మాధబి పూరి బుచ్

వికీపీడియా నుండి
(మాధబి పూరి బుచ్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మాధవి పూరి బచ్
సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్
Assumed office
2022 మార్చి 2 - ప్రస్తుతం
వ్యక్తిగత వివరాలు
జననం (1966-01-12) 1966 జనవరి 12 (వయసు 58)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
జీవిత భాగస్వామిధవళ్ బచ్
తల్లిదండ్రులుకమల్ పూరి
చదువుఎంబీఏ, ఐఐఎం అహ్మదాబాద్
కళాశాలఐఐఎం అహ్మదాబాద్

మాధబి పూరి బుచ్ (ఆంగ్లం: Madhabi Puri Buch; జననం 1966 జనవరి 12) క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) చైర్మన్ పదవి చేపట్టిన తొలిమహిళ. 2002 మార్చి 2తో మూడేళ్ల పదవీకాలం ప్రారంభమవుతుంది. ఈ పదవిలో 2002 తర్వాత భారత పరిపాలనసేవల లోని వ్యక్తి కాకపోవడం కూడా విశేషం.[1][2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మహారాష్ట్ర లోని ముంబైలో 1966 జనవరి 12న జన్మించిన మాధబి పూరి బుచ్, ప్రాధమిక విద్యాభాస్యం ఢిల్లీ హైస్కూల్ లో జరిగింది. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా, పొందింది. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. 2008 నవంబరు 26న ముంబైలో టెర్రిరిస్టుల దాడి జరిగినప్పుడు చిక్కుకుపోయిన కార్పొరేట్‌ లీడర్లలో ఈమె ఒకరు.[3]

వృత్తి జీవితం

[మార్చు]

మాధవి పూరి బచ్ 1989లో ఐసిఐసిఐ బ్యాంక్‌లో చేరి వివిధ హోదాల్లో పని చేసింది. మార్కెటింగ్ & సేల్స్ విభాగాధిపతి గా 1997 నుండి 2002 వరకు, ఉత్పత్తి అభివృద్ధి విభాగాధిపతిగా 2002 నుండి 2003 వరకు, 2004 నుండి 2006 వరకు రోజువారి కార్యక్రమాల అధిపతిగా, 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే, వరకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు నిర్వహణ సంచాలకునిగా, ప్రధాన నిర్వహణ అధికారి గా బాధ్యతలు నిర్వహించింది. 2011లో సింగపూర్‌ లో గ్రేటర్‌ పసిఫిక్‌ క్యాపిటల్‌ లో వ్యాపార అభివృద్ధి విభాగాధిపతిగా, 2011 నుండి 2017 వరకు ఐడియా సెల్యూలర్ సంచాలక మండలిలో కార్యనిర్వాహక బాధ్యత లేని సంచాలకునిగా, 2017 ఏప్రిల్ 5 నుంచి 2021 అక్టోబరు 4 వరకు సెబీ పూర్తి స్థాయి సభ్యురాలుగా పని చేసింది.[4] ఆమె 2022 ఫిబ్రవరి 28న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా చైర్మన్‌గా నియమితురాలై[5][3] 2022 మార్చి 2న చైర్మన్‌గా భాద్యతలు చేపట్టింది. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు పని చేయనుంది.[6]

మూలాలు

[మార్చు]
  1. Telugu, TV9 (2022-02-28). "Madhabi Puri Buch: సెబీ తొలి ఛైర్‌పర్సన్‌గా మాధబి పూరి బుచ్‌.. అజయ్ త్యాగి స్థానంలో నియామకం." TV9 Telugu. Retrieved 2022-03-01.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Hindu (6 March 2022). "Madhavi Puri Buch" (in Indian English). Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
  3. 3.0 3.1 "ఎవరీ మాధవీ పురీ.. కీలక పదవి దక్కించుకున్న తొలి మహిళగా రికార్డ్‌". Sakshi. 2022-02-28. Retrieved 2022-03-03.
  4. The New Indian Express (28 February 2022). "Madhabi Puri Buch becomes Sebi's first woman chief". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
  5. Namasthe Telangana, NT News (28 February 2022). "సెబీ చైర్మ‌న్‌గా మాధవి పూరి బ‌చ్". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
  6. Andhra Jyothy (2 March 2022). "సెబీ చీఫ్‌గా మాధబి పూరి బుచ్ బాధ్యతలు స్వీకరణ..." Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.