బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్
బుల్లెట్‌ప్రూఫ్ తొడుగు' లేదా బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ను తుపాకీ కాల్పుల నుండి రక్షణకు ఉపయోగిస్తారు. దీనిని ఎక్కువగా ప్రముఖ వ్యక్తులు ప్రాణ రక్షణకు ఉపయోగిస్తారు. యుద్దాలలో సైనికులు కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తారు.
పనితీరు
[మార్చు]తుపాకీ పేల్చినప్పుడు దూసుకు వచ్చే బుల్లెట్ విపరీతమైన వేగంతో ప్రయాణించి లక్ష్యాన్ని తాకుతుంది. ఆ వేగం వల్ల ఏర్పడే శక్తివిధ్వంసాన్ని సృష్టిస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ జాకట్టు ప్రత్యేకంగా తయారు చేయడం వల్ల దాన్ని తాకే తుపాకీగుండు యొక్క శక్తి ఒకే చోట కేంద్రీకృతమవకుండా నలుదిక్కులకు చెదిరిపోతుంది. అంతేకాకుండా ఆ జాకెట్‌కు తగలగానే తుపాకి గుండు ఆకారం కూడా మారిపోవడంతో ఒకవేళ ఆ తూటా ఆ కోటును దాటి దాన్ని ధరించిన వారికి తగిలినా లోతైన గాయం ఏర్పడదు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను దృఢమైన స్టీలు పలకలతో తయారు చేస్తారు. కొన్ని మందు గుండు సామాగ్రులు(Ammunition) స్టీలు గుండా కూడా చొచ్చుకొని పోయేలా ఉండడంతో బుల్లెట్ ప్రూఫ్ జాకట్లను కూడా మరింత దృధమైన పదార్థాలతో రూపొందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పింగాణీ, టిటానియం లాంటి తెలిక పదార్థాలతో చేసే సన్నటి పొరలు ఒకదానిపై ఒకటి ఉండేలా వీటిని చేస్తున్నారు. ఇవి స్టీలు జాకెట్ల కన్నా ఎంతో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా తేలికగా కూడా ఉంటున్నాయి. ఈ పదార్థాలతో పాటు కెవ్‌లార్(Kevlar) అనే పదార్థం నుంచి తీసిన దృఢమైన పోగులతో వలలాగా అల్లుకుని ఉండేలా ఈ జాకెట్లను చేస్తారు. దీన్ని తాకే తుపాకీగుండు ఈ వలలో చిక్కుకొని తన శక్తిని, ఆకారాన్ని కోల్పోంతుంది. అందువల్ల దీన్ని ధరించిన వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగదు.