పిగ్మీ మార్మోసెట్

వికీపీడియా నుండి
(పిగ్మీ మార్మొసెట్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పిగ్మీ మార్మోసెట్[1][2]
Dværgsilkeabe Callithrix pygmaea.jpg
పరిరక్షణ స్థితి
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Animalia
విభాగం: Chordata
తరగతి: Mammalia
క్రమం: Primates
కుటుంబం: Callitrichidae
జాతి: Cebuella
Gray, 1866
ప్రజాతి: C. pygmaea
ద్వినామీకరణం
Cebuella pygmaea
Spix, 1823
Geographic range
పర్యాయపదాలు
 • Callithrix pygmaea

C. p. pygmaea:

 • nigra Schinz, 1844
 • leoninus Bates, 1864

పిగ్మీ మార్మోసెట్ అనునది అతి చిన్న కోతి. ఇది దక్షిణ అమెరికా లోని పశ్చిమ అమెజాన్ బేసిన్ లో స్థానిక వర్షారణ్యాలలో ఉంటాయి. ఇది కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఇది ప్రపంచంలో అతి చిన్న కోతిగా గుర్తింపబడింది. ఇది సతతహరిత అరణ్యాలు మరియు నదీ తీర అడవులలో గుంపులుగా ఉంటుంది. ఇవి బ్రెజిల్, పెరు, బొలీవియా, ఈక్వెడార్, కొలంబియా లోని వర్షారణ్యాలలో ఎక్కువగా ఉంటాయి.

ఈ పిగ్మీ మార్మోసెట్ వాటి జనాభాలో 83 శాతం తొమ్మిదేసి చొప్పున ఒక గుంపుగా ఉంటాయి. వాటిలో ఆధిపత్యం వహించే పురుష కోతి, సంతానోత్పత్తిచేసే స్త్రీ కోతి మరియు వాటి పిల్లలతో సహా గుంపుగా ఉంటాయి. చాలా గుంపులలో కుటుంబ సభ్యులు ఆరేసి చొప్పున ఉంటాయి.[4] కొన్ని సమూహాలలో వాటి కుటుంబ సభ్యులతోపాటు పెద్దవయసుగల కోతులు కూడా 1-2 వరకు ఉంటాయి. ఈ గుంపులోని సభ్యులు వాటి స్వర, రసాయనిక మరియు దృశ్య సంకేతాలతో వాటి భావ వ్యక్తీకరణ చేస్తాయి. సమూహంలో సభ్యుల మధ్య దూరాన్ని బట్టి అవి మూడు ప్రధాన సంకేతాలనుపయోగిస్తాయి.ఈ కోతులు బెదిరినపుడ వాటి ఆధిపత్య చూపించుటకు దృశ్యమాన ప్రదర్శనలు చేయవచ్చు. స్త్రీ జంతువులు వాటి పునరుత్పత్తి సామర్థ్యం ఉన్నపుడు పురుష జంతువులను ఆకర్షించడానికి రసాయన సంకేతాలను అనగా వాటి ఛాతీమీద గ్రంథులనుండి స్రావాలనుపయోగించుట మరియు జననేంద్రియ ప్రాంతంలో స్రావాలను ఉత్పత్తిచేయుట చేస్తాయి. స్త్రీ జీవి ఒక సంవత్సరంలో రెండు సార్లు కవలలకు జన్మనిస్తుంది.వాటి సంరక్షణ తల్లిదండ్రులు మరియు సమూహం సమష్టిగా పంచుకుంటాయి.


ఆకార వర్ణన[మార్చు]

ప్రపంచంలోని అతి చిన్న కోతి.

పిగ్మీ మార్మోసెట్ ప్రపంచంలో అతిచిన్న ప్రైమేట్లలో ఒకటి. దీని పొడవు తల మరియు శరీరం కలిపి 117 నుండి 152 మిల్లీమీటర్ల వరకు మరియు తల నుండి తోకవరకు 172 నుండి 229 మీల్లీమీటర్ల వరకు ఉంటుంది. అందువల్ల ఇది ఇప్పటివరకు ఉన్న కోతులలో అతి చిన్నదైనది. ఈ కోటి వయోజన దశలో బరువు 100 గ్రాములు ఉంటుంది.స్త్రీ కోతి గర్బంతో ఉన్నప్పుడు కొద్దిగా బరువు ఎక్కువ ఉంటుంది[5][6] .దీని శరీరం పై బొచ్చు రంగు గోధుమరంగుతో కూడిన బంగారు రంగు, బూడిద మరియు నలుపు రంగుకూడిన వీపు మరియు తల, పసుపురంగు, నారింజరంగు, మరియు క్రిందిభాగంలో ఊదా రంగు కలిగి ఉంటాయి. దాని తోక నలుపు అలయాలు మరియు దాని ముఖంపై బుగ్గలకు తెలుపు మరియు దాని కళ్ళు మధ్య తెలుపు నిలువుగా చారలు ఉంటాయి[6] .వీటికి పదునైన పంజావలె గోర్లు, 180 డిగ్రీలు తలను త్రిప్పగల సామర్థం ఉంటుంది[7][8] . దీని దంత స్వరూపంలో ప్రత్యేక ముందరి పళ్ళు చెట్లను ఉలితో చెక్కినట్లు చేస్తాయి. ఇది నాలుగు కాళ్ళతో నడుస్తూ ఐదు మీటర్ల వరకు దుముక గలిగే సామర్థం కలిగి ఉంటుంది.[8] [7][9]

ఆహారం[మార్చు]

ప్రత్యేక పంజాలతో వ్రేలాడి ఆహారం సేకరిస్తాయి

వీటికి పదునైన పళ్ళు ఉంటాయి. వాటితో తుమ్మ చెట్టుపై పదునైన రంధ్రాలు చేస్తుంది. అందులోంచి వచ్చే చిక్కని జిగురులాంటి స్రావం కారుతుంది. అది వాటికి ఇష్టమైన ఆహారం. ఆకులు, పూలు, పండ్లు, కీటకాలు, సాలెపురుగులు, చిన్న బల్లులు, తేనె కూడా ఆహారంగా తీసుకుంటాయి [10] [3] [11]

భాష[మార్చు]

వీటి గొంతు సన్నగా ఉన్నా గట్టిగానే ఉంటుంది. అది ఈలవేసినట్లు ఉంటుంది.

ఇతర విశేషాలు[మార్చు]

వీటికి సమూహంగా ఉండటం ఇష్టం. ఒంటరిగా ఉండలేవు. పుట్టిన 5 నెలల నుంచే పిల్లల్ని కనేయడానికి సిద్ధంగా ఉంటాయి. 135 రోజుల రర్భధారణ కాలం తరువాత ఒకటి నుండి నాలుగు వరకు పిల్లల్ని కంటాయి. వీటి సగటు జీవితకాలం 25 సంవత్సరాలు ఉంటుంది. చాలా వరకు 11 నుండి 15 ఏళ్ళె జీవిస్తాయి. వీటికి అనేక జంతువులతో ప్రమాదాలు పొంచి ఉంటాయి. పిల్లులు, పాములు, రాబందులు దాడిచేసి వీటిని ఎత్తుకుపోతూ ఉంటాయి.

చిత్రమాలిక[మార్చు]మూలాలు[మార్చు]

 1. Groves, C. P. (2005). "Order Primates". In Wilson, D. E.; Reeder, D. M (సంపాదకులు.). Mammal Species of the World (3rd సంపాదకులు.). Johns Hopkins University Press. p. 132. ISBN 978-0-8018-8221-0. OCLC 62265494.
 2. Rylands, A. B.; Mittermeier, R. A. (2009). "The diversity of the New World primates (Platyrrhini)". In Garber, P. A.; Estrada, A.; Bicca-Marques, J. C.; Heymann, E. W.; Strier, K. B. (సంపాదకులు.). South American Primates: Comparative Perspectives in the Study of Behavior, Ecology, and Conservation. Springer. pp. 23–54. ISBN 978-0-387-78704-6.CS1 maint: uses editors parameter (link)
 3. 3.0 3.1 "Cebuella pygmaea". IUCN Red List of Threatened Species. Version 2012.2. International Union for Conservation of Nature. 2008.
 4. Soini, Pekka. "Ecology and Population Dynamics of the Pygmy Marmoset, Cebuella Pygmaea." Folia Primatologica 39.1-2 (1982): 1-21. Print.
 5. Nowak, R. M. (1999). Walker's Mammals of the World (6th సంపాదకులు.). Baltimore and London: The Johns Hopkins University Press. p. 566. ISBN 978-0-8018-5789-8.
 6. 6.0 6.1 doi: 10.1159/000156066
  This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
 7. 7.0 7.1 Kinzey, W. G. (1997). "Synopsis of New World primates (16 genera)". In Kinzey, W. G. (సంపాదకుడు.). New World Primates: Ecology, Evolution, and Behavior. New York: Aldine De Gruyter. pp. 169–324.
 8. 8.0 8.1 Sussman, R. W. (2000). Primate Ecology and Social Structure. Volume 2: New World Monkeys. Needham Heights, MA: Pearson Custom Publishing.
 9. doi: 10.1007/s10329-011-0237-7
  This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
 10. doi: 10.1002/(SICI)1098-2345(1997)41:3.3C229::AID-AJP5.3E3.0.CO;2-Z
  This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
 11. Lang, Kristina Cawthon. "Primate Factsheets: Pygmy marmoset (Callithrix pygmaea) Taxonomy, Morphology, & Ecology". Retrieved 24 September 2013. Cite web requires |website= (help)

ఇతర లింకులు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]