చెత్త: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ta:குப்பை
చి Bot: Migrating 66 interwiki links, now provided by Wikidata on d:q45701 (translate me)
పంక్తి 14: పంక్తి 14:
== ఇవి కూడా చూడండి ==
== ఇవి కూడా చూడండి ==
* [[వ్యర్థ పదార్థాల నిర్వహణ]]
* [[వ్యర్థ పదార్థాల నిర్వహణ]]

[[en:Waste]]
[[ta:குப்பை]]
[[ml:മാലിന്യം]]
[[an:Vasuera]]
[[ar:مخلفات]]
[[ay:T'una]]
[[be:Цвёрдыя бытавыя адкіды]]
[[be-x-old:Цьвёрдыя бытавыя адкіды]]
[[bg:Отпадък]]
[[bjn:Ratik]]
[[ca:Residu (deixalles)]]
[[cs:Odpad]]
[[cy:Sbwriel]]
[[da:Affald]]
[[de:Abfall]]
[[el:Απορρίμματα]]
[[eo:Rubo]]
[[es:Basura]]
[[et:Jäätmed]]
[[eu:Zabor]]
[[fa:زباله]]
[[fi:Roska]]
[[fr:Déchet]]
[[gan:餲屑]]
[[gl:Lixo]]
[[gn:Yty]]
[[he:פסולת]]
[[hr:Otpad]]
[[ht:Fatra]]
[[hu:Hulladék]]
[[id:Sampah]]
[[is:Sorp]]
[[it:Rifiuti]]
[[ja:廃棄物]]
[[jv:Larahan]]
[[kk:Өндіріс қалдықтары]]
[[ko:쓰레기]]
[[lmo:Rumenta]]
[[lv:Atkritumi]]
[[mr:घाण]]
[[nah:Tlazōlli]]
[[nl:Afval (vuilnis)]]
[[nn:Søppel]]
[[no:Avfall]]
[[pl:Odpady]]
[[pt:Resíduo sólido]]
[[qu:Q'upa]]
[[ro:Deșeu]]
[[ru:Отходы]]
[[sc:Arga]]
[[sh:Otpad]]
[[simple:Waste]]
[[sk:Odpad]]
[[sl:Odpadek]]
[[sq:Mbeturina]]
[[sr:Отпадне материје]]
[[sv:Avfall]]
[[th:ปฏิกูล]]
[[tl:Aa (dumi)]]
[[tr:Çöp]]
[[uk:Відходи]]
[[vec:Scoase]]
[[vi:Rác]]
[[yi:מיסט]]
[[zh:垃圾]]
[[zh-yue:垃圾]]

14:49, 9 మార్చి 2013 నాటి కూర్పు

Common rubbish in a bin bag.
A dumpster full of waste awaiting disposal.

చెత్త లేదా వ్యర్ధ పదార్ధాలు (Waste or Garbage) పెద్ద సమస్యగా మారింది. రోజూ వేల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ఖర్చుతోపాటు తరలింపునకు స్థలం కరవు ఔతోంది. చెత్తే కదా.. బయట పడేసిరా అని మనం తేలిగ్గా చెబుతాం. కానీ, మునిసిపాలిటీలకు అదే పెద్ద గుడిబండగా మారింది. మనం వేసిన చెత్తను ఎక్కడికి తరలించాలన్నది తలనొప్పిగా తయారైంది. దీనిని ఎక్కడ వేద్దామన్నా ఆ పరిసర ప్రాంతాల వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెత్త వేయటానికి అనువైన ప్రదేశం దొరకటం లేదు. ఫలితంగా డంపర్‌ బిన్లు నిండిపోయి వ్యర్థపదార్థాలు ఆ చుట్టుపక్కల పడుతున్నాయి. జనావాసాల మధ్య దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త వేయటానికి వెసులుబాటు లేక అధికారులు కూడా డంపర్ బిన్లు తీసుకెళ్లటం లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. భవిష్యత్తులో మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. చెత్తను తొలగించటానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. నగరంలో ఉన్న చెత్త తీసుకొచ్చి పోయటం వల్ల వ్యాధులు వస్తాయని ఎక్కడికక్కడ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఉత్పత్తి అవుతున్న చెత్తను ఎక్కడ పోసినా తగాదాలు జరుగుతున్నాయి. చెత్తను నిర్వీర్యం చేయటం పెద్ద సమస్యే. వాస్తవానికి దానిని సేకరించిన తర్వాత సరైన పద్ధతిలో భూస్థాపితం చేయాలి. లేకుంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఉన్న ఖాళీలో పోసి వస్తున్నారు తప్పించి.. సరైన విధానాన్ని పాటించటం లేదు. దీంతో సమీప ప్రాంతాల్లో దుర్వాసన.. చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయి.

చెత్తనుండి మేలు

  • హైదరాబాద్‌లో వ్యర్ధ పదార్థాల నుంచి వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు. దీనివల్ల కార్పొరేషన్‌కు రెండు విధాలా లాభం ఉంది. చెత్త వేయటానికి ఉన్న స్థలం ఎక్కువ కాలం ఉపయోగంలో ఉండటం.. తయారైన వర్మీ కంపోస్టును విక్రయించటం ద్వారా ఆదాయం.. ఇలా రెండు విధాలా లబ్ధి చేకూరుతుంది.
  • ఇతర కార్పొరేషన్లు వ్యర్థ పదార్థాలను ఒక పద్ధతి ప్రకారం భూమిలో పాతిపెట్టే పనిచేస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక పొర వ్యర్థ పదార్థాలు వేసిన తర్వాత.. గ్రావెల్ వేయాలి. ఇలా చేస్తే త్వరగా భూమిలో కలిసిపోతాయి. వ్యాధులు ప్రబలే అవకాశం ఉండదు. కనీసం రెండుమూడు రోజులకోసారి అక్కడ బ్లీచింగ్ పౌడర్‌ను చల్లాల్సి ఉంది.
  • కొన్ని చోట్ల సేకరించిన చెత్తను అక్కడే తగులబెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా తరచూ చేయటం వల్ల సమీప ప్రాంతాల ప్రజలకు ఆస్త్మా వచ్చే అవకాశం ఉంది.
  • పనికి రాదని పడేసే చెత్త నుంచి ఉపయోగపడే వాటిని విడదీసి ఆదాయం ఆర్జించేందుకు ఉద్దేశించిన వినూత్న పథకానికి విశాఖపట్నంలో ఇండియన్ టొబాకో కంపెనీ శ్రీకారం చుట్ట్టింది. చెత్తలో 30% వరకు ఉండే పొడిచెత్త, కాగితాలు, ప్లాస్టిక్, ఇనుము, ఇతర లోహ వస్తువులను ప్రత్యేక సంచుల్లో నిల్వ ఉంచితే వాటి బరువు ప్రకారం డబ్బు చెల్లించి నిర్ణీత కాల వ్యవధుల్లో తీసుకువెళతారు.ఈ పథకం వల్ల 30% చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా ఆదా చేసినట్లే, తద్వారా అక్కడ అంతమేర స్థలం మిగులుతుంది.ఈ పథకం వల్ల మునిసిపాలిటీపై ఒక్క పైసా భారం లేకపోగా 30% చెత్త తరలింపునకు అయ్యే ఇంధన వ్యయం, సమయం వంటివన్నీ ఆదా అవుతాయి.పొడిచెత్తకు కిలో రూ.2 నుంచి రూ.4 వరకు చెల్లించి, ఇళ్ల వద్దే కొనుగోలు చేస్తారు.కాగితాన్ని పునర్వినియోగం చేయడం ద్వారా విలువైన వృక్షాలను కాపాడి పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతారు.
  • పెరుంగుడిలో చెత్త ద్వారా ఎరువులు, ఇటుకలు తయారు చేస్తున్నారు.సైడ్రో ఏర్ టెక్నానిక్ సంస్థ చెన్నయ్ కార్పొరేషన్ నుండి టన్ను చెత్తను రూ.15 వంతున కొనుగోలు చేస్తుంది.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=చెత్త&oldid=812791" నుండి వెలికితీశారు