెల్లి ఉత్తరాలతొ పాటు తనూ నీటిలోపడిపొతుంది ' వద్దనినెనంటినిగా ' అంటూ నేలపై వాలిపొతుంది ఆమెకూడా ఆతల్లి గుండెలోనుండి వచ్చిన అకేక ఇప్పటికి సాయంసమయాలలో అలోయలో నడిచే పధికులు వినవచ్చు అంటూ ముగుస్తుంది


అందమైన ప్రతివస్తువూ నిన్నేజ్ఞాపకంజేస్తుంది సున్నితమైనప్రతిభావమూ నిన్నేజ్ఞాపకంజేస్తుంది ప్రాణమిచ్చేప్రతి ఊహలోనూ నీవేస్పురిస్తావు


ఒకానొకసుందరదృశ్యం, ఒకానొకదివ్యమంగళవిగ్రహము, ఒకానొక పిచ్చికల- తరువాతేన్నిసుందరదృశ్యాలుచూచినా, ఎన్నిదివ్యవిగ్రహాలు కనపడ్డా, ఎన్నివింత కలలు కన్నా, ఆమొదటిదృశ్యమే, ఆ మొదటి విగ్రహమే, ఆమొదటి పిచ్చికలే, మరల మరల మనసులో అవతరిస్తూ ఉంటుంది


సముద్రంలో కొట్టుకువస్తున్నరెండుకట్టెలు తడిసి ఒకదానితొనొకటి అంటుకుపొయి జంటగావెల్లుతుంటాయి అలల తాకిడికొ, గాలివిసురుకొ విడివడిపొయి ఓదానికొకటి దూరమై యిక మల్లికలుసుకొవు ఈ లొకంలో మన సం యెగ వియెగాలు ఇలానె ఉంటాయి


'అసంపూర్ణచిత్రపటము '


ఇటాలియన్ చిత్రకారుడు బాలుడైన జీసెస్ బొమ్మను చిత్రించాలని కొరికతొ ఒక బాలుని వెదికి అతని రూపం చిత్రిస్తాడు లొకం అంతా మెచ్చుకుంటుంది 'జీసెస్ అంతకరణను ఈచిత్రపటము చూపినట్లు ఇంతవరకు ఏచిత్రపటము చూపలేదు ' అంటారు విమర్శకులు కొన్ని ఏళ్ళకు జిసెస్ ను పట్టియిచ్చిన జూడాస్ బొమ్మ వెయ్యాలని సంకల్పిస్తాడు ఆచిత్రకారుడు మరునాటి ఉదయమే ఉరియ్యబడుతున్న ఒక ఖైదీని ఎన్నుకొని అతని బొమ్మ గీయ్యటానికి ఉపకృమిస్తాడు తెల్లవారితె ఈ ఖైదీకి మరణదండన కనుక రాత్రి అంతా చిత్రింస్తూనె ఉంటాడు దాదాపు చిత్రం పూర్తికావొస్తుంది అప్పుడు ఆ ఖైదీ అడుగుతాడు కొడికూస్తే ఇంక మీకు కనపడను .ఇప్పుడే ఆఖరిసారి నిదానించి చూడండి అని నవ్వుతాడు చిత్రకారుడు అతని ముఖంలొకి చూసి నిర్ఘాంత పొతాడు ఆనాడు బాలుడైన జిసెస్ గా తన ఎదుట నిలిచిన వ్య క్తే ఈనాడు జూడాస్ ' నీచేతులలోనే ఇంతగా మారిపొయిన స్వరూపానికి

మానవమాతృణ్ణి నేనురూపకల్పన చేయడము సాహసము 

అంటూ ఆబొమ్మని చించివేస్తాడు


'ది ప్రూట్ కారీస్ వితిన్ ఇట్ ది సాక్రిఫైస్ ఆఫ్ ది ఫ్లవర్ ' 'పుష్పంచేసిన త్యాగసంపదే ఫలమునందు ఇమిడి యున్నది ' రవీంద్రనాద్ ఠాగూర్


జానకీరాం గారి స్మృ తిపధం లోనుండి మరొ కథ ఇది 'ఔరంగజేబు చెల్లెలు అయిన రొషనారా'కిసంబంధించినది -4----------------------------------------------------------------- రొషనారా మంచి కవయిత్రి సామాన్య్డుడు అయిన ఒక కవిని ప్రెమిస్తుంది అది ఆమె తండ్రి షాజహాన్ కి నచ్చదు అయినా వారిద్దరూ కలసుకుంటూనె ఉంటారు . ఒక రోజు వారిరువురు కలసి మాట్లాడుకొనుచుండగా షాజహాన్ వస్తునంట్లు వార్త వస్తుంది ప్రియుడు ఆ సమయములో తండ్రి కంట పడితే మరణదండనే అని భయపడి చెంతనేఉన్న నీటి కాగులో దా స్తుంది . షాజహాన్ కూతురితో కవితా గోష్ఠి జరుపుతాడు . ఆమె రాసిన గీతాలు వింటూ మధ్యలో ఆమె అలసి పొయింది అంటూ ఆనీల్లకాగుక్రింద వేడినీటికోసం మంట పెట్టిస్తాడు .నీళ్ళుమసలిపోయేవరకు అక్కడే ఉంటాడు పాదుషా వజ్రహౄదయంతో .


లోకంలో కొటిమందిలో ఒకరుంటారేమొ అలాంటి ప్రియులు . మారుమాట్లాడకుండా ప్రియురాలి మర్యాద కాపాడుతూ మరణించటానికి అలానే ప్రియుడు అలా నశించి పోతుండగా తండ్రితో కవితా గోష్ఠి జరపటానికి ఆమెకెంత గుండెదిటవు కావాలి ఆలోచించలేని పరిస్థితిలో పాఠ కుడు మిగిలి పోతాడు

మాతృహృదయం


కొడుకు పూర్తిగా ప్రియురాలికివశమైపొతాడు ఆమె ఏది కోరినా తల్లివద్ద తీసుకొని వెళ్ళి అర్పిస్తూ ఉంటాడు ఏవస్తువు అయినా కాదనకుండా యిస్తుంది తల్లి ఒకరోజు

నివు నిజంగా నన్ను ప్రెమిస్తె  నీ తల్లి గుండెకాయ తెచ్చి ఇవ్వు - అంటుంది 

ఈ విషయము తల్లిని అడగటానికి సందేహిస్తుంటె ఆ తల్లి తెలుసుకుని 'నన్నుచంపి నా గుండెకాయ తీసుకువెల్లు, మీరిద్దరు సుఖంగా ఉండండి ' అంటుంది

ఆ మాతృహృదయాన్ని మూటకట్టుకొని తొందరగా ప్రియురాలి వద్దకు వెలుతుండగా 

అతని తల ద్వారానికి తగులుతుంది అతను భాధతొ 'అమ్మా ' అని అనగా మూటలోని ఆ తల్లి హ్రుదయం ' దెబ్బతగిలిందా నాయనా ' అంటు వొదారుస్తుంది --------------------------------------------------------------------------------

------------------------------------------------------------- 

జానకీరాం గారి 'నాస్మృతిపధంలో' అంగ్లరచియితలు, వారిరచనలు, అలాగే మన రచయితలు, వారి రచనలుగురించి క్లుప్తంగా విశధీకరిస్తారు

-