Jump to content

బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ

వికీపీడియా నుండి
(బ్రాండిక్స్ ఇండియా అపెరల్‌ సిటీ నుండి దారిమార్పు చెందింది)
బ్రాండిక్స్ఇం డియా అపెరల్‌ సిటీ

బ్రాండిక్స్‌ ఇండియా అపెరల్‌ సిటీ విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం వద్ద వున్న వస్త్ర పరిశ్రమ. ఈ పరిశ్రమలో వస్త్ర తయారీ, ఉత్పత్తి, ఎగుమతులు జరుగుతాయి.శ్రీలంకకు చెందిన బ్రాండిక్స్‌ వస్త్ర పరిశ్రమ గ్రూపు ఈ పరిశ్రమను ప్రమోట్ చేసింది. సుమారు వెయ్యి ఎకరాల్లో విస్తరించి వున్న ఈ పరిశ్రమలో 22 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో 18 వేల మంది గ్రామీణ మహిళలు. బ్రాండిక్స్‌ ఇండియా భారతీయ భాగస్వామి పచ్చిపాల దొరస్వామి ( పిసి దొరస్వామి ) బ్రాండిక్స్‌ ఇండియా అపెరల్‌ సిటీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.

బ్రాండిక్స్‌ ఉపాధితో మహిళలు పొందే ప్రయోజనాలు

  • ప్రారంభ జీతం నెలకు రూ.7,700/- + సర్వీస్ అలవెన్సు రూపంలో ఐదేళ్లలో మరో రూ.1200/- కలిపి దాదాపు రూ.9000/- పొందే అవకాశం
  • ప్రతీ ఆరు నెలలకు డి.ఏ. సవరణ ప్రకారం వేతనం పెరిగే అవకాశం.
  • బస్సు సదుపాయం నెలకు రూ.350/-లు
  • బస్సు రాకపోకల కొరకు జిపిఎస్ టెక్నాలజీతో అనుసంధానం చేసి ప్రమాద నివారణ కొరకు నిఘా కెమెరాలతో పర్యవేక్షణ
  • రూ.6/- లకు సబ్సిడీపై క్యాంటీన్ నందు ఆహారం
  • ప్రతీ యూనిట్ నందు వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది
  • ఒక ఏడాది సర్వీసు పూర్తి చేసిన యువతులకు వివాహ సమయంలో రూ.10,000/- పెళ్లి కానుక గా ఇచ్చి పెళ్లి రోజున కారు సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు.
  • నెలలు నిండిన గర్భిణీ ఉద్యోగులకు ఆరునెలల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు సౌకర్యం కలదు.
  • ఉద్యోగుల ఐదేళ్లలోపు చిన్నారులకు కంపెనీ నందు శిశు రక్షణ కేంద్రం ( క్రష్ సెంటర్ ) సౌకర్యం కలదు.
  • ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు ఈ ఎస్ ఐ వైద్య సదుపాయం కలదు.
  • వృత్తిలో నైపుణ్యం వారికి గుర్తింపుగా నెలకు రూ 500/- నుండి 1000/- వరకు ఇన్సెంటివ్ లభించును.
  • 5ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు రూ.10,000 నగదు బహుమతి ఇవ్వబడును.
  • ఐదేళ్ల తర్వాత ఉద్యోగ విరమణ చేసినట్లయితే సుమారుగా రూ 2,00,000/- ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ రూపంలో లభించును.

బ్రాండిక్స్‌ ద్వారా అమలు చేయబడుతున్న సంక్షేమ కార్యక్రమాలు

బ్రాండిక్స్ ఇండియా భాగస్వామి దొరస్వామి నేతృత్వంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఇప్పటివరకూ విశాఖ జిల్లాలో 35 వేల మందికి పైగా కంటి పరీక్షలు జరిపి, వారిలో 3500 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేయించారు. 50 కి పైగా నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించారు. 31 మెడికల్ క్యాంప్ లు, క్యాన్సర్ క్యాంప్ లు చేపట్టి  సుమారు 10 వేల మంది గ్రామీణ ప్రాంతాల మహిళలకు వైద్యసహాయమందించారు. పాఠశాల విద్యార్ధులకు 10 లక్షల శానిటరీ నాప్ కిన్ లు అందజేస్తున్నారు. గత 31 వారాలుగా గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రతి ఆదివారం శానిటరీ నాప్ కిన్ లు పంపిణీ చేస్తున్నారు. పాఠశాలల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్.ఓ వాటర్ ప్లాంట్ లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.



మూలాలు

[మార్చు]