Jump to content

బాల్యవివాహాలు

వికీపీడియా నుండి
(బాల్య వివాహం నుండి దారిమార్పు చెందింది)
రాష్ట్రాల వారీగా బాల్యవివాహాలకు సంబందించిన లెక్కలు

బాల్య వివాహము అనగా యుక్త వయసు రాక మునుపు అనగా బాల్య దశలో చేసే వివాహము. నేడు చట్ట ప్రకారము 18 సంవత్సరాల వయసు నిండని అమ్మాయికి, 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి జరిగే వివాహమును బాల్య వివాహముగా చెప్పవచ్చు. పూర్వము బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. దీనికి పెక్కు కారణములున్నవి.

ఫ్రెంచివారు, పోర్చుగీసు వారు, డచ్ వారు, బ్రిటీషు వారు మొదలైన విదేశీయులు భారతదేశాన్ని పాలించు కాలంలో కొంతమంది విదేశీ అధికారులు భారతీయ కన్యలను బలవంతంగా వివాహమాడేవారు లేదా చెరచేవారు. వివాహితులను ఎత్తుకెళ్ళరని భావించిన భారతీయులు తమ పిల్లలకు బాల్యంలోనే వివాహం చేసేవారు.

కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలను పటిష్ఠపరచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో పలానావాడికి భార్య పుట్టిందని ఇరువర్గాలవారు నిర్ణయించేసుకొని పిల్లలు కొంచెం పెద్దవారవ్వగానే వివాహం చేసేవారు.

కుటుంబాలలోని వృద్ధుల కోరిక మేరకు వారు చనిపోయేలోపు తమ వారసుల పెళ్ళిళ్ళు చూడాలనే కోరికను తీర్చడానికి కూడా బాల్యవివాహాలు జరిపించేవారు. మరికొన్ని కుటుంబాల్లో పిల్లలు యుక్తవయసు (Teenage) కు వచ్చిన తర్వాత వక్ర మార్గాల్లో ప్రయాణిస్తారనే భావనతో ముందు జాగ్రత్తగా బాల్యవివాహాలు జరిపించేవారు.

బాల్య వివాహం జరిపించినప్పటికీ అమ్మాయి యుక్త వయసుకు వచ్చిన తర్వాత మాత్రమే కాపురానికి పంపింఛేవారు. ఇలా చేయడం వల్ల అమ్మాయికి అబ్బాయికి ఒకరిపై ఒకరు ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి జీవితం గడపాల్సివచ్చేది. అయితే కొన్ని కుటుంబాల్లో అమ్మాయికి ఊహ తెలిసినా తెలియకపోయినా వయసులో ఎక్కువ తేడా ఉన్న వ్యక్తులతో కూడా ఈ వివాహాలు జరిపించేవారు. ఒక వేళ వయసులో ఎక్కువ తేడా వల్ల పురుషుడు ముందుగా చనిపోయినప్పటికీ పునర్వివాహాలు ఉండేవి కావు. అందువల్ల అమ్మాయి చిన్నవయసులోనే బాల వితంతువుగా మారి జీవితాంతం అలాగే ఉండాల్సివచ్చేది.

రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘసంస్కర్తల కృషి ఫలితంగా రాను రాను ప్రజల్లో బాల్యవివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెరిగి బాల్యవివాహాలను నిషేధించడం, పునర్వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో అక్కడక్కడా అడపాదడపా ఇలాంటి బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.

రాజా రామ్మోహన్ రాయ్

విశేషాలు

[మార్చు]
  • బ్రిటిష్ పాలకులు1929 లో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెంక్ట్ యాక్ట్ తెచ్చారు.
  • ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006 ప్రకారం 18 ఏళ్ల లోపు ఆడపిల్లలు, 21 ఏళ్ల లోపు మగపిల్లలు బాలలకిందే వస్తారు.
  • బాల్యవివాహంగురించి సమాచారం తెలిసిన ఎవ్వరైనా ఫిర్యాదు చేయవచ్చు. పోలీసులు, జిల్లా కలెక్టర్, ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లేదా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇలా ఎవరికైనా ఫిర్యాదు చేయవచ్చు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. నోటిమాటగా చెప్పవచ్చు. ఉత్తరం రాయవచ్చు ఈ మెయిల్ చేయవచ్చు.
  • బాల్యవివాహం చేసిన వారెవరైనా నేరస్థులే. తల్లిదండ్రులు, సంరక్షుకులు, పురోహితులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారు, బాల్య వివాహానికి అనుమతించిన కులపెద్దలు, వివాహ ఏర్పాట్లకు సహకరించిన వారందరూ నేరస్థులే..పెళ్లికి హాజరైనవారుకూడా నేరస్థులవుతారు.
  • నేరస్థులకు రెండేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడవచ్చు. లక్షరూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం బాల్యవివాహాలను నిలుపుదల చేస్తూ కోర్టు ఇంజెంక్షన్ ఆర్డర్ ఇవ్వవచ్చు. ఈ నేరాలకు బెయిల్ కూడా ఉండదు.
  • బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చట్ట ప్రకారం జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్ స్ధాయిలో ఆర్‌డీవో, ప్రాజెక్ట్ స్థాయిలో (మూడు నుంచి ఐదు మండలాలు) సీడీపీవోలు ఉన్నా రు. మండల స్థాయిలో తహసీల్దార్లు, గ్రామస్ధాయిలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఏవోలు, బాధ్యులు. బాల్య వివాహాల సమాచారం లిఖితపూర్వకంగా, టెలిఫోన్, టెలిగ్రామ్, సెల్‌ఫోన్ ఎస్ఎంఎస్ ద్వారా వచ్చినా అధికారులు స్పందించాల్సి ఉంటుంది. వివాహ నమోదు చట్టంతో చెక్ బాల్య వివాహాలను అడ్డుకొనేందుకు 'వివాహ నమోదు చట్టం' (మ్యారేజ్ రిజ్రిస్టేషన్ యాక్ట్) నిబంధన కచ్చితంగా అమలు జరపాలి.వధూవరుల వయస్సు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తేనే రిజిస్టర్ మ్యారేజ్ చేస్తారు.
  • గ్రామ స్ధాయిలో బాల్య వివాహలను అడ్డుకునేందుకు విలేజ్ మానిటరింగ్ కమిటీ ఉంది. కమిటీ ఛైర్మన్‌గా పంచాయతీ సర్పంచ్, కన్వీనర్‌గా అంగన్‌వాడీ వర్కర్, సభ్యులుగా పంచాయతీ కార్యదర్శి, వీఏవో, పాఠశాల ఉపాధ్యాయుడు, ఏఎన్ఎం, వార్డు మెంబరు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఉంటారు.

(Baalya vivahaalu neramu Say no to child marriages)

లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]