Jump to content

అపాన వాయువు

వికీపీడియా నుండి
(పిత్తు నుండి దారిమార్పు చెందింది)
అపాన వాయువులతో బాధపడుతున్నవ్యక్తి

పిత్తు లేదా అపాన వాయువు మానవ జీర్ణక్రియలో ఒక భాగము. ఈ వాయువులు మలద్వారం గుండా వెళుతున్నపుడు తీవ్రతను బట్టి శబ్దం చేస్తాయి. పేగుల్లో ఉండే వాయువు పూర్తిగా అక్కడ ఉత్పత్తి అయిందే కాక, కొంత భాగం తినేటపుడు లోపలికి వెళ్ళే గాలి కూడా ఉంటుంది. అపాన వాయువు గురించిన అధ్యయనాన్ని ఆంగ్లంలో ఫ్లాటాలజీ అంటారు.

అపాన వాయువు పేగుల్లోని కండరాల ఒత్తిడి చేత పురీషనాళంలోకి చేరుతుంది. ఈ వాయువు విడుదలవడం చాలా సాధారణమైనది, అయితే వదిలేటప్పుడు శబ్దం తరచుదనం చాలా వరకు వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ వాయువు కొంత చెడు వాసన (ఒక్కోసారి దుర్గంధం) కలిగి ఉండటం కూడా సాధారణమే. ఇది విడుదలయ్యేటపుడు వచ్చే శబ్దం, మలద్వారం, పిరుదల కారణంగా కలుగుతుంది. ఇది విడుదల చేసే శబ్దం, వాసన వలన సాధారణంగా జనాలు దీనిని ఇబ్బందిగా భావిస్తుంటారు. కొన్ని సమాజాల్లో దీని మీద ఆంక్షలు కూడా ఉన్నాయి. అందుకనే చాలా సార్లు దీనిని వీలైతే నిశ్శబ్దంగా వదిలేయడమో, లేక పూర్తిగా బిగపట్టుకోవడమో చేస్తారు.[1][2] కానీ శాస్త్రీయపరంగా అయితే బిగపట్టుకోవడం అంత మంచిది కాదు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. wikihow.com, retrieved 19 February 2023.
  2. soranews.com, retrieved 19 February 2023.
  3. Wynne-Jones, G. (1975). "Flatus retention is the major factor in diverticular disease". Lancet. 2 (7927): 211–212. doi:10.1016/s0140-6736(75)90677-7. ISSN 0140-6736. PMID 51965. S2CID 9443068.
  4. 'Let your flatulence fly, scientists urge passengers', retrieved 7 March 2023, based upon Flatulence on airplanes: just let it go

బయటి లింకులు

[మార్చు]