పాండురంగ మహాత్మ్యము

వికీపీడియా నుండి
(పాండురంగ మహాత్మ్యం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పాండురంగ మహాత్మ్యము తెనాలి రామలింగడు రచించిన ఐదు అశ్వాసాల గద్య పద్య కావ్యము. ఈ కావ్యంలో గత కవులు ఎవరూ వాడని కొత్త వర్ణనలు, అందునా తాను గతంలో వాడినవి మళ్ళీ వాడకుండా కవిత్వం చెప్పడంతో రామలింగడికి వికటకవి అన్న పేరువచ్చింది.

చరిత్ర రచనలో

[మార్చు]

పాండురంగ మహాత్మ్యం ప్రకారం ప్రపంచ దిగ్విజయానికి బయల్దేరే ముందు మన్మధుడు కొంతకాలం వెలిగుడారంలో విడిసినట్టు చెప్పబడింది.[1] 17వ శతాబ్ది నాటి విజయనగర సామ్రాజ్యపు అనే కవిలె, కృష్ణరాయలకు 50 ఏళ్ళ అనంతరపు రాయవాచకాల్లో రాయలు యుద్ధానికి వెళ్ళేప్పుడు అంత:పురం, నగరం వదిలి ఊరి బయట ఓ గుడారం వేసుకుని యుద్ధసన్నాహాలు పర్యవేక్షించేవారని, దానినే వెలిగుడారం అంటారని తెలుస్తోంది. ఇలాంటి చాలా విశేషాలు ఆనాటి సాంఘిక, రాజకీయ చరిత్రలను ప్రతిబింబిస్తున్నాయి.[2]

విశేషాలు

[మార్చు]

ఇది ఐదు అశ్వాసాలు గో 1302 గద్య పద్యాలతో విలసిల్లిన గ్రంథము. ఇందు ఇతివృత్తము పాండురంగని కథ. దీనిలోనుండి మూడు పద్యాలను చూడండి తుంగభద్రానది వర్ణన:

శా.

గంగా సంగమ మిచ్చగించునె మదిన్ గావేరి దేవేరిగా
నంగీకార మొనర్చునే యమునతో నానందముంబొందునే
రంగత్తుంగ తరంగ హస్తముల నారత్నాకరేంద్రుండు నీ
యంగంబంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రానదీ!

సీసం.
పట్టె వట్రువయును బరిపుష్టి తలకట్టు
గుడుసున్న కియ్యయు సుడియు ముడియు
నైత్వంబు నేత్వంబు నందంబు మందంబు
గిలకయు బంతులు నిలుపు పొలుపు
నయము నిస్సందేహతయునొప్పు మురువును
ద్రచ్చి వేసిన యట్ల తనరుటయును
షడ్వర్గశుద్దియు జాతియోగ్యతయును
వృద్ది ప్రియత్వంబు విశదగతియుఁ

తే.గీ.
గీలుకొన రాయసంబుల వ్రాలు వ్రాయుఁ
గొంకుఁ గొనరును జేతప్పుఁ గొనకయుండ
లలిత ముక్తాఫలాకార విలసనమున
మతిమరున్మంత్రి వేదాద్రి మంత్రివరుఁడు

శా.

ప్రారంభించిన వేదపాఠమునకున్ బ్రత్యూహ మౌనంచునో

యేరా తమ్ముఁడ! నన్నుఁ జూడఁ జనుదే వెన్నాళ్ళనోయుండి చ

క్షూ రాజీవ యుగంబు వాచె నినుఁ గన్గోకున్కి మీ బావయున్

నీరాకల్ మదిఁగోరుఁ జంద్రు పొడుపున్ నీరాకరంబున్ బలెన్[3]

మూలాలు

[మార్చు]
  1. తెనాలి రామకృష్ణుడు:పాండురంగ మహాత్మ్యం. 4వ అధ్యాయం, 44 పద్యం
  2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  3. తెనాలి, రామకృష్ణకవి (2006). శ్రీ పాండురంగ మహాత్మ్యము. హైదరాబాద్ , ఇండియా: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. ISBN 81-86073-40-3. {{cite book}}: Check |isbn= value: checksum (help)

బయటి లింకులు

[మార్చు]