బహువ్రీహి సమాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బహువ్రీహి సమాసము ఒక తెలుగు సమాసము. కర్మధారయము కన్న - కల అను అర్ధము ఎక్కువగా నున్న, బహువ్రీహి సమాసము. రెండు పదముల అర్ధములేక వేరైన మరొక అర్ధము ప్రధానమైన బహువ్రీహి సమాసము. పీత + అంబర - అనుపదములకు పచ్చని వస్త్రమని అర్ధమైనను - వీటి కలయికచే వేరొక అర్ధము స్పురించు చున్నది. అన్యపదార్ధము ప్రధానమైనది బహువ్రీహి. పీతాంబరుడు - పచ్చనివస్త్రము కలవాడు. ఇందు విగ్రహ వాక్యమున కలది కలవాడు అనివచ్చును. ఇది యెప్పుడును విశేషణమే కాన విశేష్యమును బట్టి లింగవచన విభక్తులుండును.[1]

కమాలాక్షుడు = కమలముల వంటి కన్నులు కలవాడు (విష్ణుమూర్తి)

పద్మాలయ = పద్మము నిలయముగా కలది (లక్ష్మి).

ఉదాహరణలు[మార్చు]

  • పీతాంబరుడు - ఇక్కడ పీత అంటే పసుపు రంగు, అంబరము అంటే వస్త్రం, ఈ రెండు అర్థాలు కాకుండా పసుపు రంగు ధరించినవాడు విష్ణువు అనే మరొక వ్యక్తిని సూచిస్తుంది. కావున ఇది అన్యపద ప్రధానం.
  • కమలాక్షుడు - కమలముల వంటి కన్నులు కలవాడు (విష్ణుమూర్తి)
  • పద్మాలయ - పద్మమును నిలయంగా కలది (లక్ష్మి)

మూలాలు[మార్చు]