బొబ్బ
Blister on foot caused by wearing flip flops. | |
m:en:ICD-10 | {{{m:en:ICD10}}} |
m:en:ICD-9 | {{{m:en:ICD9}}} |
DiseasesDB | 1777 |
m:en:MedlinePlus | 003239 |
MeSH | {{{m:en:MeshID}}} |
బొబ్బ (ఆంగ్లం: Blister) చర్మం లేదా శ్లేష్మపు పొరలలో ఏర్పడే ద్రవాల్ని కలిగిన తిత్తులు. ఇవి అధిక రాపిడి, అగ్ని లేదా కొన్ని రసాయనాలు, అంటు వ్యాధులలో ఏర్పడతాయి. చాలా బొబ్బలు సీరం లేదా ప్లాస్మాతో నిండివుంటాయి. అయినా కొన్ని రకాల బొబ్బలు రక్తం లేదా చీము కలిగివుంటాయి.
తెలుగు భాషలో[1] బొబ్బ కు కేక, పెద్దఅరుపు అని కూడా అర్ధమున్నది. పొక్కు. అగ్గిబొబ్బలు ఒక రకమైన బొబ్బలు.
కారణాలు
[మార్చు]రాపిడి
[మార్చు]చర్మం మీద అతిగా రాపిడి కలిగించడం వలన బొబ్బలు ఏర్పడతాయి. ఇవి కొత్త చెప్పులు ధరించిన కొత్తలో సామాన్యంగా చూస్తాము.[2][3][4] అందువలన బొబ్బలు చేతులకు, ఎక్కువ దూరాలు నడిచినా పరుగెత్తినా పాదాలలో కలుగుతాయి. బొబ్బలు చర్మం తడిగా ఉన్నప్పుడు, ఉష్ణ ప్రాంతాలలో త్వరగా ఏర్పడతాయి,[5] ఇదే దాపిడి ఎక్కువ కాలంగా తక్కువ మోతాదులో కలిగితే ఆనెలు ఏర్పడతాయి. ఇవి రెండూ కూడా పుండుగా మారే ప్రమాదం ఉంటుంది. మధుమేహం, మరికొన్ని నరాల లేదా రక్తనాళాల వ్యాధులలో ఈ విధంమైన కాంప్లికేషన్ చూస్తాము.
ఉష్ణోగ్రత
[మార్చు]బయటవుండే ఉష్ణోగ్రతలో అధిక వ్యత్యాసం కలిగినప్పుడు బొబ్బలు ఏర్పడతాయి. ఇవి అగ్ని ప్రమాదాల మూలంగా చర్మం కాలినప్పుడు సాధారణంగా చూస్తాము. అలాగే అతిగా చలిగా ఉండే ప్రాంతాలలో మంచు మీద నడిచినప్పుడు కూడా పాదాలు బొబ్బలెక్కుతాయి.
వ్యాధులు
[మార్చు]కొన్ని రకాల వైరస్ సంబంధిత వ్యాధులలో చర్మం లేదా శ్లేష్మ పొరలు బొబ్బలెక్కుతుంది. ఉదా: మశూచి, ఆటలమ్మ
మూలాలు
[మార్చు]- ↑ బ్రౌన్ నిఘంటువు ప్రకారం బొబ్బకు అర్ధాలు.[permanent dead link]
- ↑ [Naylor PFD. "The Skin Surface and Friction," British Journal of Dermatology. 1955;67:239-248.]
- ↑ [Naylor PFD. "Experimental Friction Blisters," British Journal of Dermatology. 1955;67:327-342.]
- ↑ [Sulzberger MB, Cortese TA, Fishman L, Wiley HS. "Studies on Blisters Produced by Friction," Journal of Investigative Dermatology. 1966;47:456-465.]
- ↑ [Carlson JM. "The Friction Factor," OrthoKinetic Review. Nov/Dec 2001;1(7):1-3.]