పునరుత్పత్తి
స్వరూపం
(ప్రత్యుత్పత్తి నుండి దారిమార్పు చెందింది)
పునరుత్పత్తి లేదా ప్రత్యుత్పత్తి అనగా సాధారణంగా శిశువు లాగా కొత్తగా జీవమును పొందే ఏదో సృష్టి లేదా పునఃసృష్టి. జీవ జాతులు పునరుత్పత్తి విధానంలో శాశ్వతంగా, నిరంతరంగా తన తరాలను కొనసాగిస్తుంటాయి. జీవశాస్త్రంలో లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి అని రెండు రకాల ప్రత్యుత్పత్తులు ఉన్నాయి. లైంగిక పునరుత్పత్తి నందు ఒకే జాతి యొక్క రెండు జీవులు ఇమిడి ఉంటాయి, ఇవి సంతతి కోసం ఒక్కొక్కటి అర్ధ జన్యువులు సరఫరా చేస్తాయి. అలైంగిక పునరుత్పత్తి నందు కేవలం ఒకే జీవి ఇమిడుంటుంది; ఇది కణ విభజన ద్వారా పనిచేస్తుంది. చాలావరకు బ్యాక్టీరియా అలైంగిక పునరుత్పత్తి ద్వారా పునరుత్పత్తి చెందుతాయి. కొన్ని జీవరాశులు పునరుత్పత్తి లైంగికముగా గాని లేదా అలైంగికముగా గాని చెయ్యగలుగుతాయి.