Jump to content

పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి

వికీపీడియా నుండి
(పి వినయ్ కుమార్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

1974 నిజమాబాద్ జిల్లా కోమ్మనపల్లి గ్రామంలో జన్మించిన ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి కిసాన్ నగర్ లోని సెయింట్ ఎలిజిబిట్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను ..హైదరాబాద్ చైతన్య జూనియర్ కళాశాల నుంచి ఇంటర్మీడియట్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి 1997లో తన ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు .

విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన వినయ్ కుమార్ రెడ్డి హెచ్ ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీని స్థాపించి తన ప్రత్యక్ష వ్యాపార జీవితాన్ని ప్రారంభించారు.

విద్యార్థి దశనుండే రాజకీయాలపైన ఎంతో ఆసక్తి కలిగి ఉన్న వినయ్ కుమార్ రెడ్డి స్వరాష్ట్ర సదనకే జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించారు.

భారత రాష్ట్ర సమితిలో చేరికతో తన ప్రత్యక్ష రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వినయ్ కుమార్ రెడ్డి ఆ పార్టీలో అంచనాంచలుగా ఎదుగుతూ ఎంతో క్రియాశీలక కార్యకర్తగా పేరు సంపాదించారు.

ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వినయ్ కుమార్ రెడ్డి 2018 లో భారత హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు . భారతీయ జనతా పార్టీలో కూడా ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు వినయ్ కుమార్ రెడ్డి .

ఏ రాజకీయ పార్టీలు ఉన్నా సరే పార్టీలతో సంబంధం లేకుండా తనదైన సేవ, సామాజిక కార్యక్రమాలతో నిత్యం ప్రజల మధ్య ఉండే వినయ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2023 డిసెంబరులో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ముందున్నారు .

మూలాలు

[మార్చు]

[1]

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.