బిహూ నృత్యం

వికీపీడియా నుండి
(బిహు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని బిహు నృత్యం వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
బిహూ
బిహూ
అస్సాంకు చెందిన బిహూ
అధికారిక పేరుబిహూ
యితర పేర్లురొంగలి బిహు (ఏప్రిల్) • కటి బిహు (అక్టోబరు) • భోగాలీ బిహు (జనవరి)
జరుపుకొనేవారుఅస్సామీ ప్రజలు
రకంప్రాంతీయ జానపదం
జరుపుకొనే రోజుబోహాగ్, కాటి, మాఘ్ మాసాల్లో
సంబంధిత పండుగడిమాసాస్‌కు చెందిన బుషు
ఆవృత్తిత్రై-వార్షిక

బిహూ నృత్యం ఈశాన్య భారత దేశములో గల అస్సాం రాష్ట్రమునకు చెందిన జానపద నృత్య రీతి. ఈ వినోద నృత్యంలో నాట్యకారులు సంప్రదాయమైన అస్సామీ పట్టు, ముగా పట్టు దుస్తులు ధరిస్తారు. బిహూ పాటలకు అనుగుణంగా బిహూ నృత్యాన్ని చేస్తారు. బిహూ పాటలు అస్సామీ కొత్త సంవత్సరాన్ని అహ్వనించడం దగ్గర నుంచి రైతు జీవన శైలిని వర్ణించే వరకు వివిధమైన అంశాలను వివరిస్తాయి. బొహాగ్ బిహు (వసంత ఋతువులో వచ్చే బిహు) సమయంలో ఈ నాట్యన్నిచేస్తారు, హుసొరీ (నాట్య కారుల గుంపు) ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి నాట్యం చేసి, తరువాత ఇంటిల్లి పాదికి ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ తర్వాత ఇంటిల్లి పాది హుసోరీ కి నమస్కారం చేసి దక్షిణ ఇస్తారు, దక్షిణలో ఒక గమొసా, పచ్చి వక్క, తమలపాకు, డబ్బులు ఉంటాయి.[1]

"పెపా"తో బిహూ నర్తకుడు

బిహూలో వంటకాలు

[మార్చు]

బిహూలో రక రకలైన పిఠా (బియ్యంపిండితో బెల్లం కలిప్ చేసే ఒక పిండి వంట) లు తయారు చేస్తారు.

  • తిల్ పిఠా (బియ్యంపిండితో రొట్టెలా చేసి అందులో నువ్వులు, బెల్లం పెట్టి చుడుతారు)
  • ఘిలా పిఠా
  • హుతులి పిఠా
  • సుంగా పిఠా
  • నారికొలోర్ లారు (కొబ్బరి లడ్డు)
  • నారికోలోర్ పిఠా (బియ్యంపిండితో రొట్టెలా చేసి అందులో కొబ్బరి, పంచదార పెట్టి చుడుతారు)
  • భాత్ పిఠా

అల్పాహారాలు

[మార్చు]
  • బొరా సావుల్ (జిగురుగా ఉండే ఒక రకమైన బియ్యం)
  • కుమోల్ సావుల్ (
  • సిరా (అటుకులు)
  • మురి (మరమరాలు)
  • అఖోయ్
  • హాన్దో (హన్దో అనే ఒక రకమైన బియ్యపు పిండి)
  • దోయ్ (పెరుగు)
  • గూర్ (బెల్లం)

బిహూ లో ఉపయోగించే వాద్యాలు

[మార్చు]
  • ఢోల్ (డోలు)
  • తాల్
  • పెపా (ఎద్దు కొమ్ముతో చెయబడే ఒక వాద్యం)
  • టొకా (వెదురుని మధ్యకి చీల్చి ఒక వైపు అతికి ఉండేట్టుగా చేసి చిడతలులాగా వాయించే వాద్యం)
  • బాహి (వేణువు)
  • హుతులి (చిన్న వాద్యం)
  • గొగొనా (పళ్ళతో పట్టుకుని పక్కలను చేతులతో వాయించే చిన్న వాద్యం)

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్

[మార్చు]

అస్సాంలో గౌహతిలోని సరుసజై స్టేడియంలో 2023 ఏప్రిల్ 13న 11 వేల మంది కళాకారులు, డ్రమ్మర్లు, నృత్యకారులతో బిహు నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. దీంతో బిహు నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Assam Bihu Dance Guinness World Record : ప్రపంచరికార్డులను సృష్టించిన బిహూ నృత్యం | ABP Desam". telugu.abplive.com. 2023-04-14. Retrieved 2023-04-15.
  2. "Wayback Machine". web.archive.org. 2023-04-15. Archived from the original on 2023-04-15. Retrieved 2023-04-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)