నీటి మొక్కలు
స్వరూపం
(నీటిలో పెరిగే మొక్క నుండి దారిమార్పు చెందింది)
నీటి మొక్కలు (Hydrophytes) పూర్తిగా నీటిలోగాని, తడినేలలోగాని పెరిగే మొక్కలు.
నీటి మొక్కల రకాలు
[మార్చు]- నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు : ఈ మొక్కలు మృత్తికతో సంబంధం లేకుండా, నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. ఉదా: పిస్టియా, ఐకార్నియా, ఉల్ఫియా, సాల్వీనియా, లెమ్నా,అంతర తామర.
- లగ్నీకరణ చెంది, నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు : ఈ రకం మొక్కలు వేరువ్యవస్థ సహాయంతో మృత్తికలో స్థాపితమై, పొడవైన పత్రవృంతాలు ఉండటం వల్ల పత్రదళాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. ఉదా: నిలంబో, నింఫియా, విక్టోరియా రీజియా.
- పూర్తిగా నీటిలో మునిగి, అవలంబితంగా ఉండే మొక్కలు : ఈ మొక్కలు నీటితో మాత్రమే సంబంధం కలిగి, పూర్తిగా నీటిలో మునిగి, మృత్తికలో నాటుకొని ఉండకుండా, అవలంబితంగా ఉంటాయి. ఉదా: సెరటోఫిల్లమ్, యుట్రిక్యులేరియా, హైడ్రిల్లా.
- పూర్తిగా నీటిలో మునిగి, లగ్నీకరణ చెందిన మొక్కలు : ఈ మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి ఉండి, వేరు వ్యవస్థ సహాయంతో నీటి అడుగున మృత్తికలో నాటుకొని ఉంటాయి. ఉదా: పొటమోజిటాన్, వాలిస్ నేరియా
- ఉభయచర మొక్కలు : ఈ రకం మొక్కలు పాక్షికంగా నీటిలోను, పాక్షికంగా వాయుగతంగాను పెరుగుతాయి. ఉదా: రాన్ కులస్, సాజిట్టేరియా, లిమ్నోఫిలా.
చిత్రమాలిక
[మార్చు]-
బుడగ తామర
బయటి లింకులు
[మార్చు]Look up నీటి మొక్కలు in Wiktionary, the free dictionary.