మంచి గంధము కుటుంబము
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(అక్టోబరు 2016) |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఈ కుటుంబములో చెట్లు గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంటరి చేరిక గానైనను, అభిముఖ చేరిక గానైన నుండును. సమాంచలము కణుపు పుచ్చము లుండవు. ఏనెలు పెద్దవి గావు. కొన్నిటి ఆకులు చిన్నవిగా బొల్సుల వలెనే యుండును. కొన్నిటికి లేనేలేవు. పువ్వులు చిన్నవి. ఆకుపచ్చగా నుండును. సరాళము. పుష్పనిచోళము కొన్నిటిలో ఉచ్చముగను కొన్నిటిలో నీచముగ నున్నది. మిధున పుష్పములు ఏకలింగ పుష్పములు కూడా గలుగు చున్నవి. పుష్ప విచోళపు తమ్మెలు చివర సన్నని ముల్లు వంటి దొకటి ఉంది. కింజల్కములు 3--6 పుష్ప నిచోళము నంతి కొని దాని తమమెలకెదురుగా నుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు. అండాశయములో అందములు రెండో మూడో వ్రేలాడు చుండును. కాయ కొన్నిటిలో లోపెంకు కాయ. మరి కొన్నిటిలో బగులని యెండు కాయ.
మంచి గంధపు చెట్లు విస్థారముగా పడమటి కనుమల మీదను, కూర్గు వద్దను బెరుగు చున్నవి. ఇవి చెట్లైనను గొంత గొంత వరకు బారాన్న భుక్కులు గానున్నవి. వీని వేరులు వ్యాపించి ఇతర వృక్షముల వేరులలో జొచ్చి అవి సంపాదించినా ఆహారమును తస్కరించు చున్నవి. మంచి గంధపుటాకులు నిడివి చౌక పాకారము పువ్వులు చిన్నవి. మొదట పచ్చగా నుండి తరువాత ఊదా అగును. ఆకులకు గాని, పువ్వులకు గాని చెట్తు బెరడునకు గాని సువాసన లేదు. మాను మధ్యనున్న దారువునకే గలదు. ఈ చందనములో శ్రీ చందనము, పీత చందనము, రక్త చందనము మొదలగు భేదములు వున్నవని అను చున్నారు. మొదటి రెండును ఈ చెట్టు యొక్క మంచి రకము. చెడ్డరకములే గాని రక్త చందనము దీనిది గాదు. ఈ రక్త చందనము తోడనే చందనపు బొమ్మలు చేయుదురు. ఈ చెట్టు చిక్కుడు కుటుంబము లోనిది. మంచి గంధపు చెట్లు ఎక్కువగా దక్షిణ దేశము నందుండినను చమురు దీయుట లేదు. మంచి గంధపు నూనె, అయోద్య వద్దను, హిందూ స్థానమందలి వరి కొన్ని పట్టణములలోను చేస్తున్నారు. మంచి గంధపు చెక్కను పొడి గొట్టి రెండు దినముల నీళ్ళలో నాననిచ్చి బట్టి పట్టుదురు. నూనెయు నీళ్ళతో గలిసి ఆవిరియై రెండును జల్లారి నీళ్ళమీద నూనె దేలుచుండును. త్రువాత దీనిని వేరు వేరు విధముల పరి శుభ్రము చేసెదరు. ఒక్కొక్కప్పుడు మడ్డి అంతయు బోవుటకు నొక సంవత్సరము వరకు నూనెను అట్లే యుంచెదరు.
మంచి గంధము ఔషదములలో గూడ వాడుదురు. ఇది ముఖ్యమౌ పరిమళ ద్రవ్యములలో ఒకటి. బొట్టు పెట్టుకొనుటకు దీనినుపయోగింతుము. గౌరవము చూచించుటకై గంధము రాయు చుందురు. వివాహాది శుభ కార్యములలోనీ చెక్కను వాడుదురు.