ప్రపంచ టెలి కమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ టెలి కమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవం
యితర పేర్లుప్రపంచ టెలి కమ్యూనికేషన్ దినోత్సవం, ప్రపంచ సమాచార సొసైటీ దినోత్సవం
జరుపుకొనేవారుఇంట‌ర్నేష‌నల్ టెలి క‌మ్యూనికేష‌న్స్ యూనియ‌న్
జరుపుకొనే రోజుమే 17
ఉత్సవాలుమే 17
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

ప్రపంచ టెలి కమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 17న నిర్వహించబడుతుంది. సాంకేతికత (టెక్నాలజీ) ద్వారా వచ్చే అవకాశాలపై అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.

చరిత్ర[మార్చు]

టెలి కమ్యూనికేషన్ దినోత్సం: మొద‌టిసారిగా మే 17, 1968లో ప్ర‌పంచ టెలిక‌మ్యూనికేష‌న్ దినోత్స‌వం జ‌రుపుకున్నారు. మే 17న అంత‌ర్జాతీయ టెలిగ్రాఫ్ యూనియ‌న్ స్థాపించారు. అలాగే మొద‌టి అంత‌ర్జాతీయ టెలిగ్రాఫ్‌ క‌న్వెన్షెన్‌ పై 1865 మే 17న పారిస్‌లో సంత‌కం చేశారు. అందువ‌ల్ల మే 17ను ప్ర‌పంచ టెలిక‌మ్యూనికేష‌న్ దినోత్స‌వంగా ప్ర‌క‌టించారు.[1]

సమాచార సొసైటీ దినోత్సవం: 2005లో ట్యూనిస్‌లోని ఇన్ఫర్మేషన్ సొసైటీపై ప్రపంచ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ సమాచార సొసైటీ దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య తీర్మానం ద్వారా ప్రకటించబడింది.[2]

2006, నవంబరులో టర్కీలోని అంటాల్యాలో జరిగిన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్లీనిపోటెన్షియరీ కాన్ఫరెన్స్ లో ఈ రెండింటిని కలిపి ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ టెలి కమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించబడింది.[3]

లక్ష్యాలు[మార్చు]

సుదూర ప్రాంతాల మ‌ధ్య దూరాన్ని త‌గ్గంచేలా క‌మ్యూనికేష‌న్‌ని వ్యాప్తి చేయ‌డ‌మే ఈ దినోత్స‌వం ముఖ్యోద్దేశం. మ‌న జీవితంలో క‌మ్యూనికేష‌న్ ఎంత కీల‌క‌మైన‌దో అవ‌గాహ‌న పెంచ‌డం, ఈ రంగంలో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధిప‌ర‌చ‌డం వంటివి ఈ దినోత్స‌వం ప్ర‌ధాన ల‌క్ష్యాలు.

మూలాలు[మార్చు]

  1. సాక్షి, ఎడ్యుకేషన్ (12 May 2020). "మే 17న ప్ర‌పంచ టెలిక‌మ్యూనికేష‌న్ డే". www.sakshieducation.com. Archived from the original on 14 July 2020. Retrieved 14 July 2020. CS1 maint: discouraged parameter (link)
  2. United Nations. "World Telecommunication and Information Society Day". www.un.org (in ఇంగ్లీష్). Retrieved 14 July 2020. CS1 maint: discouraged parameter (link)
  3. "World Telecommunication and Information Society Day EN". United Nations. Retrieved 14 July 2020. CS1 maint: discouraged parameter (link)

ఇతర లంకెలు[మార్చు]