వర్ణ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
19 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
 
అమ్మ యొక్క శక్తుల వల్ల గోవాలో మధు పడి ఉన్న కొండకి, మహేంద్ర ఎక్కిన ఆ కొండ చరియకి మధ్య రెండు ప్రపంచాల ద్వారం తెరుచుకుంటుంది. కారులో ఉన్న మధుని కాపాడి మహేంద్ర తనని అమ్మ దగ్గరికి వైద్య కోసం తీసుకెళ్తాడు. పరలోక ప్రజలు మధు ఓ దేవత అనుకుని సంబరాలు చేస్తుంటారు. అక్కడ రమ్యలా ఉన్న వర్ణను చూసి మధు ప్రేమ పెంచుకోడంతో పూలు పూస్తాయి. శత్రురాజ్యం వాళ్ళు అమ్మని అపహరించుకుపోగా వర్ణను కాపాడినందుకు మహేంద్రను రాజ్యం నుంచి గెంటుతాడు. అమ్మను కాపాడే ప్రయత్నంలో మహేంద్ర ఆ శత్రురాజ్యం సైనికులకు దొరికిపోయి ఇరుక్కుపోతాడు. మహేంద్ర, అమ్మలను వెతకడానికి వర్ణ, మధు బయలుదేరతారు. రమ్య గురించి తెలుసుకున్నాక వర్ణ తన భర్త అయిన మహేంద్రతో ప్రేమలో పడ్డానని తెలుసుకుంటుంది. మహేంద్ర శత్రుసైన్యాన్ని చేల్చిచెండాడి అమ్మతో కలిసి ఓ పడవలో పారిపోతాడు. కానీ మధు ఆ గొడవల్లో చనిపోతాడు. అమ్మ వర్ణ, మహేంద్రలను మధుని కాపాడవద్దని చెప్పి ఆపుతుంది. దానితో మధు మరో ప్రపంచానికి వెళ్ళి అక్కడ అచ్చం రమ్యలా ఉన్న ఓ అమ్మాయిని చూసి మీరు ఎవరినయినా ప్రేమించారా అని అడుగుతాడు. ఆమె లేదని చెప్పడంతో మధు ఇదే తను చేరుకోవాల్సిన లక్ష్యమనుకుని సంబరపడతాడు.
 
[[వర్గం:2013 తెలుగు సినిమాలు]]
[[వర్గం:తమిళ అనువాద చిత్రాలు]]
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3126065" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ