ఉమా పెమ్మరాజు

వికీపీడియా నుండి
(పెమ్మరాజు ఉమ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఉమా పెమ్మరాజు
జననం
ఉమాదేవి పెమ్మరాజు

(1958-03-31) 1958 మార్చి 31 (వయసు 66)
విద్యాసంస్థట్రినిటీ విశ్వవిద్యాలయం
వృత్తిటెలివిజన్ వార్తా వాఖ్యాత
ఉద్యోగంఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంటు గ్రూపు
జీవిత భాగస్వామివిడాకులు
పిల్లలుకిరిన (కుమార్తె)
పురస్కారాలుఉత్తమ వార్తా ఆంకర్ టీమ్‌, బోస్టన్ (పత్రిక) [1]

ఉమాదేవి పెమ్మరాజు (జ. 1958 మార్చి 31)[2] భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఏంకర్, ఫాక్స్ న్యూస్ ఛానెల్ కేబిల్ నెట్‌వర్క్ హోస్టుగా పనిచేస్తున్నారు. ఈమె ప్రస్తుతం వాషింగ్టన్ డి.సి. నుండి ప్రసారాలను ఇస్తున్నది.

ప్రారంభ జీవితం[మార్చు]

పెమ్మరాజు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజమండ్రి లో జన్మించింది. యునైటెడ్ స్టేట్స్ లోని టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోలో పెరిగింది. ఆమె టెక్సాస్‌లోని ట్రినిటీ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందింది.
పెమ్మరాజు ప్రారంభ టెలివిజన్ కెరీర్ ఆమె సొంత రాష్ట్రం టెక్సాస్‌లో KENS-TV, శాన్ ఆంటోనియో ఎక్స్‌ప్రెస్-న్యూస్ వార్తాపత్రికలో ప్రారంభమైంది. ఈ పత్రికలో ఆమె రిపోర్టర్, నిర్మాతగా పనిచేసేది. ట్రినిటీ విశ్వవిద్యాలయంలో కళాశాలలో పూర్తి సమయం విద్యాభ్యసన చేస్తూ తన స్వంత రాష్ట్రమైన టెక్సాస్ లో ఏంకర్ గా పనిచేసేది.

ఆమె తన కళాశాల వార్తాపత్రికకు సంపాదకురాలిగా కూడా పనిచేసింది. ఆమె తరువాత డల్లాస్‌లోని కెటివిటి -11 కు న్యూస్ యాంకర్, కరస్పాండెంట్‌గా, ఆపై బాల్టిమోర్‌లోని డబ్ల్యుఎంఎఆర్-టివికి వెళ్లి అక్కడ ఎమ్మీ పురస్కారాన్ని గెలుచుకుంది.[3] [4]ఆమె బాల్టిమోర్ నుండి బోస్టన్‌లోని WLVI, WBZ-TV లకు వెళ్ళి, అక్కడ కరస్పాండెంట్, WBZ ఈవినింగ్ మ్యాగజైన్‌కు నిర్మాతగా వ్యవహరించింది.

1882లో పెమ్మరాజు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తులు కర్ట్ అండెర్సన్, జార్జియా గోస్లీ

అక్టోబర్ 1996 లో నెట్‌వర్క్ ప్రారంభించినప్పుడు పెమ్మరాజు అసలు ఫాక్స్ న్యూస్ ఛానల్ బృందంలో ఒక భాగం. ఆమె నెట్‌వర్క్‌లో అనేక విభిన్న వార్తా ప్రదర్శనలను నిర్వహించింది. అనేక ప్రత్యేక వార్తా కార్యక్రమాలను నిర్వహించింది. ఆమె దలైలామా నుండి వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్, జోయెల్ ఒస్టీన్, కార్లీ సైమన్, డోనాల్డ్ ట్రంప్, హూపి గోల్డ్‌బెర్గ్, సారా పాలిన్లతో పాటు డి.సి నుండి వచ్చిన సెనేటర్లు, కాంగ్రెస్ నాయకులకు ఇంటర్వ్యూ చేసింది. ఆమెకు 1996, 1997 లలో బోస్టన్ మ్యాగజైన్ "బోస్టన్" ఉత్తమ యాంకర్ " పురస్కారాన్నిచ్చింది. పెమ్మరాజు తన రిపోర్టింగ్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం అనేక ఎమ్మీ అవార్డులను అందుకుంది.

ఆమె కెరీర్‌లో ఇతర గౌరవాలు: రిపోర్టింగ్ కోసం టెక్సాస్ AP అవార్డు, బిగ్ సిస్టర్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా నుండి ది ఉమెన్ ఆఫ్ అచీవ్‌మెంట్ అవార్డు, విమెన్ ఇన్ కమ్యూనికేషన్స్ నుండి మ్యాట్రిక్స్ అవార్డు పొందింది.[5]

మూలాలు[మార్చు]

  1. "Best of Boston 1994 BEST TV, Anchor Team". bostonmagazine.com. Boston Magazine. Retrieved 20 December 2016.
  2. "One Ethnicity and Raised in Another: Uma Pemmaraju's Married Life with Millionaire Husband". LiveRampup.com. LiveRampup. Retrieved 20 December 2016.
  3. Robinson, John (11 February 1993). "The inside story on Uma Pemmaraju's latest career move". Boston Globe. Retrieved 20 December 2016.
  4. "The inside story on Uma Pemmaraju's latest career move". Boston Globe. 11 February 1993. Archived from the original on 8 December 2017. Retrieved 20 December 2016.
  5. "Uma Pemmaraju (biography)". Fox News. 13 January 2011. Retrieved 21 March 2012.

బయటి లింకులు[మార్చు]