బుధుడు (జ్యోతిషం)

వికీపీడియా నుండి
(బుధుడు జ్యోతిషం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బుధ
Member of నవగ్రహాలు
బుధ, బ్రిటిష్ మ్యూజియం - 13వ శతాబ్దం, కోణార్క్
మెర్క్యురీ
Preserver of nature [1]
అనుబంధంగ్రహం, హిందూ దేవుడు
నివాసంబుధలోకం
WorldMercury
Dayబుధవారం
భర్త / భార్యIla[2]
పిల్లలుపురూరువులు
వాహనంYali lion, or chariot hauled by eight horses of deep yellow colour
తండ్రిచంద్రుడు
తల్లితార

బుధ నపుంసక గ్రహం.రుచుల కారకత్వం కలిగిన వాడు. ఇరవై వయసున్న వారిని సూచిస్తాడు. వర్ణం ఆకు పచ్చ, జాతి వైశ్య, అధి దేవత విష్ణువు, గుండ్రని ఆకారం, పరిమాణం పొడుగు, ప్రకృతి కఫ, వాత, పిత్తములు కల వాడు. శరధృతువును ఉత్తర దిక్కునూ, సూచిస్తూ, పృధ్వీ తత్వం కలిగిన వాడు, గ్రహ సంఖ్య అయిదు, రత్నం పచ్చ, లోహం, ఇత్తడి, కంచు, గుణం రజో గుణం కలిగిన వాడు. లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. ఆశ్లేష, మూల, రేవతి నక్షత్రములకు బుధుడు అధిపతి. మిధున కన్యా రాశులకు అధిపతి. బుధుడు కన్యారాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ ఉచ్ఛ స్థితిని పొందుతాడు. మీనరాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ నీచను పొందుతుంది. కన్యారాశిలో పదిహేను ఇరవై డిగ్రీలు మూల త్రికోణము ఔతుంది. బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్రులు. సింహరాశి, వృషభరాశి, తులారాశులు మిత్ర స్థానములు. చంద్రుడు శత్రువు. కర్కాటక రాశి శత్రు స్థానం. బుధ గ్రహ దశ పదిహేడు సంవత్సరాలు. బుధుడు ఏడవ స్థానం మీద మాత్య్రమే దృష్టిని సారిస్తాడు.

బుధుడు స్వభావరీత్యా శుభుడు, తత్వము భూతత్వం, గ్రహ స్వభావం, ఒంటరిగాపాపి శుభగ్రహములతో చేరిన శుభుడు. జీవులు పక్షులు, గ్రహ స్థానం క్రీడాస్థలాలు, జలతత్వం జలభాగం, ఆత్మాధికారం వాక్కు, పాలనా శక్తి రాకుమారుడు, గ్రహపీడ బంధువుల వలన బాధలు, గ్రహ వర్గం శని, గృహంలో భాగములు పఠనా మందిరం, దిక్బలం తూర్పు, నివాస ప్రదేశములు జనావాసాలు, చెట్లు ఫలములు లేని చెట్లు, పండ్లు సీమ చింత, ధాన్యం పెసలు, పక్షులు చిలుక, గబ్బిలం, జంతువులు మేక గొర్రె, ఇతర వస్తువులు నగలు, మిశ్ర లోహములు. వస్త్రం తడి వస్త్రం, దేవ వ్ర్గం శైవ, గ్రహ వేదం అధ్ర్వణ వేదం, గ్రహ గోత్య్రం ఆత్రేయ, అర్ధశుభుడు, అవతారం బుద్ధావతారం, గ్రహవర్ణం తాళపత్ర వర్ణం, వారం బుధవారం, మన స్థితి సాత్వికం, బలంగా ఉంటే వాక్చాతుర్యం బుద్ధి జ్ఞానం, ఋషి నారాయణుడు.

బుధుడి ప్రభావం

[మార్చు]

బుధ ప్రభావితులు పొట్టిగా ఉంటారు. చురుకుగా ఉంటారు. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వృద్ధాప్యంలో కూడా యవ్వనంతో కనిపిస్తారు. దీర్ఘాలోచ కల వారు, మేధా సంపత్తి కల వారుగా ఉంటారు. సందేహ ప్రవృత్తి కలవారుగా ఉంటారు. విషయ జ్ఞానం అందు ఆసక్తులు. రచయితలు, కళాకారులుగా ఉంటారు. తలనిప్పి, తల నొప్పి, అల్సర్ వ్యాధి పీడితులయ్యే అవకాశం ఉంది. ప్రసార రంగంలోనూ, కళారంగంలోనూ, గణికులుగా ఉంటారు.

బుధుడు వాక్కుకు, మేనమామకు, మేనకోడలికి, మేనల్లుడికి, మాతా మహులకు కారకత్వం వహిస్తున్నాడు. ఉపన్యాసంలో నైపుణ్యం, లలిత కళలు, గణిత శాసత్రం, వాణిజ్యం, అర్ధ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వ్యాపార శాస్త్రం, వ్యాకరణం, జ్యోతిషం, వివిధరకాల భాషలు, శిల్పి, మంత్రం, తంత్రం, వివేకం, పుస్తక పచురణ, గ్రంథాలయం మొదలైన వాటికి కారణం. దౌత్యం, వైద్యం, మధ్యవర్తిత్వం మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. వైష్ణవులు, వైష్ణవ భక్తి, వైష్ణవాలయం మొదలైన వారికి కారకత్వం వహిస్తాడు. నాభి, నరము, స్వరపేటిక, చర్మమును సూచిస్తాడు కనుక నరముల బలహీనత, మూర్చ, చ్చెముడు, మెదడుకు సంబంధించిన వ్యాదులకు కారకత్వం వహిస్తాడు. సకల విధ ఆకు కూరలు, కాయ కూరలకు కారకత్వం వహిస్తాడు. సభా నిర్వాహకులు, ప్రజాసంబంధిత వ్యవహారికులు, ప్రచారకులు, ఉపన్యాసకులు, ఉపాద్యాయులు, న్యాయవాదులు మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. వాక్సంబంధిత వృత్తులకు బుధుడు కారకుడు. మేధావులు, పండితులు, చరిత్రకులు, గుమస్తాలు, చిత్రకారులు, రాయబారులు, విద్య, గణికులు, దస్తూరి, నవలలు, వ్యాసాలు, కల్పితాలు, చిన్న పుస్తకములు, యువకులు, ప్రకటనలు, వాహనములు, వ్యాపారం, నిఘంటువులు, సత్యవాదముకు బుధుడు కాకత్వం వహిస్తాడు.

బుధుని రూపురేఖలు

[మార్చు]

బుధుడు దుర్వాదళ దేహకాంటి కలిగిన వాడు. నాలుగు భుజములు కలిగి పీత వస్త్రములను ధరించి పసుపు పచ్చని మాలా ధారణ చేసి గద, కత్తి, డాలు ఆయుధములను చేత పట్టి ఉంటాడు. బుధుడు సింహమును అధిరోహించి ఉంటాడు.

బుధుని పూజించు విధానం

[మార్చు]

బుధుడిని పూజించుటకు బంగారు ప్రతిమను చేయాలి. పాలతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. అధిదేవత విష్ణువు, అధిష్టాన దేవత దుర్గ. ప్రసాదము పులిహోర, వడపప్పు, దోషనివారణకు దానం చేయవలసిన లోహం బంగారం. బుధుడికి శ్రావణ్ శుక్ల పంచమి, వైశాఖ పూర్ణిమ, ఆచరించ వలసిన వ్రతం సత్యనారాయణ వ్రతం, పారాయణ చేయవలసిన గ్రంథం దేవీ భాగవతం, పారాయణ చేయవలసిన బుధగ్రహ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్ర నామం, ధరించవలసిన మాల తులసి మాల, తీసుకోవలసిన దీక్ష గోవింద దీక్ష, ధరించ వలసిన రుద్రాక్ష చతుర్ముఖ రుద్రాక్ష, దర్శించ వలసిన ఆలయాలు విష్ణాలయం దుర్గాలయం, పూజ దుర్గా పూజ, దానం చేయవలసిన వాస్థువులు పెసలు ఆకు పచ్చని వస్త్రాలు, ఆసనం బానాకారం, గ్రహ శాంతికి చేయ వలసిన జపం పది హేడు వేలు, హోమముకు వాడవలసిన సమిధ ఉత్తరేణి.

బుధ గ్రహ జపం (Budhagraha Japam)

ఆవాహనము:

అస్య శ్రీబుధగ్రహ మహా మంత్రస్య! కాశ్యప ఋషిః

బుధగ్రహోదేవతా త్రిష్టుప్ ఛందః బుధగ్రహ మాల మంత్ర జపం కరిష్యే!!

కరన్యాసము:

ఓం ఉద్భుద్యస్వాగ్నే ప్రతిజాగృహే - అంగుష్టాభ్యం నమః

ఓం త్వమిష్టపూర్తీ - తర్జనీభ్యాం నమః ఓం సగ్ నృజేధాంమయం చ -

మధ్యమాభ్యాం నమః ఓం అస్మిస్నదస్తే ఆవాః - అనామికాభ్యాం నమః

ఓం జయమానశ్చ సీదతి - కరతల కరపృష్టాభ్యాం నమః

అంగన్యాసము:

ఓం ఉద్భుద్యస్వాగ్నే ప్రతిజాగృహే - హృదయాయ నమః

ఓం త్వమిష్టపూర్తీ - శిరసే స్వాహా ఓం సగ్ నృజేధాంమయంచ - శిఖాయైవషట్ ఓం అస్మిస్నదస్తే ఆవాః - కవచాయహుం ఓం అద్భుతరాశ్మీన్ విశ్వదేవా - నేత్రత్రయా వౌషట్ ఓం జయమానశ్చ సీదతి - అస్త్రాయఫట్ ఓం భూర్వవస్సువరోమితి దిగ్భందః ఆదిదేవతా: ఇదం విష్ణుర్వి చక్రమే త్రేధానిదధే పదం! సమూఢ మస్యపాగ్ సురే!!

ప్రత్యథి దేవతా: సహస్ర శీర్షః పురుషః! సహస్తాక్ష సహస్ర పాత్!

నభూమిం విశ్వతో వృత్యా! అత్యతిష్ట దశాంగులమ్!!
వేద మంత్రము: అద్భుద్య స్వాగ్నే ప్రతి జాగృహ్యే! సామిష్టా పూర్తేనగ్ సృజేధామయంచ పునః కృణ్వగ్ స్త్వాపితరం యువాన మన్వాతాగ్!
సీత్వయితంతు మేతం!! బుధ కవచ స్తోత్రము పీతాంబర ధరః పాతు! పీతమాల్యానులేపనః! బుధః పాతు శిరోదేశం సౌమ్యః పాతు ఛ ఫాలకం!!

నేత్రే జ్ఞానమయః పాతు! శ్రుతీ పాతు!విభూద్భవః! ఘ్రాణం గంధ ధరః పాతు! భుజౌపుస్తక భూషితః! మద్యం పాతు సురారాద్యః! పాతునాభిం ఖగేశ్వరః! కటిం కాలాత్మజః పాతు! ఊరు: పాతు సురేశ్వరః! జానునీ రోహిణి నూను:! పాతు జంఘే ఫలప్రదః! పాదౌ బాణాసనః పాతు:! సౌమ్యౌఖిల వాపు:! ఫలశ్రుతి: ఏపోప్ కవచః పుణ్యం సర్వోపద్రవ శాంతిదః! సర్వరోగ ప్రశమనః సర్వదుఖ నివారకః! ఆయురారోగ్య శుభదః! పుత్రాపౌత్ర ప్రవర్తన:! యః పఠేత్కావచం దివ్యం శృణుయద్వా సమాహితః! సర్వాన్ కామా స్మవాప్నోతి! దీరఘమాయుశ్చ విందతి!!

బుధ మంగళాష్టకం సౌమ్యః పీత ఉదజ్ముఖ స్సమిదపామార్గోత్రి గోత్రోద్భవో: బాణేశాన దశస్సుహృద్ర విసితౌ వైరీం దురన్యే సమాః! కన్యాయుగ్మ పతిర్ధశాష్టక చతుష్టణ్ణేత్రగ శ్యోభానః! విష్ణుర్వ్టైభగదైవతో మగధవః కుర్యాత్సదా మంగళమ్!!

బుధాస్తోత్తర శతనామావళి:

ఓం బుధాయ నమః

ఓం బుధార్చితాయ నమః

ఓం సౌమ్యాయ నమః

ఓం సౌమ్యచిత్తాయ నమః

ఓం శుభప్రదాయ నమః

ఓం దృఢవ్రతాయ నమః

ఓం దృఢఫలాయ నమః

ఓం శ్రుతిజాల ప్రబోధకాయ నమః

ఓం సత్యవాసాయ నమః

ఓం శ్రేయసాంపతయే నమః

ఓం అవ్యయాయ నమః

ఓం సోమజాయ నమః

ఓం సుఖదాయ నమః

ఓం శ్రీమతే నమః

ఓం సోమవంశప్రదీపకాయ నమః

ఓం వేదవిదే నమః

ఓం వేదతత్త్వజ్ఞాయ నమః

ఓం వేదాంతజ్ఞాన భాస్వరాయ నమః

ఓం విద్యావిచక్షణ విభవే నమః

ఓం విద్వత్ప్రీతికరాయ నమః

ఓం బుధాయ నమః

ఓం విశ్వనుకూలసంచారినే నమః

ఓం విశేష వినయాన్వితాయ నమః

ఓం వివిధాగమసారజ్ఞానాయ నమః

ఓం వీర్యవతే నమః

ఓం విగతజ్వరాయ నమః

ఓం త్రివర్గ ఫలదాయ నమః

ఓం అనంతాయ నమః

ఓం త్రిదశాదిపూజితాయ నమః

ఓం బుద్ధిమతే నమః

ఓం బహుశాస్త్రజ్ఞాయ నమః

ఓం బలినే నమః

ఓం బంధవిమోచకాయ నమః

ఓం వక్రాతివక్రగమనాయ నమః

ఓం వాసవాయ నమః

ఓం వసుధాధిపాయ నమః

ఓం ప్రసాదవదనాయ నమః

ఓం వంద్యాయ నమః

ఓం వరేణ్యాయ నమః

ఓం వాగ్విలక్షణాయ నమః

ఓం సత్యవతే నమః

ఓం సత్యసంకల్పాయ నమః

ఓం సత్యబంధవే నమః

ఓం సదాదరాయ నమః

ఓం సర్వరోగ ప్రశమనాయ నమః

ఓం సర్వమృత్యునివారకాయ నమః

ఓం వాణిజ్యనిపుణాయ నమః

ఓం వశ్యాయ నమః

ఓం వాతాంగినే నమః

ఓం వాతరోగహృతే నమః

ఓం స్థూలాయ నమః

ఓం స్థిరగుణాధ్యక్షాయ నమః

ఓం అప్రకాశాయ నమః

ఓం ప్రకాశాత్మనే నమః

ఓం ఘనాయ నమః

ఓం గగనభూషణాయ నమః

ఓం విధిస్తుత్యాయ నమః

ఓం విశాలాక్షాయ నమః

ఓం విద్వజ్ఞనమనోహరాయ నమః

ఓం చారుశీలాయ నమః

ఓం స్వప్రకాశాయ నమః

ఓం చపలాయ నమః

ఓం చలితేంద్రియాయ నమః

ఓం ఉదజ్ముఖాయ నమః

ఓం మఖాసక్తాయ నమః

ఓం మగధాధిపతయే నమః

ఓం హరయే నమః

ఓం సౌమ్యవత్సర సంజితాయ నమః

ఓం సోమప్రియకరాయ నమః

ఓం సుఖినే నమః

ఓం సింహాధిరూధాయ నమః

ఓం సర్వజ్ఞాయ నమః

ఓం శిఖపర్ణాయ నమః

ఓం శివంకరాయ నమః

ఓం పీతాంబరాయ నమః

ఓం పీతవపుషే నమః

ఓం పీతచ్ఛత్రద్వాజాంచితాయ నమః

ఓం ఖడ్గచర్మధరాయ నమః

ఓం కార్యకర్త్రే నమః

ఓం కలుషహారాకయ నమః

ఓం ఆత్రేయ గోత్రజాయ నమః

ఓం అత్యస్తవినయాయ నమః

ఓం విశ్వపావనాయ నమః

ఓం చాంపేయ పుష్పసంకాశాయ నమః

ఓం చారణాయ నమః

ఓం చారుభూషణాయ నమః

ఓం వీతరాగాయ నమః

ఓం వీరభాయాయ నమః

ఓం విశుద్ధకనక ప్రభాయ నమః

ఓం బంధుప్రియాయ నమః

ఓం బంధముక్తాయ నమః

ఓం బాణమండల సంశ్రితాయ నమః

ఓం తర్కశాస్త్ర విశారదాయ నమః

ఓం ప్రశాంతాయ నమః

ఓం ప్రీతిసంయుక్తాయ నమః

ఓం ప్రియకృతే నమః

ఓం ప్రియభాషణాయ నమః

ఓం మేధావినే నమః

ఓం మాధవాసక్తాయ నమః

ఓం మిథునాధిపతయే నమః

ఓం సుధీయే నమః

ఓం కన్యారాశి ప్రియాయ నమః

ఓం కామప్రదాయ నమః

ఓం ఘనఫలాశ్రయాయ నమః

ఓం బుధగ్రహాయ నమః

ఇతి బుధ గ్రహ స్తోత్రం సంపూర్ణం||


అస్యశ్రీ బుధ స్తోత్ర మహామంత్రస్య వసిష్ట ఋషిః త్రిష్ణుప్భంద: శ్రీ బుధో దేవతా బుధగ్రహ ప్రసాద సిద్ద్యర్దే జపే వినియోగః భా మిత్యాది షడంగన్యాసః భూర్బువస్సురోమితి దిగ్భంధః

ధ్యానమ్

బుధశ్చతుర్భిర్వరదాభయాసిగదా వహంతం వరదం ప్రశాంతమ్, పీతప్రభం చంద్రసుతం సురాధ్యం సింహేనిషణ్ణం బుధమాశ్రయామి. పీతాంబరం: పీరవపు: కిరీటీ ఛ చతుర్భుజ:

పీతధ్వజపతాకీ ఛ రోహిణీ గర్భసంభవః ఈశాన్యాధిషుదేశేషు బాణాసన ఉదాబ్ముఖః నాథో మగధదేశస్య మంత్రో మంత్రారథతత్త్వవితే. సుఖాసనః కర్ణికారో హైత్రశ్చాత్రే య గోత్రవాన్, భరద్వాజ ఋషి ప్రఖ్యైర్జ్యోతిర్మండలమండితః అడిపత్యదిదేవాభ్యామన్మతో గ్ర్రహమండలే, ప్రవిష్టస్సూక్ష్మ రూపేణ సమస్తవరదస్సుఖీ. సదా ప్రదక్షిణం మేరో: కుర్వాణః సంప్రాప్త సుఫలప్రదః కన్యాయా మిథునస్యాపి రాశేరథిపతిర్ధ్వయో:

ముద్గదాన్యప్రదో నిత్యం మార్త్యా మర్త్యసురార్చితః యస్తు సౌమ్యేన మనసా స్వమాత్మనం ప్రపూజయేత్, తస్య వశ్యో భవేన్నిత్యం సౌమ్యనామధరో బుధః బుధస్తోత్రమిదం గమ్యం వసిష్టోనోదితం పురా, దిలీపాయ ఛ భక్తాయ యాచమానాయ భూభ్రుతే. యః పఠేదేకవారం వా సర్వాష్టమవాప్నుయాత్, స్తోత్రరాజమిదం పుణ్యం గుహ్యాద్గుహ్యతమం మహాత్.

ఏకవారం ద్వివారం వా త్రివారం యః పఠేన్నరః తస్యాపస్మారకుష్టాదివ్యాధిబాధా స విద్యతే. సర్వగ్రహకృతాపీడా పఠితే స్మిన్న విద్యతే, కృత్రి మౌషధదుర్మంత్రం క్రుత్రిమాదివిశాచరై: యదృద్భయం భవేత్తత్ర పఠితే స్మిన్ నవిద్యతే, ప్రతీమ యా ఛ స్వర్నేణ లీఖీతా తు భుజాష్టకా. మఉద్గదాన్యోపరి స్వప్తపీతవస్త్రాన్వితే ఘటే, విన్యస్య విధినా సమ్యక్ మాసమేకం నిరంతరమ్. యే పూజయంతి తే యాంతి దీర్ఘమాయు: ప్రజాధనమ్, ఆరోగ్యం భాస్మగుల్యాదిసర్వవ్యాధి వినాశనమ్. యం యం కామయత్ సమ్యక్ తత్తదాపొస త్యసంశయః ఇతి శ్రీస్కాందే పురాణే బుధస్తోత్రం సంపూర్ణమ్

బుధుడు రాశులు

[మార్చు]

బుధుడు కన్యారాశిలో 15 డిగ్రీలలోఉచ్ఛ స్థిలోనూ, మీన రాశిలో 15 డిగ్రీలలోపరమ నీచ స్థితిలోనూ ఉంటాడు. కన్యారాశి బుధునికి త్రికోణ స్థానం. శత్రు క్షేత్రం కర్కాటక రాశి. విషమ క్షేత్రం కర్కాటక రాశి. మిత్ర క్షేత్రములు వృషభ రాశి, తులా రాశి, సింహ రాశి. సములు కుంభరాశి, మకర రాశి, మేష రాశులు, వృశ్చిక రాశులు, ధనస్సు, మీనములు. రాశిలో 30 డిగ్రీల వరకు శుభఫలితం ఇచ్చాడు. బుధుడు ఒక రాశిలో ఒక నెల రోజులు ఉంటాడు. దిన చలనం ఒక డిగ్రీ. లగ్నంలో దిగ్బలం చెందుతాడు. గోచార రీత్యా బుధుడు 2, 4, 6, 11 స్థానములలో శుభుడు. గోచార రీత్యా అశుభ స్థానములు 1, 3, 5, 7, 8, 9, 12. వేధ స్థానములు 3, 5, 9, 12. దశాసంవత్సరములు పదిహేడు.

బుధుడు మరికొన్ని విషయాలు

[మార్చు]
  • బుధుడు సూర్యుడితో చేరి 1, 4, 8 స్థానాలలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి చక్రవర్తి స్థానానికి ఎదిగి భోగభాగ్యాలను అనుభవిస్తారు.
  • బుధుడు మిధునంలో ఉన్నప్పుడు అధికారప్రాప్తి, కన్యలో ఉన్నప్పుడు ఉన్నత పదవి పొందుతారు.

ద్వాదశ స్థానములలో బుధుడు

[మార్చు]
  • లగ్నములో బుధుడు ఉన్న జాతకుడు దీర్ఘాయువు, మృదుమధుర వాక్కులు పలికేవాడు, హాస్యచతురుడు ఔతాడు.
  • ద్వితీయస్థానమున బుధుడు ఉన్న జాతకుడు స్వశక్తితో ధనమును సంపాదించు వాడు, ఆకర్ష్ణీయంగా మాటాడు వాడు, ప్రస్పుటముగా మాటాడు వాడు, భోజన ప్రియుడు ఔతాడు.
  • తృతీయమున బుధుడు ఉన్న జాతకుడు ధైర్యశాలి, శౌర్యం కల వాడు, సమ ఆయుషు కలవాడు, మంచిసోదరులు కలవాడు, త్వరితంగా అలసట పొందువాడు ఔతాడు.
  • చతుర్ధభావమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, హాస్యవిశారదుడు, భూమి కలవాడు, మిత్రులు కలవాడు, ధాన్యసమృద్ధి కలవాడు, ఐశ్వర్యం కలవాడు, సంతోషం కలవాడు ఔతాడు.
  • పంచమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, సుఖవంతుడు, శైర్యవంతుడు, మంత్రవిద్యాభిలాషి, సంతానవంతుడు ఔతాడు.
  • ష్టమ భావమున బుధుడు ఉన్న జాతకుడు వివాదాస్పదుడు, క్రోధము కలవాడు, నిష్టుర వాక్కులు పలుకు వాడు, శత్రువులను నాశనం చేయువాడు ఔతాడు.
  • సప్తమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, ఔన్నత్యం కల వాడు, ధనసంపన్నత కలిఉగిన భార్య కలిగిన వాడు, అందమైన వస్తధారణ చేయువాడు ఔతాడు.
  • అష్టమ స్థానమున ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగిన వాడు, చిరంజీవి, కుటుంబానికి అండగా ఉండే వాడు, ప్రభువు లేక సైన్యాధ్యక్షుడు ఔతాడు.
  • నవమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్య, ఐశ్వర్యం, సచ్చరిత్ర, ఆచారము, ప్రావీణ్యం, స్వచ్ఛమైన పలుకులు కలిగిన వాడు ఔతాడు.
  • బుధుడు దశమస్థానమున ఉన్న జాతకుడు మంచి విద్య, సకలకార్య విజయం, శక్తివంతుడు, మేధా సంపన్నుడు, సుఖము కలవాడు, సత్ప్రవర్తన, సత్యవాక్కు పలుకు వాడు ఔతాడు.
  • ఏకాదశ స్థానమున ఉన్న జాతకుడు చిరంజీవి, సత్యసంధుడు, బహుధనవంతుడు, సుఖజీవి, సేవాజనము కలవాడు ఔతాడు.
  • ద్వాదశ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు కష్టజీవి, విద్యాహీనుడు, నమ్రత కలిగిన వాడు, క్రూరుడు, తేజోహీనుడు ఔతాడు.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://www.astroved.com/astropedia/en/planets/budha
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Dalal2010 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు