Jump to content

పొగాకు

వికీపీడియా నుండి
(పొగ చెట్టు నుండి దారిమార్పు చెందింది)

పొగాకు
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
N. tabacum
Binomial name
Nicotiana tabacum

పొగాకు లేదా పొగ చెట్టు (Tobacco) సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క. వీని నుండి పొగ విడుదలౌతున్నందు వలన దీనికి 'పొగాకు' అనే పేరు వచ్చింది. దీని ఆకుల నుండి సిగరెట్లు, చుట్టలు తయారుచేస్తారు. కొన్ని రకాల తాంబూలాలలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు.

పొగాకు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి, మత్తు కలిగించే పదార్దం కూడ.అమెరికాలో దీనిని చాలకాలం క్రితం వైద్యానికి, పూజలకు ఉపయొగించెవారు. ఉత్తర అమెరికాని యూరోపియన్ దేశాలు వలస రాజ్యంగా ఏర్పరచుకున్మాక పొగాకు మత్తు పదార్దంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని వల్ల దక్షిణ అమెరికా ఆర్థిక వ్యవస్థ చాల వరకు పొగాకు ఉత్పత్తి మీద ఆధారపడేది. అమెరికా అంతర్యుద్ధం తరువాత డిమాండ్ పెరగడంతొ సిగరెట్ బాగా ప్రాచుర్యం పొందింది. తొంభైలలో అమెరికా పొగాకు వివాదం వచ్చెవరకు పొగాకు పరిశ్రమ అభివృధ్ధి చెందింది.

పొగాకులో అనేక జాతులకు చెందినవి ఉన్నాయి, ఇవన్నీ నికోటియానా అనే జాతి జాతికి చెందినవి. నికోటియానా (అలాగే నికోటిన్) అనే పదానికి పోర్చుగల్‌లోని ఫ్రెంచ్ రాయబారి జీన్ నికోట్ గౌరవార్థం అతని పేరు పెట్టారు.1559 లో దీనిని కేథరీన్ డి మెడిసి కోర్టుకు ఔషధంగా పంపారు.మానవ ఆరోగ్యంపై పొగాకు ప్రభావాలు గణనీయమైనవి. అది ఉపయోగించిన పద్ధతి, వినియోగించిన మొత్తాన్ని బట్టి ఆరోగ్యంపై ప్రభావాలు మారుతూ ఉంటాయి. వినియోగం వివిధ పద్ధతులలో, ధూమపానం వెక్టర్ ద్వారా హృదయనాళ వ్యవస్థ వ్యాధులకు సంబంధించిన ప్రాధమిక ఆరోగ్య ప్రమాదాలు, కాలక్రమేణా అధిక మొత్తంలో నోటి, గొంతు,ఉపిరితిత్తులలో క్యాన్సర్ వ్యాధిని పెంపొందించింది.

నికోటిన్ యొక్క వ్యసనపరుడైన లక్షణాల కారణంగా, సహనం కోల్పోయి మరొకరిపై ఆధారపడతాడు.[1] పొగాకు వాడేవారు 1.1 బిలియన్ల మంది, వయోజన జనాభాలో 1/3 మంది ప్రజలు ధూమపానానికి అలవాటుపడినట్లు లెక్కలు చెపుతున్నట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా మరణానికి ప్రధాన కారణం అని నివేదించింది.ప్రస్తుతం ఇది సంవత్సరానికి 5.4 మిలియన్ల మరణాలకు కారణమవుతుందని అంచనా వేసింది.

పొగాకును ఇతర వ్యవసాయ ఉత్పత్తుల మాదిరిగానే సాగు చేస్తారు. కీటకాల నుండి దాడులను నివారించడానికి విత్తనాలను చల్లని ఫ్రేములు లేదా హాట్‌బెడ్‌లలో విత్తుతారు, తరువాత పొలాల్లోకి నాటుతారు. పొగాకు వార్షిక పంట, ఇది సాధారణంగా పెద్ద సింగిల్-పీస్ వ్యవసాయ పరికరాలలో పండిస్తారు.పంట తరువాత, పొగాకు క్యూరింగ్ కోసం అనుమతించబడుతుంది, ఇది కెరోటినాయిడ్ల నెమ్మదిగా ఆక్సీకరణ, క్షీణతను అనుమతిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తి సాధారణంగా పొగ యొక్క "సున్నితత్వం" కు కారణమైన లక్షణాలను స్వీకరించడానికి ఇది అనుమతిస్తుంది. దీనిని అనుసరించి, పొగాకు ధూమపానం, చూయింగ్, స్నిఫింగ్, ఇతర రకాలైన వివిధ రకాల వినియోగాలలో నిండి ఉంటుంది.

పొగాకు సాగుబడి

[మార్చు]
పొగాకు పొలంలో ఎండబెట్టిన చిత్రం

మెట్ట ప్రాంతాలలో ఎక్కువగా పండే ఈ పొగాకును మిగిలిన పంటల మాదిరిగానే పెంచి ఆకులు కోతకు వచ్చాక కోసి వాటిని బేళ్ళుగా కట్టలు కట్టి ఎండబెడతారు.భారతీయ పొగాకు బోర్డు ఉత్పత్తి, ఉత్పత్తి నియంత్రణ సంఘం (ఉత్పత్తి సంఘం), గుంటూరులో 2011 ఆగస్టు 11 నాడు సమావేశమైంది. దేశంలో ఉన్న పొగాకు నిల్వలు, ప్రస్తుత మార్కెట్ ఉన్న తీరు, ప్రపంచవ్యాప్తంగా పొగాకు పంట తీరుతెన్నులు, ధరవరలు, తదితర అంశాలపై అధికారులు సమావేశంలో చర్చించారు. ఇటీవల రైతుప్రతినిధులు, వ్యాపార వర్గాలు వెలిబుచ్చిన అభిప్రాయాలపై కూడా సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం పొగాకు ధరల్లో ఉన్న హెచ్చు తగ్గులు, ప్రపంచవ్యాప్తంగా, నెలకొన్న పరిస్థితులను, అనుసరించి 2011-12 సంవత్సరపు పంట పరిమితిని గత సంవత్సరం పంట పరిమితి (170 మిలియన్ కిలోలు) కంటే ఐదు శాతం తగ్గించాలని (162 మిలియన్ కిలోలు), ఈ సంఘం సిఫార్సు చేసింది

ఆరోగ్యం మీద పొగాకు ప్రభావం

[మార్చు]

పొగాకు వినియోగం ఏ రూపంలో వినియోగించినా అనారోగ్యానికి గురిచేస్తుంది. అయితే వినియోగించిన విధానాన్ని, పొగ త్రాగడం, ముక్కు పొడి రూపంలో పీల్చడం, లేదా నమలడం బట్టి కొంతవరకు తీవ్రతలో మార్పు ఉంటుంది. పొగాకు వినియోగం వలన కలిగే నష్టాలలో ముఖ్యమైనవి ఊపిరితిత్తుల కాన్సర్, గుండె వ్యాధులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2004 సంవత్సరంలో పొగాకు వినియోగం మూలంగా 5.4 మిలియన్ మరణాలు సంభవించాయి. ధూమపానం వల్ల నంపుసకత్వం వస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి.[2] 20వ శతాబ్దంలో సుమారు 100 మిలియన్ మరణాలు సంభవించాయి.[3]. అమెరికాలోని వ్యాధి నిరోధక, నియంత్రణ కేంద్రం (Centers for Disease Control and Prevention) పొగాకు వినియోగాన్ని నిరోధించగలిగే వ్యాధి కారకాలలో ప్రధానమైనదిగా, ప్రపంచవ్యాప్తంగా సంభవించే అకాల మరణాలకు ముఖ్యమైన కారణంగా పేర్కొన్నది."[4] అభివృద్ధి చెందిన దేశాలలో పొగత్రాగేవారి సంఖ్య స్థిరంగా ఉంది. అమెరికాలో వీరి శాతం 1965 నుండి 2006 సంవత్సరానికి సగానికి పైగా తగ్గింది.[5] అయితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వీరి శాతం సంవత్సరానికి 3.4% చొప్పున పెరుగుతుంది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Tobacco Facts - Why is Tobacco So Addictive?". Tobaccofacts.org. Archived from the original on 2007-03-14. Retrieved 2008-09-18.
  2. WHO global burden of disease report 2008
  3. WHO Report on the Global Tobacco Epidemic, 2008
  4. "Nicotine: A Powerful Addiction Archived 2009-05-01 at the Wayback Machine." Centers for Disease Control and Prevention.
  5. Cigarette Smoking Among Adults - United States, 2006
  6. WHO/WPRO-Smoking Statistics

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పొగాకు&oldid=4320947" నుండి వెలికితీశారు