ప్రపంచ తేనెటీగ దినోత్సవం
(ప్రపంచ తేనెటీగ రోజు నుండి దారిమార్పు చెందింది)
ప్రపంచ తేనెటీగ దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | ప్రపంచవ్యాప్తంగా |
ప్రారంభం | మే 20, 2018 |
ఆవృత్తి | వార్షికం |
ప్రపంచ తేనెటీగ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. జీవావరణవ్యవస్థలో తేనెటీగలు, ఇతర పరాగరేణు సంపర్క కారకాల పాత్రను గుర్తుచేసుకోవడంకోసం తేనెటీగల తొలి అధ్యాపకుడిగా, తొలి గ్రంథ రచయితగా పేరొందిన అంథొన్ జంసా గుర్తుగా ఆయన పుట్టినరోజున ఈ దినోత్సవం నిర్వహించబడుతోంది.[1]
చరిత్ర
[మార్చు]1934, మే 20న తేనెటీగల పెంపకంలో నిపుణుడైన అంథొన్ జంసా స్లొవేనియాలో జన్మించాడు. 2017, డిసెంబరులో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు, మే 20ను ప్రపంచ తేనెటీగ రోజుగా గుర్తించాలన్న స్లోవేనియా ప్రతిపాదనను అమోదించాయి.[2] మానవాళికి ఎంతో మేలు చేసున్న తేనెటీగలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న ఉద్ధేశ్యంతో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది.[3] 2018, మే 20న తొలిసారిగా ప్రపంచ తేనెటీగ దినోత్సవం జరుపబడింది.[4]
కార్యక్రమాలు
[మార్చు]- తేనెటీగల సంరక్షణ, యాజమాన్యం అనే అంశాలపై సదస్సులు నిర్వహిస్తారు.
- క్షేత్ర పర్యటనలో భాగంగా తేనెటీగలను పెంచే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలంలో ప్రత్యక్షంగా చూపిస్తారు. తేనె తయారీ విధానం, తేనెలో ఉండే పోషక విలువలు వాటి ఆరోగ్య ప్రాధాన్యత, ప్యాకింగ్ మొదలైనవి నేర్పిస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ UN page about World Bee Day
- ↑ On Slovenia’s initiative, the UN proclaims May 20 as World Bee Day
- ↑ ఆంధ్రభూమి, ఫీచర్స్ (19 May 2019). "మకరందం ఇస్తున్నా మనుగడ కరువు!". www.andhrabhoomi.net. కె.రామ్మోహన్‌రావు. Archived from the original on 27 మే 2019. Retrieved 7 July 2020.
- ↑ సాక్షి, ఫ్యామిలీ (20 May 2018). "తేనెటీగలకూ ఓ రోజుంది!". Sakshi. Archived from the original on 7 July 2020. Retrieved 7 July 2020.