తాష్కెంట్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ps:تاشكند
చి యంత్రము కలుపుతున్నది: mhr:Ташкент
పంక్తి 54: పంక్తి 54:
[[lt:Taškentas]]
[[lt:Taškentas]]
[[lv:Taškenta]]
[[lv:Taškenta]]
[[mhr:Ташкент]]
[[mr:ताश्केंत]]
[[mr:ताश्केंत]]
[[ms:Tashkent]]
[[ms:Tashkent]]

05:41, 19 డిసెంబరు 2009 నాటి కూర్పు

తాష్కెంట్

తాష్కెంట్ (ఉజ్బెక్:Тошкент, రష్యన్:Ташкент, ఆంగ్లం:Stone City) ఉజ్బెకిస్తాన్ దేశము యొక్క రాజధాని. తాష్కెంట్ ప్రాంతము యొక్క ముఖ్య పట్టణము. 1999 అంచనాల ప్రకారము ఈ నగరము యొక్క జనాభా 2,142,700.

ఈ నగరము యొక్క పేరు కాలక్రమేణా అనేక మార్పులు చెందుతూ వచ్చింది. మధ్య యుగంలో ఈ పట్టణము మరియు చుట్టు పక్కల ప్రాంతాన్ని ఛాచ్ అని పిలిచేవారు. ఆ తరువాత అది కాస్తా ఛచ్‌ఖండ్/ఛస్‌ఖండ్ (ఛాచ్ నగరం)గా మారింది. పాత పర్షియన్ భాషలో కంద అనగా పట్టణము లేదా నగరము అను పదము నుండి ఉద్భవించిన కండ్, ఖండ్, కెంట్, కద్, కథ్, కుద్ ఇవన్నీ నగరానికి పేర్లే. సమర్‌ఖండ్, యార్‌కంద్, పెంజికెంట్ మొదలైన పేర్లు వీటికి ఉదాహరణలు. 16 శతాబ్దము తరువాత క్రమక్రముగా పూర్వపు పర్షియన్ మాట్లాడే ప్రజల స్థానే ఉజ్బెక్ ల జనాభా పెరిగిపోవడముతో నగరము పేరు ఛచ్‌ఖండ్/ఛస్‌ఖండ్ నుండి కొద్దిగా రూపాంతరము చెంది తష్‌కండ్ అయినది. తష్‌కండ్ అనగా రాతి నగరము. కొత్తగా వచ్చి స్థిరపడిన వారికి ఈ పేరు పూర్వపు ఛచ్‌ఖండ్ అనే పేరుకంటే సముచితమైనదనిపించింది. ప్రస్తుత ఆధునిక తాష్కెంట్ అనే ఉఛ్ఛారణ సోవియట్ ప్రభావము వళ్ల యేర్పడింది.