Jump to content

ప్రేమవిజయం

వికీపీడియా నుండి
(ప్రేమ విజయం నుండి దారిమార్పు చెందింది)
ప్రేమవిజయం
(1936 తెలుగు సినిమా)
దర్శకత్వం కృత్తివెన్ను నాగేశ్వరరావు
రచన కృత్తివెన్ను నాగేశ్వరరావు
కథ కృత్తివెన్ను నాగేశ్వరరావు
తారాగణం రంగారావు,
పి.ఎస్.శర్మ,
పి.రామారావు,
కె.రంగారావు,
ఎమ్.రామచంద్రమూర్తి,
నూకరాజు,
రాజ్యం,
బి.రాజలక్ష్మి
సంగీతం మనువంటి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ కృత్తివెన్ను బ్రదర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ప్రేమవిజయం తెలుగులో మొదటి సాంఘిక చిత్రం.[1] అప్పటిలో పౌరాణిక చిత్రాలే వస్తు ఉండేవి. ఇండియన్ మూవీటోన్ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. కృత్తివెంటి నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ప్రేమ విజయం చిత్రం అపజయం పాలు కావడంతో ఆ చిత్రానికి సంబంధించిన చాలా వివరాలు మరుగున పడిపోయాయి. కానీ లభిస్తున్న సమాచారం ప్రకారం ఆ చిత్రానికి ప్రముఖ భావకవి వేదుల సత్యనారాయణ శాస్త్రి సాహిత్యం సమకూర్చారని, ప్రభల కృష్ణమూర్తి కథానాయకునిగా నటించారని మాత్రం తెలుస్తోంది. పౌరాణికాలకు అలవాటుపడ్డ అప్పటి ప్రేక్షకులు సమకాలీన వ్యక్తుల ప్రేమను అంగీకరించే స్థాయికి చేరుకోలేకపోవడమే దీనికి కారణం కావచ్చు. ఆ తర్వాత మరో రెండు సంవత్సరాలవరకూ ( 1938 ) సాంఘిక చిత్రాలను నిర్మించే ధైర్యం ఎవరికీ లేకపోయింది. గూడవల్లి రామబ్రహ్మం 'మాలపిల్ల ' వరకూ ఈ స్తబ్దత కొనసాగింది. అయితే సమకాలీన సమస్యల మీద కూడా చిత్రాలు నిర్మించవచ్చనే ఆలోచనను నిర్మాతలలో కలిగించి తర్వాత కాలంలో సాంఘిక చిత్రాల నిర్మాణానికి ' ప్రేమ విజయం ' చిత్రం బాటలు వేసిందని చెప్పవచ్చు.[2]

అప్పటికే ప్రసిద్ధమైన ‘కాలేజ్‌ గర్ల్‌’ అనే నాటకాన్ని ఆధారం గా చేసుకొని రూపొందించిన ఈ చిత్రంలో కళాశాల జీవితం, విద్యార్థినీ విద్యార్థుల మధ్య వికసించే ప్రేమ, స్థానిక ఎన్నికల లాంటి అనేక సమకాలీన పరిస్థితులు ప్రస్తావనకు వచ్చాయి. ఆనాటి సమాజంలో ఎక్కువగా చర్చనీయాంశమైన వితంతు వివాహాల అంశం కూడా కథలో ప్రధానాంశమైంది. సాంకేతిక నిపుణుడైన ద్వారకానాథ్‌ ప్రజ్ఞ అండగా, అప్పటి రంగస్థల ప్రముఖుడు కృత్తివెంటి నాగేశ్వరరావు నిర్దేశకత్వంలో ‘ఇండియన్‌ ఆర్ట్‌ సినీటోన్‌’ పతాకంపై ఈ చిత్రం తెర మీదకు వచ్చింది. అటు ఇతివృత్తంలోనూ, ఇటు పాత్రలు ఎదుర్కొనే సమస్యల్లోనూ ఈ తొలి తెలుగు సాంఘిక చిత్రం అలా సమకాలీనతను చూపడం విశేషమే.[3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]

మొట్టమొదటి తెలుగు సాంఘిక చిత్రం ప్రేమవిజయం మ్యూజిక్ డైరెక్టర్ కాకినాడ నివాసి గాయక సామ్రాట్ బిరుదాంకితులు శ్రీమునుగంటి వెంకటరావు పంతులుగారు.