మహాత్మా గాంధీ సముద్ర జాతీయ వనం
(మహాత్మా గాంధీ మెరైన్ జాతీయ ఉద్యానవనం నుండి దారిమార్పు చెందింది)
మహాత్మా గాంధీ మెరైన్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | అండమాన్, భారతదేశం |
Nearest city | వాదుర్ |
Area | 281.5 కి.మీ2 (108.7 చ. మై.) |
Established | 1983 |
మహాత్మా గాంధీ సముద్ర జాతీయ వనం అండమాన్ నికోబార్ దీవుల్లోని వండూర్ ప్రాంతంలో ఉంది.[1] ఇది దక్షిణ అండమాన్ జిల్లా లోకి వస్తుంది. గతంలో దీని పేరు వండూర్ సముద్ర జాతీయ వనం అని ఉండేది.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే సముద్ర తాబేళ్లు, సముద్ర జీవులను సంరక్షించడానికి భారత వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం ఈ వనాన్ని 1983 మే 4 న స్థాపించారు.
భౌగోళికం
[మార్చు]ఈ వనంలో రెండూ ప్రధానమైన ద్వీప సమూహాలున్నాయి - లాబ్రింత్ దీవులు, కవల దీవులు. ఈ దీవులు పోర్ట్ బ్లెయిర్ నుండి 16 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఈ సముద్ర వనం 17 దీవులతో, 281.5 చ.కి.మీ. లలో విస్తరించి ఉంది. వీటిలో జాలీ బోయ్, రెడ్ స్కిన్ అనే రెండు దీవులపై పర్యావరణ పర్యాటకానికి ఆస్కారం ఉంది. [2][3][4] ఈ దీవులన్నీ రట్‌లాండ్ ద్వీపసమూహంలో భాగం. ఇవి రట్‌లాండ్ దీవికీ, దక్షిణ అండమాన్ దీవికీ మధ్య ఉన్నాయి.
ఈ వనం లోని ద్వీపాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Village Code Directory: Andaman & Nicobar Islands" (PDF). Census of India. Retrieved 2011-01-16.
- ↑ [1]
- ↑ Jolly Buoy Island, More information, Reaching there, and boat schedules
- ↑ red skin island