పంజాబీ సంస్కృతి
పంజాబీ సంస్కృతిలో పంజాబీ ఆహారసంస్కృతి, సైన్సు, సాంకేతికత, సైన్యం, సైనికశిక్షణ, సంప్రదాయం, విలువలు, పంజాబీ ప్రజల చరిత్ర భాగంగా ఉంటుంది.
మద్య యుగం
[మార్చు]ఆధునిక శకం
[మార్చు]ఆధునిక కాలంలో పంజాబీప్రజలు ప్రపంచం అంతటా విస్తరించి ఉన్న కారణంగా (ప్రత్యేకంగా భారతదేశం, పాకిస్తాన్) పంజాబీ సంస్కృతి అనేక మందికి పరిచయమై ప్రభావం చూపుతుంది. సంప్రదాయమైన పంజాబీ సంస్కృతి శక్తివంతమై పశ్చిమదేశాల వరకు విస్తరించింది. పంజాబీ సంస్కృతి యునైటెడ్ స్టేట్స్, యు.కే, యురేపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా వరకు విస్తరించింది. పంజాబీ తాత్వికత, కవిత్వం, ఆధ్యాత్మికత, విద్య, కళలు, సంగీతం, ఆహారసంస్కృతి, నిర్మాణకళ మొదలైనవి వెలుపలి ప్రపంచంలో మరింత ప్రభావం చూపుతుంది. పలు భాషలకు, సంస్కృతులకు, అలవాట్లకు, జాతులకు చెందిన ప్రజలు పలు కారణాల వలన పంజాబు చేరుకున్నారు. ఈ ప్రజలు పంజాబీ సంస్కృతి ప్రభావితులైయ్యారు.
పంజాబీ సంగీతం
[మార్చు]భంగారా పలు పంజాబీ సంగీతరూపాలలో ఒకటి. దీనిని పాశ్చాత్యదేశాలలో అభిమానించేవారి సంఖ్య అధికరిస్తూ ఇది అభిమాన పంజాబీ సంగీతంగా మారింది.[ఆధారం చూపాలి] పంజాబీ సంగీతాన్ని ఇతర సంగీతరూపాలతో మిశ్రితం చేసి పశ్చిమదేశాలలో ప్రాబల్యత సంతరించి అవార్డ్ - విన్నింగ్ సంగీతంగా చేయబడింది.[ఆధారం చూపాలి] అదనంగా పంజాబీ సంప్రదాయసంగీతానికి పశ్చిమదేశాలలో ఆదరణ అధికరిస్తూ ఉంది. [ఆధారం చూపాలి]
పంజాబీ నృత్యాలు
[మార్చు]దీర్ఘకాలచరిత్ర కలిగిన పంజాబీ సంస్కృతి, పంజాబీ ప్రజలలో పలు నృత్యరీతులు రూపొందించబడ్డాయి. ఇవి సాధారణంగా పండుగలు, వివాహాది వేడుకలు, పంటలు చేతికి అందిన వేళలలో ప్రదర్శించబడుతుంటాయి. నృత్యాలకు మసంబంధిత, మతేతర నేపథ్యం ఉంటాయి. ఉత్సాహవంతమైన పురుషుల నృత్యం భంగారా నృత్యం అలాగే ఝుమర్, గిధా నృత్యాలు స్త్రీలకు ప్రత్యేకించబడ్డాయి.
పంజాబీ వివాహం
[మార్చు]పంజాబీలు జరుపుకునే వివాహ సంప్రదాయాలు, వేడుకలలో పంజాబీ సంస్కృతి బలంగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. ముస్లిములు, హిందువులు, సిక్కులు, జైనులు తమవివాహాది వేడుకలను అరబిక్, పంజాబీ, సంస్కృత్, ఖాజీ, పండిట్, గ్రాంథి, లేక పూజారి చేత నిర్వహించబడుతుంది. ఆచారాలు, పాటలు, నృత్యం, ఆహారం, దుస్తులలో కొంత సారూప్యత ఉంటుంది. పంజాబీ వివాహాలలో పలు ఆచారాలు చోటుచేసుకుంటాయి. వేడుకలు వివాహాలు పురాతన సంప్రదాయకాలం నాటివి ఇప్పటికీ ఆచరించబడుతున్నాయి.
పంజాబీ ఆహారం
[మార్చు]పంజాబీ ఆహారసంస్కృతిలో విస్తారమైన ఆహారాలు ఉన్నాయి. ఆహారరంగంలో ఇది ప్రపంచస్థాయిలో ఆధీనత సాధించింది. పంజాబీ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ కారణంగా పలువురు వ్యాపార వేత్తలు ప్రపంచవ్యాప్తంగా పంజాబీ ఆహారరంగంలో పెట్టుబడులు పెట్టారు. [ఆధారం చూపాలి]ఉదాహరణగా సర్సో కా సాగ్, మక్కీ దీ రోటీ వంటి ఆహారాలు మరింత ప్రాబల్యత సంతరించుకున్నాయి. చోళే బటూరా కూడా పంజాబీ ఆహారాలలో మరింత ఆదరణ అందుకున్నది. అత్యంత ఆదరణ పొందిన పంజాబీ ఆహారాలలో నాన్, బటర్ చికెన్, మటర్ పనీర్, తందూరి చికెన్, సమోసాలు, పకోడాలు ప్రధానమైనవి. దాదాపు అన్ని ఆహారాలకు పెరుగు ఆధరువు (సైడ్ డిష్) గా వాడుకలో ఉంది. పంజాబులో పలు తీపి తినుబండారాలు వాడుకలో ఉన్నా రసగుల్లా, బర్ఫీ, గులాబ్ జామూన్ అత్యంత ప్రజాదరణ కలిగి ఉన్నాయి.
పంజాబీ సాహిత్యం
[మార్చు]పంజాబీ కవిత్వం లోతైన అర్ధానికి, సౌందర్యానికి, ఉత్సాహం, చక్కని పదప్రయోగానికి పేరుపొందింది. [ఆధారం చూపాలి] పంజాబీ ప్రజల మనసులో కవిత్వానికి ప్రత్యేక స్థానం ఉంది. పంజాబీ సాహిత్యం అధికంగా పలుభాషలలో అనువదించబడి ప్రపంచం అంతటా విస్తరించింది. పంజాబీ సాహిత్యంలో గురుగ్రంధ్ సాహెబ్ గ్రంథం అత్యంత ప్రధానమైనది.
పంజాబీ దుస్తులు
[మార్చు]పంజాబీ సంప్రదాయ దుస్తులలో ప్రధానమైన పంజాబీ దుస్తులు పురుషులు, స్త్రీలు కూడా ధరిస్తుంటారు. ప్రస్తుతం దీనిని స్థానంలో కుర్తా ఫైజమా చోటు చేసుకున్నాయి. పంజాబు స్త్రీల సంప్రదాయ దుస్తులలో పంజాబీ సల్వార్ సూటు ప్రధానమైనది. ప్రస్తుతం దీని స్థానాన్ని పంజాబీ ఘాగ్రా భర్తీ చేసింది. పంజాబులో పాటియాలా సల్వార్ కూడా ప్రజాదరణ కలిగి ఉంది.
పంజాబీ పండుగలు
[మార్చు]పంజాబీ ప్రజలు సాంస్కృతిక, సీజనల్, మతసంబంధిత పండుగలు ఉత్సాహంగా జరుపుకుంటారు. పండుగలలో మాఘి, మేళాచిరాఘన్, లోహ్రి, హోళీ, బైసఖీ, తీయాన్, దీపావళి, దసరా, గురునానక్ జయంతి ప్రధానమైనవి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- Wrestling in Punjab ( Documentary Film), on History of Wrestling in Punjab by Filmmaker Simran Kaler.
- [Quraishee 73] Punjabi Adab De Kahani, Abdul Hafeez Quaraihee, Azeez Book Depot, Lahore, 1973.
- [Chopra 77] The Punjab as a sovereign state, Gulshan Lal Chopra, Al-Biruni, Lahore, 1977.
- Patwant Singh. 1999. The Sikhs. New York: Doubleday. ISBN 0-385-50206-0.
- Nanak, Punjabi Documentary Film by Navalpreet Rangi
- The evolution of Heroic Tradition in Ancient Panjab, 1971, Buddha Parkash.
- Social and Political Movements in ancient Panjab, Delhi, 1962, Buddha Parkash.
- History of Porus, Patiala, Buddha Parkash.
- History of the Panjab, Patiala, 1976, Fauja Singh, L. M. Joshi (Ed).
- The Legacy of The Punjab by R. M. Chopra, 1997, Punjabee Bradree, Calcutta.