జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష

వికీపీడియా నుండి
(నీట్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్గ్రాడ్యుయేట్) (లేదా నీట్ (యుజి) ) భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ఎంబిబిఎస్), దంత విద్యా కోర్సులు (BDS) చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్ష. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది. దీన్ని గతంలో ఆల్ ఇండియా ప్రీ-మెడికల్ టెస్ట్ (ఎఐపిఎంటి) అనేవారు. వివిధ రాష్ట్రాలు, కళాశాలలూ గతంలో స్వంతంగా నిర్వహించుకుంటూ ఉన్న ప్రవేశ పరీక్షలన్నిటినీ రద్దుచేసి, వాటి స్థానంలో నీట్-యుజిని నిర్వహిస్తున్నారు.

ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల కోసం నీట్ (యుజి) ని ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నిర్వహిస్తోంది. ఇది, పరీక్షా ఫలితాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్‌కు అందిస్తుంది.[1] 2019 కి ముందు, అమెరికాలో ప్రధాన కార్యాలయం ఉన్న ప్రోమెట్రిక్ టెస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) ఈ పరీక్షను నిర్వహించేది. [2]

2019 సెప్టెంబరులో ఎన్‌ఎంసి చట్టం 2019 ను అమలు చేసిన తరువాత, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), జవహర్‌లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (జిప్మెర్) తో సహా భారతదేశంలోని మెడికల్ కాలేజీలన్నిటిలో ప్రవేశానికి నీట్-యుజి సాధారణ ఆల్ ఇండియా ప్రవేశ పరీక్షగా మారింది. అప్పటి వరకు ఎవరికి వారే ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించేవారు. [3]

భారతదేశం అంతటా 66,000 ఎంబిబిఎస్, బిడిఎస్ సీట్లలో ప్రవేశానికి జరిపే ఒకే ప్రవేశ పరీక్ష, నీట్-యుజి. [4] ఈ పరీక్షను వివిధ భాషల్లో రాయవచ్చు. 2018 లో 80% మంది అభ్యర్థులు ఇంగ్లీషులో రాయగా, హిందీలో 11%, గుజరాతీలో 4.31%, బెంగాలీలో 3%, తమిళంలో 1.86% మందీ నీట్‌ పరీక్ష రాశారు. [5] [6]

పరీక్షా విధానం, నిర్మాణం[మార్చు]

పరీక్షలో మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఒక్కొక్కదాని నుండి 45 ప్రశ్నలు, బయాలజీ నుండి 90 ప్రశ్నలూ ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు వస్తాయి. ప్రతి తప్పుకూ ఒక మార్కు కోసేస్తుంది అంటే మైనస్ 1 మార్కు అన్నమాట. పరీక్ష వ్యవధి 3 గంటలు, గరిష్ఠ మార్కులు 720.

సంవత్సరం వారీగా దరఖాస్తుదారుల సంఖ్య[మార్చు]

సంవత్సరం దశ దరఖాస్తుదారుల సంఖ్య
2019 ఏడాదికి

ఒకసారి

జరిగింది

1,410,755 [7] Increase
2018 1,326,725 [8] Increase
2017 1,138,890 [8] Increase
2016 2 802.594 Increase
1
2015 ఏడాదికి

ఒకసారి

374,386 [9] Steady
2014
2013

కటాఫ్ మార్కులు[మార్చు]

వర్గం కనీస అర్హత శాతం
2019 నాటికి
రిజర్వ్ చేయని (యుఆర్) 50 వ పర్సెంటైల్
రిజర్వ్ చేయని PH (UR-PH) 45 వ పర్సెంటైల్
షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) 40 వ పర్సెంటైల్
షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) 40 వ పర్సెంటైల్
ఇతర వెనుకబడిన తరగతులు (OBC) 40 వ పర్సెంటైల్
SC-PH 40 వ పర్సెంటైల్
ST-PH 40 వ పర్సెంటైల్
ఒబిసి-PH 40 వ పర్సెంటైల్

కాలేజీలు[మార్చు]

నీట్ కింద ఇచ్చే మొత్తం సీట్ల సంఖ్య 66,000. నీట్ ర్యాంకు ఆధారంగా విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలో సీటు పొందే అవకాశం ఉంటుంది. [10] వివిధ రంగంలోని కాలేజీల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య కింది విధంగా ఉంది.

కళాశాలలు ఉన్న సీట్ల సంఖ్య
అన్ని ప్రైవేట్ కళాశాలలు 25.840
అన్ని ప్రభుత్వ కళాశాలలు 27.590
నీట్ కౌన్సెలింగ్ సీట్లు 3,521
నీట్ బేసిస్ సీట్లు 35.461

మూలాలు[మార్చు]

  1. "NEET-FAQ". Archived from the original on 2020-10-26. Retrieved 2020-08-15.
  2. "Archived copy". Archived from the original on 2017-09-10. Retrieved 2020-08-15.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. Sharma, Neetu Chandra (2019-10-04). "Common NEET under graduate exam from 2020-21 as per NMC Act: Centre" (in ఇంగ్లీష్).
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; bdsneedt అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; neeteng అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. Pathak, Vikas (4 June 2018). "Rajasthan, A.P., Kerala record top performances in NEET". The Hindu.
  7. "NEET 2019: 14 lakh candidates in 154 cities tested in 11 languages; nearly 8 lakh candidates qualified" (in Indian English). 2019-06-06.
  8. 8.0 8.1 "NEET 2018 analysis: Pass percentile, toppers and comparison with last year's exam". India Today (in ఇంగ్లీష్). Ist. Retrieved 2019-07-23.
  9. "CBSE AIPMT 2015: Result statistics". India Today (in ఇంగ్లీష్). Ist. Retrieved 2019-08-05.
  10. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; bdsneedt2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు