Jump to content

అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం

వికీపీడియా నుండి
(ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం నుండి దారిమార్పు చెందింది)
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం
అటాటార్క్ టర్కీ పిల్లలకు టర్కిష్ వర్ణమాల, ఇస్తాంబుల్ (ఆసియా వైపు) లోని విగ్రహం నేర్పుతోంది.
జరుపుకొనేవారుప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ సంస్థలు
జరుపుకొనే రోజుఅక్టోబర్ 5
సంబంధిత పండుగఉపాధ్యాయుల దినోత్సవం
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 5న ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో విద్యాలయాలలో వేడుకగా నిర్వహిస్తారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994వ సంవత్సరం నుండి అక్టోబరు 5 నుండి జరుపుచున్నారు.[1]

చరిత్ర

[మార్చు]

అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 1966 సెప్టెంబర్‌ 21 నుండి 15 రోజుల పాటు పారిస్‌లో ఉపాధ్యాయుల పరిస్థితిపై ప్రత్యేకంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. అనేక దేశాలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ, వివిధ ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఆ సదస్సు ఉపాధ్యాయుల హోదా పెంచడానికి వారి హక్కులు, బాధ్యతలకు సంబంధించి కొన్ని నిర్దిష్ట సిఫారసులతో సమగ్రమైన పత్రాన్ని ఆమోదించింది. 'స్టేటస్‌ ఆఫ్‌ ది టీచర్స్‌' పత్రాన్ని ఆమోదించిన అక్టోబరు 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి, సదరు సిఫార్సుల అమలును ప్రతిఏటా సమీక్షించాలని నిర్ణయించింది.[2]

కార్యక్రమాలు

[మార్చు]

ఈ రోజున ఒక విద్యా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు లేక పలు విద్యాసంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు ఒకచోట సమావేశమై తమ భవిష్యత్ తరాలకు కావలసిన ఏర్పరుచుకోవాల్సిన పలు అంశాలపై చర్చిస్తారు. ఇందుకోసం తమ అందరి మద్దతుతో హామీలను పొందేందుకు సన్నద్ధమవుతారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవంనే కొన్ని దేశాలలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.[3][4]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "World Teachers' Day - 5 October 2017". UNESCO. Retrieved 2017-10-06.
  2. http://m.navatelangana.com/article/net-vyaasam/638637
  3. Power, Colin (2014). The Power of Education: Education for All, Development, Globalisation and UNESCO. New York: Springer. p. 191. ISBN 9789812872210.
  4. "Frequently Asked and Questions | Education | United Nations Educational, Scientific and Cultural Organization". www.unesco.org. Archived from the original on 2018-09-08. Retrieved 2017-10-06.

బయటి లింకులు

[మార్చు]