Jump to content

పాఠ్యాంశం

వికీపీడియా నుండి
(పాఠ్యాంశములు నుండి దారిమార్పు చెందింది)

పాఠ్యాంశం లేదా సిలబస్ అనగా విద్య లేదా శిక్షణ కోర్సు పరిధిలోని విషయముల యొక్క రూపురేఖ, సారాంశం. ఇది వివరణాత్మకమైనది (సూచనా లేదా నిర్దిష్ట పాఠ్యప్రణాళిక వంటిది కాదు). సిలబస్ అనేది పరీక్షా బోర్డుచే తయారుచేయబడుతుంది లేదా కోర్సు నాణ్యతను పర్యవేక్షించే లేదా నియంత్రించే అధ్యాపకునిచే తయారుచేయ బడుతుంది. పరీక్షా బోర్డులు పరీక్ష రాసే అభ్యర్థులకు సిలబస్ ను పేపర్ రూపంలో లేదా అన్లైన్ లో పెట్టడం ద్వారా తెలియజేస్తాయి. పరీక్ష రాసే అభ్యర్థులు తాము రాయబోయే పరీక్షలో ఏ పాఠ్యాంశాల గురించి ప్రశ్నలు ఉంటాయో ఆ కోర్సుకు సంబంధించిన సిలబస్ ద్వారా తెలుసుకుంటారు. వేరు వేరు రంగాలకు చెందిన పరీక్షలకు వేరు వేరు సిలబస్‌లు ఉంటాయి. ఏ రంగానికి చెందిన పరీక్షలో ఆ రంగానికి చెందిన పాఠ్యాంశాలు అధికంగా ఉంటాయి. ఉదాహరణకు మెడిసన్ ప్రవేశ పరీక్షల అభ్యర్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ లతో పాటు బొటనీ, జువాలజీ లకు సంబంధించిన సిలబస్ ఉంటుంది, అయితే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల అభ్యర్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ లతో పాటు మ్యాథమెటిక్స్ లకు సంబంధించిన సిలబస్ ఉంటుంది. సిలబస్ ను తెలుసుకోవడం ద్వారా తాము ఆ సబ్జెక్టు సంబంధించి ఏ పాఠాలు ఎంత పరిధిలో ఎంత లోతుగా నేర్చుకోవాలో తెలుస్తుంది.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]