ప్రయాణీకుడు

వికీపీడియా నుండి
(ప్రయాణికులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వాహనంలో ప్రయాణం చేసే వ్యక్తిని ప్రయాణీకుడు అంటారు. ప్రయాణీకుడికి బహువచనం ప్రయాణీకులు. ప్రయాణీకులు కొన్ని అవసరాల దృష్ట్యా ఒక చోట నుంచి మరొక చోటుకి అనగా చేరవలసిన గమ్యానికి ప్రయాణం చేస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సు స్టేషను (శ్రీనివాసా బస్సు స్టేషను) - తిరుపతి


విద్యార్థులు

[మార్చు]
బస్సు ఎక్కుతున్న ప్రయాణీకులు (ప్రయాణిక విద్యార్థులు)

విద్యార్థులు చదువుతున్న విద్యాలయం వీరు నివసిస్తున్న గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లయితే ప్రతి రోజు వివిధ వాహనాలలో ప్రయాణించి తమ విద్యాలయానికి చేరుకుని తిరిగి సాయంత్రానికి తమ ఊరికి చేరుకుంటారు. ప్రతిరోజు ప్రయాణించే విద్యార్థులకు ఆర్టీసీ సంస్థవారు రాయితీ ద్వారా లేదా ఉచితంగా పాస్ లను ఇస్తారు.

విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలు

[మార్చు]

ప్రతిరోజు ప్రయాణించి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించే రాయితీలతో పాటు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. శెలవు దినాలలో విద్యార్థులకు ఆర్టీసీ వారు ఇచ్చిన పాసులు చెల్లవు. కొన్ని సందర్భాలలో ఆ రోజు శెలవో కాదో విద్యార్థులకు కాని ఆర్టీసీ యాజమాన్యానికి కాని తెలియదు. ఉదయాన్నే స్కూలకు బయలు దేరిన విద్యార్థులు పాసులు చూపించి బస్సులో ప్రయాణిస్తారు విద్యాలయాలకు వెళ్ళి తమ విద్యాసమయం పూర్తయిన తరువాత సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి బస్సు ఎక్కబోయేటప్పుడు విద్యార్థులతో బస్సు మార్గదర్శకుడు అంటాడు ఈ రోజు గాంధీ జయంతి పాసులు చెల్లవు అని.