మంచాళ జగన్నాధరావు
మంచాల జగన్నాధ రావు | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
మూలం | ఆంధ్ర ప్రదేశ్ |
సంగీత శైలి | వీణ |
వృత్తి | ఆకాశావాణి హైదరాబాదు కేంద్రంలో వీణ అర్టిస్టు |
మంచాళ జగన్నాధరావు ప్రముఖ వైణిక విద్వాంసుడు. కర్ణాటక సంగీతం, హిందూస్తానీ సంగీతం రెండూ వీణపై వాయించేవాడు.
జీవిత విశేషాలు
[మార్చు]వైణికులుగా జగన్నాథ రావు గుర్తింపు పొందాడు. అతను కర్ణాటక, హిందూస్థానీ సంగీతంలో ప్రావీణ్యుడు. అతనికి 10శాతం దృష్టి ఉన్నప్పుదు ఒక సినిమాలో "మా మంచి పాపాయి" అనే పాటను స్వరపరచి పాడాడు. ఆ తరువాత ఆయన పూర్తిగా అంధుడైనాడు. రేడియో సంగీత కార్యక్రమాలలో అతని వీణ ద్వారా సంగీత సహకారాన్ని అందించేవాడు.
అతను మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో పనిచేసాడు. ఆకాశవాణి పాట్నాలో కొంతకాలం పనిచేశాడు. 1954లో హైదరాబాదుకు బదిలీ అయ్యాడు. 1981 లో పదవీవిరమణ చేశాడు. గీత శంకరం (సంస్కృతం), రాధావంశీధరవిలాస్ (హిందీ) సంగీత రూపకాలకు స్వరరచన చేశాడు. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు రచనలను నొటేషన్‌తో ప్రచురించాడు. (తిరుమల తిరుపతి దేవస్థానం సహాయంతో). కొన్ని వందల అన్నమయ్య కీర్తనలను స్వరపరిచాడు. ఎంకి పాటలకు నండూరి సుబ్బారావుతో కలిసి బాణీ తయారుచేసి రేడియోలో పాడించాడు. స్వీయరచనలైన లలితగీతాలను, పలు భావకవుల గీతాలను స్వరపరిచి నొటేషన్ తో 'ఆధునిక సంగీతం' పేరుతో రెండు సంపుటాలుగా ప్రచురించారు.
ఉద్యోగ జీవితం
[మార్చు]వీరి సోదరులు వాడ్రేవు పురుషోత్తం ఆకాశవాణి హైదరాబాదులో కలసి పని చేశారు. జగన్నాథరావు హైదరాబాదు కేంద్రంలో వీణ అర్టిస్టుగా చేరి ఆతర్వాత సంగీత విభాగం ప్రొడ్యుసర్ గా రెండున్నర దశాబ్దాలు పని చేశారు. 1984 లో రిటైరయ్యారు. జగన్నాథరావు హైదరాబాదులో పరమ పదించారు. నేత్ర వ్యాధి తో వారు బాధ పడినా చక్కటి వీణావాదన చేసి శ్రోతల్ని మంత్ర ముగ్ధుల్ని చేసే వారు. అలహాబాదు పాట్నా కేంద్రాలలో హిందూస్థానీ ప్రొడ్యూసర్ గా చేశారు. [1]
రచనలు
[మార్చు]లలిత గీతాలు
[మార్చు]గ్రంథాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Remembering a Carnatic maestro". GUDIPOODI SRIHARI. ద హిందూ. 2006-02-10.